E-Paper
Advertisement

2029 లో ఏపీ సీఎం అయ్యేది అతనేనా…ఆ పార్టీ దుకాణం సర్దేయాల్సిందేనా?

2029 లో ఏపీ సీఎం అయ్యేది అతనేనా…ఆ పార్టీ దుకాణం సర్దేయాల్సిందేనా?
Advertisement

Big Tv Kissik Talks: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు మురళీమోహన్(Murali Mohan) ఒకరు. గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న ఈయన ఇప్పటికీ నిర్మాతగా అలాగే నటుడిగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇకపోతే మురళీమోహన్ తాజాగా కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడారు. మురళి మోహన్ రాజకీయాలలో కూడా కొనసాగిన సంగతి తెలిసిందే.

2029లో సీఎం అతనేనా..

ఈయన తెలుగుదేశం పార్టీ తరఫున రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇటీవల రాజకీయాలకు స్వస్తి పలికిన మురళీమోహన్ తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే 2029లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారు నెక్స్ట్ ఏపీ సీఎం(AP Next CM) ఎవరు అనే ప్రశ్న మురళీమోహన్ కు ఎదురైంది. ఈ నేపథ్యంలోనే మురళీమోహన్ 2029లో ఏపీ సీఎం ఎవరు అనే విషయం గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు..

ప్రజాసేవ చేసేవారు మాత్రమే..

Advertisement

ఎవరైతే ప్రజాసేవ చేయడానికి అర్హత కలిగి ఉంటారో అలాంటి వారు మాత్రమే సీఎం అవ్వాలని ఈయన తెలిపారు. అర్హత ఉన్నవాళ్లు ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్లు మాత్రమే మనకు నాయకులుగా రావాలి. అలా కాకుండా ఓటు కింత డబ్బులు తీసుకుని ఏదో ఓటు వేద్దాం అన్నట్టు చేస్తే మనం ఎప్పటికీ అలాగే అడుక్కునే వాళ్ళు లాగే ఉండిపోతాం కానీ అలా గెలిచిన వాళ్ళు మాత్రం మేడలు మిద్దెలు కట్టుకొని ఎదుగుతూ ఉంటారని ఈ సందర్భంగా మురళీమోహన్ తెలిపారు. మరి అర్హత ఉండి ప్రజాసేవ చేసే నాయకులు ఎవరు? కాబోయే ఏపీ సీఎం ఎవరు అనేది తెలియాలి అంటే మరొక రెండు సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే.

Advertisement

ఇలా ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి తాజాగా మురళీమోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక మురళీమోహన్ ఇండస్ట్రీలో కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా దూసుకుపోతూ వ్యాపారవేత్తగా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో మురళీమోహన్ చాలా వరకు సినిమాలను తగ్గించారని చెప్పాలి.  కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే మురళీమోహన్ నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Also Read: ఆంధ్రప్రదేశ్ కు రాజధానే లేదు.. మూడు రాజధానులపై మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు!

Related News

ఆంధ్రప్రదేశ్ కు రాజధానే లేదు.. మూడు రాజధానులపై మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు!

అయ్యప్ప మాల వేస్తాను.. చర్చికి వెళ్లి ప్రార్థన కూడా చేస్తాను: మురళీమోహన్

నీతి నిజాయితీగా ఉంటేనే రాజకీయాలలోకి వెళ్ళండి: మురళీమోహన్

మురళీ మోహన్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?

నిర్మాతగా మల్లి సీరియల్ బ్యూటీ.. కానీ దానికంటే ముందు!

మురళీమోహన్ కు సినిమాలంటే ఇష్టం లేదా.. చిన్నప్పటినుంచి అదే కోరిక ఉండేదా?

ఎన్టీఆర్ గారితో సినిమా.. మురళీ మోహన్ కు అలాంటి కండిషన్స్ పెట్టారా?

Big Stories

Advertisement
×