E-Paper
Advertisement

ఆంధ్రప్రదేశ్ కు రాజధానే లేదు.. మూడు రాజధానులపై మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ కు రాజధానే లేదు.. మూడు రాజధానులపై మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తుంటారు. ఇక ఈవారం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్(Murali Mohan) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడారు. ఇక మురళీమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వర్ష పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే తెలంగాణ , ఆంధ్ర ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మంచిది అంటూ ప్రశ్న వేశారు.

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు..

ఈ ప్రశ్నకు మురళీమోహన్ సమాధానం చెబుతూ తెలంగాణ ఆల్రెడీ బాగా డెవలప్ చెందిన రాష్ట్రం ఇక్కడ ఎన్నో డెవలప్ చెందిన సిటీలు కూడా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనీసం రాజధాని కూడా లేదని మురళీమోహన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని మాత్రమే కాకుండా కనీసం డెవలప్ అయిన సిటీలు కూడా లేవని తెలిపారు. వైజాగ్ ,విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురం ఇవన్నీ కూడా సిటీలు కాదని,బిగ్ టౌన్స్ మాత్రమే అని మురళీమోహన్ తెలిపారు.మంచి విద్యాసంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ ఎప్పుడు కూడా అభివృద్ధి చెందిన సిటీస్ లో మాత్రమే ఉంటాయని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి చెందిన ప్రాంతం..

Advertisement

ఇక మనం అందరూ హైదరాబాద్ వచ్చాము అంటే ఇక్కడ బాగా అభివృద్ధి చెందిందని అర్థం అంటూ మురళీమోహన్ మాట్లాడారు. ఇక ఒక ప్రాంతం డెవలప్ కావాలి అంటే సరైన వనరులు ఉండాలని ఆంధ్రప్రదేశ్లో ఆ వనరులు లేవని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు ఒక క్యాపిటల్ నిర్మించాలంటే కూడా డబ్బులు లేవని అందుకే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)గారు ఆలోచించి రైతులను రిక్వెస్ట్ చేస్తూ మీ భూములు నాకు ఇవ్వండి ఇక్కడ రాజధానిని అభివృద్ధి చేసిన తర్వాత అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఎకరాకు 1200 గజాలు చొప్పున అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని మీకు ఇస్తామని చెప్పారు.

Advertisement

ఇలా అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని మీకు ఇచ్చేవరకు సంవత్సరానికి ఇంత డబ్బు చొప్పున కౌలు కింద ఇస్తామని చంద్రబాబునాయుడు చెప్పడంతో రైతులందరూ ముందుకు వచ్చి 32,000 ఎకరాల భూమిని ఇచ్చారని మురళీమోహన్ తెలిపారు. ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఇలా చేయలేదని మురళీమోహన్ తెలిపారు. ఇలా అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉండగా ఒకసారిగా గవర్నమెంట్ పడిపోయిందని, మళ్లీ వచ్చిన గవర్నమెంట్ లో అభివృద్ధి జరగకపోగా, మూడు రాజధానులు అంటూ తెరపైకి కొత్త అంశం వచ్చిందని తెలిపారు. ఇంత పెద్ద దేశానికి ఒకటే రాజధాని ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఎందుకు అంటూ ఎవరికి వాళ్లు అనుకోవడంతో డెవలప్మెంట్ ఆగిపోయిందని, ఇప్పుడు చంద్రబాబు రావడంతో మళ్లీ రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయని చంద్రబాబుతోనే ఇది సాధ్యమవుతుందని మురళీమోహన్ తెలిపారు.

Also Read: అయ్యప్ప మాల వేస్తాను.. చర్చికి వెళ్లి ప్రార్థన కూడా చేస్తాను: మురళీమోహన్

Related News

అయ్యప్ప మాల వేస్తాను.. చర్చికి వెళ్లి ప్రార్థన కూడా చేస్తాను: మురళీమోహన్

నీతి నిజాయితీగా ఉంటేనే రాజకీయాలలోకి వెళ్ళండి: మురళీమోహన్

మురళీ మోహన్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?

నిర్మాతగా మల్లి సీరియల్ బ్యూటీ.. కానీ దానికంటే ముందు!

మురళీమోహన్ కు సినిమాలంటే ఇష్టం లేదా.. చిన్నప్పటినుంచి అదే కోరిక ఉండేదా?

ఎన్టీఆర్ గారితో సినిమా.. మురళీ మోహన్ కు అలాంటి కండిషన్స్ పెట్టారా?

సమంతకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన కంటెస్టెంట్.. క్రేజీ రియాక్షన్ వైరల్!

Big Stories

Advertisement
×