E-Paper
Advertisement

అయ్యప్ప మాల వేస్తాను.. చర్చికి వెళ్లి ప్రార్థన కూడా చేస్తాను: మురళీమోహన్

అయ్యప్ప మాల వేస్తాను.. చర్చికి వెళ్లి ప్రార్థన కూడా చేస్తాను: మురళీమోహన్
Advertisement

Big Tv Kissik Talks: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఇప్పటికీ మాలలో కనిపిస్తూ ఉంటారు ముఖ్యంగా మెగా హీరో రామ్ చరణ్ ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరించి దర్శనమిస్తూ ఉంటారు. అయితే గత 40 సంవత్సరాలుగా తాను కూడా అయ్యప్ప మాల వేస్తున్నాను అంటూ సీనియర్ నటుడు మురళీమోహన్(Murali Mohan) తెలియజేశారు. బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్న మురళీమోహన్ ను యాంకర్ ప్రశ్నిస్తూ ఇటీవల కాలంలో మీరు చూసిన సినిమా ఏదైనా ఉందా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మురళీమోహన్ సమాధానం చెబుతూ ఇరుముడి సినిమా చూశానని తెలిపారు..

నడిచినంత కాలం శబరిమల కొండకు.

రవితేజ హీరోగా నటించిన ఇరుముడి సినిమా అయ్యప్ప స్వామి(Ayyappa Swami) నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మీరు కూడా మాల వేస్తారా సార్ అంటూ ప్రశ్న వేయడంతో తాను గదా 40 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేస్తున్నానని మురళీమోహన్ తెలిపారు. తాను డోలి ఎక్కకుండా నడిచి వచ్చినంత కాలం మాల వేస్తానని మొక్కుకున్నాను అయితే మోకాలికి సర్జరీ చేయడం వల్ల తాను శబరిమల కొండ ఎక్కలేకపోతున్నానని అందుకే మాల వేసుకున్న తర్వాత రాజమండ్రిలోనీ అయ్యప్ప స్వామి ఆలయంలో తాను ఇరుముడి ఇస్తున్నానని ఈ సందర్భంగా మురళీమోహన్ తెలిపారు.

మసీదుకు వెళ్లి నమాజ్ చేస్తాను..

Advertisement

ఇక అయ్యప్ప మాల వేసుకున్నాను అంటే అందరిలాగా వారం పది రోజులు వేయనని కచ్చితంగా తాను 40 రోజులు మాలలో దీక్ష చేస్తానని ఈ సందర్భంగా మురళి మోహన్ తెలిపారు. ఇలా ఇప్పటికి 39 సార్లు వేశాననీ, ఈ ఏడాదితో 40 సార్లు అవుతాయని మురళీమోహన్ చెప్పడంతో అయ్యప్ప స్వామి అంటే ఇష్టమా లేదంటే భక్తితో వేస్తున్నారా అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు మురళి మోహన్ సమాధానం చెబుతూ దేవుడంటే నాకు నమ్మకం. తాను ఏదైనా ఒక ఊరికి వెళ్లాను అంటే అక్కడ చర్చి ఖచ్చితంగా చర్చి లోపలికి వెళ్లి తాను ప్రార్థనలు చేస్తాను, అలాగే మసీదు ఉంటే అక్కడ కూడా వాళ్ల పద్ధతి ప్రకారం నమాజ్ చేస్తూ నమస్కరించుకుంటానని తెలిపారు.

Advertisement

పలానా దేవుడిని మొక్కాలని రూల్ లేదు ఎవరికి నచ్చిన విధంగా వారు దేవుడిని మొక్కవచ్చని ఈయన తెలిపారు. దేవుడికి రెండు చేతులు జోడించి దండం పెడితే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇక దేవుడిని ఎక్కువగా మీరు కోరుకునే కోరిక ఏంటి అనే ప్రశ్న వేయడంతో తాను దేవుడిని నమస్కరించేటప్పుడు ఎలాంటి కోరికలు కోరుకోనని తెలిపారు. మనం భక్తితో ఉంటే దేవుడు మనకేం కావాలో అదే ఇస్తాడు. మనం చదువుకుండా పరీక్షలలో 100 మార్కులు రావాలి అంటే రావు. వ్యాపారంలో సక్సెస్ కావాలని ,సినిమా చేస్తే 200 రోజులు ఆడాలనీ కోరుకోకూడదు. మనం ప్రయత్నం మనం చేస్తే సినిమా నచ్చితే సక్సెస్ చేస్తారు లేదంటే లేదని ఈ సందర్భంగా దేవుళ్ళని నమస్కరించడం గురించి మురళీమోహన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .

Also Read: నీతి నిజాయితీగా ఉంటేనే రాజకీయాలలోకి వెళ్ళండి: మురళీమోహన్

Related News

నీతి నిజాయితీగా ఉంటేనే రాజకీయాలలోకి వెళ్ళండి: మురళీమోహన్

మురళీ మోహన్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?

నిర్మాతగా మల్లి సీరియల్ బ్యూటీ.. కానీ దానికంటే ముందు!

మురళీమోహన్ కు సినిమాలంటే ఇష్టం లేదా.. చిన్నప్పటినుంచి అదే కోరిక ఉండేదా?

ఎన్టీఆర్ గారితో సినిమా.. మురళీ మోహన్ కు అలాంటి కండిషన్స్ పెట్టారా?

సమంతకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన కంటెస్టెంట్.. క్రేజీ రియాక్షన్ వైరల్!

సుధీర్ కి వర్షిణి స్ట్రాంగ్ కౌంటర్.. అండగా త్రిగుణ్!

Big Stories

Advertisement
×