Gundeninda GudiGantalu Today episode December 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి, మీనా, కామాక్షిలు రవిని ఇంటికి రప్పించేందుకు సత్యం ను ఒప్పించాలని ప్లాన్ చేస్తారు. నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ సత్యం ఒప్పుకోడు.. రవిని క్షమించే పరిస్థితి లేదని తెగేసి చెప్తాడు. దానికి బాలు విన్నారుగా మా నాన్న నిన్న ఏమి ఫైనల్ అనేసి అంటాడు. రవి ఉదయం రెస్టారెంట్లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. బాలుని శృతి తిడుతుంది. ఆ మీనా బాలును ఎలా భరిస్తుందో తెలియట్లేదు. రోజు గొడవలు పడుతుంటే ఇక నా వల్ల కాదు అని రవితో గొడవ పడుతుంది.. ఆ ఇంటికి వెళ్ళనవసరం లేదు. మీ అన్నయ్య రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు. నాకంటూ ఓ ఫ్యామిలీ ఉంది. అన్నదమ్ములు చెల్లెలు అందరూ ఉన్నారు. వారిని విడిచి ఉండడం నావల్ల కావడం లేదు. నువ్వే అర్థం చేసుకో.. ఆ బంధాలు ఆ బంధుత్వాలు వేరు’ అని రవి శృతికి నచ్చజెప్పి ప్రయత్నం చేస్తాడు. మరోసారి ఇంటికి వెళ్దామని చిన్న పిల్లాడిలా మాట్లాడకు అని అనగానే రవి సైలెంట్ అయిపోతాడు.. ఇక శృతి కూడా మౌనంగా ఉంటుంది. బాలు ఒళ్ళు నొప్పులు ఉన్నాయని అలసిపోయి ఇంటికి వస్తాడు. మీనా.. బామ్ రాస్తానంటూ చెబుతుంది. కానీ అవి సెట్ కావాలి, మసాజ్ చేయమంటాడు. దీంతో మీనా రెచ్చిపోతుంది. బాలును బొక్క బోర్లా పడుకోబెట్టి.. వీపుపై ఎక్కి తొక్కుతుంది. అమ్మా అని అరుస్తాడు.. ఆ అరుపు విన్న ప్రభావతి కంగారుపడుతుంది. వెంటనే బాలు రూమ్ కి వెళ్లి చూస్తుంది. బాలుపై మీనా ఎక్కి తొక్కుతుండగా చూసి వాడిని చంపేస్తావ్ అనుకుంటున్నావేంటి. అని మీనాపై కోప్పడుతుంది. ఆ తర్వాత బాలుకి అనుమానం వస్తుంది. ‘ఎప్పుడు లేంది తన తల్లి పిలవగానే వచ్చింది. ఏందంటే.. మీనా ను అడుగుతాడు. ఎంతైనా మీ అమ్మ కదా నువ్వు పిలిస్తే రాదా అంటుంది. దానికి బాలు సంతోష పడతాడు.. రవి మనోజ్ కు ఫోన్ చేసి అడుగుతాడు. అది విన్న శృతి కోపంగా వెళ్ళిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..శృతి మీనాకు ఫోన్ చేసి తనని కలవాలని, అర్జెంటుగా రెస్టారెంట్ కి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. ఈ సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న శృతిని చూసి సంజీవ్ మనుషులు సంజీవ్ కి ఫోన్ చేసి చెబుతారు. శృతి ఒక్కతే ఒంటరిగా వెళుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక సంజయ్ శృతిని ఫాలో అవమని తన మనుషులకి చెప్తాడు. ఇక సంజయ్ కూడా ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావే అనేసి అంటాడు. ఇక మీనా ఆలోచిస్తూ ఉంటుంది బాలుకి చెప్తే అసలు వెళ్ళనివ్వడు.. చెప్పకుండా వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంది కానీ ఏం చేయాలనే ఆలోచిస్తుంది. బాలుకి ఎలాగైనా తెలిసేలా వెళ్లాలని బాలుపై పూలు వేస్తుంది. బాలు లేచి ఏంటి పూలగప్ప పొద్దున్నే ఈ పని పెట్టుకున్నావు అనగానే సుమతీకి ఎగ్జామ్స్ అని మా అమ్మ నా దగ్గర పంపించింది అనగానే బాలు కామ్ గా ఉంటాడు. ఇక మన రాత్రి గొడవ పడితే పొద్దున్నే ఖచ్చితంగా పూరి చేస్తావా అనేసి మీ నాన్న అడుగుతాడు. ఇక మీనా తినిపించాలని బాలు కొత్త డ్రామా మొదలుపెడతాడు. టిఫిన్ చేసిన వెంటనే బాలు వెళ్లిపోతాడు మొత్తానికి మీనా బాలు వెళ్ళగానే శృతిని కలవాలని అనుకుంటుంది.
బాలు వెళ్ళగానే మీనా శృతిని రెస్టారెంట్లు కలవడానికి వెళుతుంది. రెస్టారెంట్లో శృతి మీనా మాట్లాడుకుంటారు. ఈ సమయంలో రవి పూర్తిగా మారిపోయాడని, తనని పట్టించుకోవడం లేదంటూ కంప్లైంట్ చేస్తుంది. దీంతో మీనా రియాక్ట్ అయి.. రవి కొడుతున్నాడా? లేదా తిడుతున్నాడా? నిన్ను ప్రేమగా చూసుకుంటూ లేడా? అని ప్రశ్నిస్తుంది. ‘లేదు.. అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ.. ఎప్పుడు మమ్మీ- డాడీ, అన్న- వదిన అంటూ తనని విసిగిస్తున్నాడని, ఇంటికి వెళ్దాం అంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడంటూ కంప్లైంట్ చేస్తుంది.. మీనాకు కోపం వస్తుంది. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక. కొత్త బంధం వస్తుందంటే.. పాత బంధాన్ని పెంచుకోవాలని కాదు. అనవసరంగా రవిని అనుమానించకు, ఎవరైనా కొత్త బంధాలు వచ్చినపుడు.. పాత బంధాలు తెంచుకుంటే వారికి నిజంగా ప్రేమ లేనట్టే.. ఈరోజు నువ్వు నచ్చి నీ దగ్గరికి వచ్చాడు. అదే ఈ బంధం నచ్చలేదు.. అనుకుంటే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా ఉమ్మడి కుటుంబం గురించి ఆలోచించు.. అర్థం కాదు అన్ని సర్దుకో.. నువ్వు అర్థం చేసుకోవాలి.. రవిని అనుమానించకుండా అర్థం చేసుకో అప్పుడే మీ బంధం బాగుంటుంది అని మీనా సలహా ఇచ్చి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. మీనాతో శృతి మాట్లాడుతున్నప్పుడే సంజయ్ అక్కడికి వస్తాడు.
సర్దుకు పోతే ఆ రవిని అర్థం చేసుకుంటే అన్నీ మంచిగానే ఉంటాయి అనేసి నేను అంటుంది. నీకన్నా అంత ఓపిక నాకు లేదు నువ్వు ఇంత ఓపిగ్గా ఉన్నావు కదా మీ ఇంట్లో నిన్ను అందరూ సరిగ్గా చూసుకుంటున్నారా అనగానే నా భర్త నన్ను సరిగ్గా చూసుకుంటున్నారు మా మామయ్య మౌనిక కూడా నాతో బాగానే ఉంటున్నారు నువ్వు రవి ని అర్థం చేసుకుంటే నీకే మంచిది అని మీనా వెళ్ళిపోతుంది. శృతి మీనా తో చెప్పాలని మీ నాన్న ఆపేందుకు ప్రయత్నం చేస్తుంది కానీ మీనా వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది.. ఇక సంజయ్ శృతి పై యాసిడ్ పోయాలని వెళ్తుంటే తన మనుషులు మాస్క్ పెట్టుకుని వెళ్ళమని సలహా ఇస్తారు.. ఇక శృతి దగ్గరికి సంజయ్ వస్తాడు వేరే అబ్బాయిల జీవితంతో ఆడుకునే నువ్వు సంతోషంగా ఉండకూడదు అని యాసీడ్ పోయాలని అనుకుంటాడు. సంజీవ్ మనుషులు శృతిని పట్టుకుని ఉండగా.. యాసిడ్ బాటిల్ చూపించి భయపడతాడు. దీంతో శృతి హెల్ప్ అంటూ అరుస్తుంది. ఈ విషయాన్ని గమనించిన మీనా వెంటనే పరిగెత్తి వస్తుంది. ఎలాగైనా శృతిని కాపాడాలని రాయితో యాసిడ్ బాటిల్ ను పగలగొడుతుంది. ఆ తర్వాత సంజీవ్ పై అతని మనసులపై రాళ్లతో దాడి చేస్తుంది. ఆ హోటల్ లో ఉన్న వాళ్ళు కూడా వారిపై దాడి చేయడంతో అక్కడి నుండి సంజు, అతని మనుషులు పారిపోతారు.. మీనా శృతి దగ్గరకెళ్ళి ఓదారుస్తుంది. ధైర్యం చెబుతుంది. అనవసరంగా టెన్షన్ పడొద్దు అని ఇంటికి తీసుకు వెళుతుంది. ఇంట్లో కూర్చుని పెట్టి కుటుంబం అంటే ఏంటి? ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుంది? అనే విషయాలను చెబుతుంది.. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తుంది.
ఉమ్మడి కుటుంబంలో ఉంటే.. రక్షణ, ధైర్యం.. మనకంటూ ఒక సపోర్ట్ ఉంటుంది. ఇండివిజువల్ గా ఉంటే అలాంటి నమ్మకాలు, ధైర్యం ఉండదని, ఇప్పటికైనా అందరితో కలిసి విధంగా ఆలోచించు.. రవిని అర్థం చేసుకో అని చెబుతోంది. తనపై దాడి చేసిన వ్యక్తి ఎవరో నాని ఆలోచిస్తూ ఉంటుంది. దాడి చేసిన సమయంలో ఆ వ్యక్తి అన్నమాట గుర్తు చేసుకుంది. ఇక మీనా వాడెవడు ని మీద దాడి చేయాల్సిన అవసరం వాడికేంటి అని అంటే శృతి నన్ను పెళ్లి చేసుకోవాల్సిన వాడిని నాకు అర్థమవుతుంది అని అంటుంది. మీనా శృతిని ఓదారుస్తుంది. ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళని నేనొప్పిస్తాను మావయ్యను ఒప్పిస్తాను. మావయ్య ఒప్పుకుంటాడు నేను నమ్మకం నాకుంది అని శృతికి ధైర్యం చెబుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో బాలు మీనా పై కోప్పడతాడు. ఏం జరుగుతుందో చూడాలి..