Kakinada Port PDS Rice: కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ రైస్ విదేశాలకు ఎగుమతి వ్యవహారం తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. లేటెస్ట్‌గా తెలంగాణలో విచారణలో మొదలైంది. పోర్టుకు రైస్ తరలింపు విషయంలో కొందరు రాజకీయ నేతల ప్రమేమున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పీడీఎస్ రైస్ అక్రమ తరలింపు వ్యవహారంలో రాజకీయ నేతలకు ఇబ్బందులు తప్పవా? ఇందులో వైసీపీకి చెందిన కొందరి నేతల ప్రమేయమున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఏపీలో రైస్ మాత్రమే కాకుండా తెలంగాణ నుంచి కూడా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు రైస్ ఎగుమతి అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో విచారణ మొదలైనట్లు సమాచారం.
ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు వస్తున్న వార్తలపై అధికారులు అలర్ట్ అయ్యారు. దీనిపై సమాచారంపై విచారణ చేస్తున్నట్లు మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. ప్రస్తుతం అనుమానం ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అక్రమ రవాణాకు సహకరిస్తే సిబ్బందిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు.
కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే రేషన్ బియ్యంపై కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పీడీఎస్ రైస్‌పై విచారణ జరుగుతోంది. దీని వెనుక పెద్ద మాఫియా ఉన్నట్లు అధికారుల అంచనా. ఎందుకంటే ఏపీ పండిన రైస్ కంటే ఎక్కువగా ఎగుమతి కావడంతో ఎక్కడి నుంచి వస్తోంది అనేదానిపై దృష్టి సారించారు ఏపీ అధికారులు.
ALSO READ: హైకోర్టు ఆగ్రహం, బఫర్ జోన్‌లో నిర్మాణాలు, అనుమతులు ఎలా ఇచ్చారు?
2020-21 నుంచి కాకినాడ పోర్టు నుంచి ఎక్కువగా పీడీఎస్ రైస్ ఎగుమతి అయ్యింది. ఏపీలో ఉన్న పోర్టుల కంటే ఎక్కువగా కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి కావడంతో అధికారులు ఆ డేటాను చూసి షాకయ్యారు. చెక్ పోస్టుల్లో లావాదేవీలపై దృష్టి సారించింది. వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన బియ్యంపై ఆరా తీసే పనిలో పడింది. వాటిలో జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ నుంచి రైస్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఇదే వ్యవహారంపై బుధవారం మాట్లాడిన మాజీ సీఎం జగన్, ఓ విషయాన్ని రివీల్ చేశారు. బియ్యం ఎగుమతుల్లో తప్పేముందన్నారు. ఇదేం కొత్తకాదని, దశాబ్దాలుగా కొనసాగుతుందన్నారు. ఈ లెక్కన ఎగుమతుల్లో వైసీపీ నాయకులు ఉందనే విషయాన్ని బయట పెట్టినట్టు కనిపిస్తోంది.
అమరావతిలో బుధవారం కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో రైస్ ఎగుమతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను సున్నితంగా హెచ్చరించారు. అక్కడికి వెళ్లిన మంత్రిని అధికారులు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఇకపై ఆపకుంటే చర్చలు తప్పవని చెప్పకనే చెప్పారు.
జగన్ పాలనలో తెలంగాణ నుంచి పీడీఎస్ రైస్ ఏపీకి వస్తోందంటూ మీడియాలో రకరకాలుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పటి వైసీపీ సర్కార్ వాటిని పట్టించుకోలేదు. తెలంగాణ నుంచి పీడీఎస్ రైస్ తరలింపు వెనుక కొందరి రాజకీయ నేతలు ప్రమేయమున్నట్లు తెలుస్తోంది. మిల్లర్లు ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపించారన్న వార్తలు లేకపోలేదు. రాబోయే రోజుల్లో రైస్ అక్రమ తరలింపు వెనుక ఇంకెంతమంది నేతలు బయటపడతారో చూడాలి.