BigTV English

Fake Death Girlfriend: భార్య పిల్లలను వదిలి ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. 3 నెలల తరువాత ప్రియురాలితో

Fake Death Girlfriend: భార్య పిల్లలను వదిలి ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. 3 నెలల తరువాత ప్రియురాలితో

Fake Death Girlfriend| జీవితంతో విసిగిపోయి.. కొత్తదనం కోసం ఏదో సాధించాలనే తపనతో ఓ వ్యక్తి ఎంతో ప్లాన్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించాడు. అతని కోసం పోలీసులు 50 రోజులకు పైగా వెతకడానికి ఎంతో శ్రమించారు. దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేశారు. ఎంత చేసినా కనిపించకుండా పోయిన ఆ యువకుడి గురించి ఏ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ఇక అతను చనిపోయి ఉంటాడు అని భావించారు. అయితే అతను చనిపోయాడని ప్రకటించకముందు పోలీసులకు అనుకోకుండా అతని గురించి కొన్ని రహస్యాలు తెలిశాయి. అంతే వాటిని పరిష్కరిస్తూ ముందు వెళ్లగా అతను వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని తెలిసింది. ఆ తరువాత అతను పోలీసులకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఇదంతా అమెరికాలోని విస్‌కాన్సిన్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ర్యాన్ బోర్గ్వార్ట్ అనే 45 ఏళ్ల వ్యక్తి.. విస్‌కాన్సిన్ రాష్ట్రంలోని గ్రీన్ లేక్ కౌంటీలో నివసిస్తున్నాడు. అతని భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అయితే అతనికి తన జీవితం నచ్చలేదు. ఇంట్లో అతని భార్య నుంచి ఆశించిన ప్రేమ దక్కలేదు. వ్యక్తిగత జీవితం సంతృప్తికరంగా లేకపోవడంతో అతను తన మిగతా జీవితాన్ని ఆనందంగా గడపాలనుకున్నాడు.. పైగా యూరోప్ లని మరో దేశంలో అతని మంచి అవకాశాలు కనిపించాయి. అక్కడ ఒక యువతి కూడా పరిచయమైంది. దీంతో అతన బాగా ఆలోచించుకొని తాను చనిపోయినట్లు దృశ్యం సినిమా తరహాలో ప్లానింగ్ చేశాడు.

వృత్తి రీత్యా ర్యాన్ ఒక కయాకర్ అంటే కొండల మధ్య నదిలో రబ్బర్ బోట్ నడిపేవాడు. అందుకే తన నైపుణ్యాన్ని ఆత్మహత్య డ్రామా కోసం ఉపయోగించుకున్నాడు. దాదాపు నాలుగు నెలల క్రితం ఆగస్టు 2024లో ఒక రోజు ర్యాన్ తన ఇంటికి కారులో బయలుదేరి ఊరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్ద కారు ప్రమాదం చేశాడు. కారు చెరువు లో పడిపోతుండగా.. తన భార్యకు ఫోన్ చేసి తాను ప్రమాదంలో ఉన్నానని తెలిపాడు. ఆ తరువాత ఫోన్ నీళ్లలో పడేశాడు. నిజానికి కారుని తనే చెరువులో పడేసి.. తనతో ఒక చిన్న రబ్బరు బోటు తెచ్చుకున్నాడు. ఆ రబ్బరు బోటులో కూర్చొని చేతులతో ఆ బోటుని నడుపుకుంటూ చెరువు అవతలి వైపునకు చేరుకున్నాడు. అక్కడ చెరువులో నుంచి రబ్బరు బోటు బయటికి తీసి.. అవతలి ఒడ్డున ముందుగానే ఒక బ్యాటరీ స్కూటీ పెట్టాడు. ఆ స్కూటీలో కూర్చొని రాత్రంతా 110 కిలోమీటర్లు ప్రయాణం చేసి డెట్రాయిట్ నగరం చేరుకున్నాడు.


అక్కడి నుంచి అమెరికా పొరుగు దేశం కెనెడాకు బస్సు మార్గాన వెళ్లాడు. కెనెడా నుంచి విమానంలో యూరోప్ లోని ఉజ్బెకిస్తాన్ దేశం చేరుకున్నాడు.

Also Read: దాగుడు మూతలు ఆడుతూ యువకుడి హత్య.. ప్రియురాలు అరెస్ట్

మరోవైపు గ్రీన్ లేక్ కౌంటీ పోలీసులు ర్యాన్ భార్య ఫోన్ చేయడంతో చెరువు వద్దకు చేరుకొని ర్యాన్ కోసం చెరువులో గాలించడం మొదలుపెట్టారు. వారు ర్యాన్ కారుని, నీటిలో నుంచి అతని మొబైల్ ఫోన్ ని తీశారు. ఆ తరువాత చెరువులో ర్యాన్ మునిగిపోయి ఉన్నాడని భావించి అతని మృతదేహం కోసం చెరువంతా గాలించారు. గజ ఈతగాళ్ల చేత వెతికించారు. కానీ నెల రోజులు గాలించినా ర్యాన్ శవం లభించలేదు. దీంతో ర్యాన్ మరణించాడనుకొని అందరూ భావిస్తుండగా.. ర్యాన్ దురదృష్టం అతని జీవితంలో ప్రవేశించింది. ఈ కేసులో గ్రీన్ లేక్ కౌంటీ పోలీస్ అధికారి షెరిఫ్ మార్క్ పోడాల్ పర్సనల్ గా విచారణ చేపట్టారు. పోడాల్ ఒక సిన్సియర్ ఆఫీసర్ గా ఆ ప్రాంతంలో మంచిపేరు. దీంతో పోడాల్ ఈ కేసులో నిగ్గు తేల్చాలని అతని ఇంట్లో తనిఖీలు చేశారు. ముందుగా ర్యాన్ లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.

ర్యాన్ తెలివిగా తన లాప్ టాప్ లో బ్రౌజింగ్ డేటా మొత్తం డెలీట్ చేశాడు. అయినా అతని డేటాను పోలీసులు రికవర్ చేశారు. పోలీసుల విచారణలో ర్యాన్ కు సంబంధించి రెండు విషయాలు తెలిసాయి. ఒకటి ర్యాన్ మే నెలలో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. దాని విలువ రూ.3 కోట్ల 18 లక్షలు. తాను చనిపోతే ఆ డబ్బుని తన పిల్లల పేరు మీద రాశాడు. ఆ తరువాత కొన్ని రోజులకే తన పాస్ పోర్టు పోయిందని.. కొత్త పాస్ పోర్ట్ కావాలని అప్లై చేశాడు.

ఈ రెండు విషయాలు షెరిఫ్ మార్క్ పోడాల్ గమనించారు. ర్యాన్ ఫోన్ కాల్, సోషల్ మీడియా హిస్టరీ అన్నీ చెక్ చేయగా.. అతను ఒక రష్యాన్ యువతితో తరుచూ మాట్లాడుతున్నట్లు తెలిసింది. దీంతో షెరిఫ్ పోడాల్ ఆ యువతి ఫోన్ నెంబర్‌ని నవంబర్ 2024లో సంపాదించారు. ఆమెకు ఫోన్ చేసి.. తాను ర్యాన్ స్నేహితుడినని చెప్పాడు. ర్యాన్ పిల్లలకు అనారోగ్యంగా ఉందని డ్రామా చేశాడు. దీంతో ఆమె వెంటనే ర్యాన్ కు ఫోన్ ఇచ్చింది. అంతే ర్యాన్ బతికే ఉన్నాడని బయటపడింది. షెరిఫ్ పోడాల్ ని గుర్తుపట్టిన ర్యాన్ అవతలి వైపు వీడియో కాల్ లో మాట్లాడాడు.

తాను క్షేమంగానే ఉన్నానని.. వ్యక్తిగత కారణాలతో ఇదంతా చేయాల్సి వచ్చిందని తెలిపాడు. పోడాల్ అడిగిన ప్రశ్నలకు ర్యాన్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఆ చెరువు ఎంచుకోవడానికి కారణం.. అది చాలా లోతుగా ఉండడమే అని చెప్పాడు. ఆ చెరువు 237 అడుగులు లోతుగా ఉండడంతో స్కూబా డైవింగ్ చేసేవారికి చెరువంతా వెతకడానికి సమయం పడుతుందని.. ఆ సమయంలోనే తాను దేశం దాటేశానని తెలిపాడు.

ఇదంతా మరుసటి రోజు షెరిఫ్ మార్క్ పోడాల్ మీడియా సమావేశం నిర్వహించి బయటపెట్టాడు. ర్యాన్ వీడియో కాల్ ని కూడా రికార్డ్ చేసి అందరికీ చూపించారు. అయితే ర్యాన్ కచ్చితంగా ఎక్కడ ఉన్నాడో ప్రస్తుతం తెలియదని.. బహుశ అతను ఉజ్బెకిస్తాన్ లో ఉండే అవకాశం ఉందని తెలిపారు.

పోలీసులకు మోసం చేయడం, ఇన్సూరెన్స్ కంపెనీకి మోసం చేయడానికి ప్రయత్నించడం వంటి కేసులు ర్యాన్ పైన నమోదు చేశామని త్వరలోనే ర్యాన్ ఎక్కడున్నా అతడిని వెతికి స్వదేశానికి తిరిగి తీసుకొస్తామని నవంబర్ లో చెప్పారు. కానీ కట్ చేస్తే.. డిసెంబర్ 9న ఉజ్బెకిస్తాన్ లో ఉండాల్సిన ర్యాన్ గ్రీన్ లేక్ కౌంటీ పోలీస్ స్టేషన్ లాకప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×