Gundeninda GudiGantalu Today episode December 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. సంజయ్ ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని శృతి ఒంటరిగా దొరికిందని అటాక్ చేస్తాడు. శృతిని కాపాడటానికి మీనా చేసిన సాహసం అంతా ఇంతా కాదు.. రౌడీలపై శివంగీలాగా విరుచుకుపడింది. ఆమె దైర్య సాహసలను చూసిన ప్రతి ఒక్కరు పొగిడేస్తున్నారు. ఇక మీడియా ఇంటికి వచ్చి అడగటంతో బాలు ఆనందానికి అవధులు లేవు. ఎప్పుడు తిట్టే బాలు భార్యపై పొగడ్తలతో ముంచేస్తాడు. కానీ ఇంత ధైర్యం చేసిందంటేనే నమ్మలేకపోతున్నాము. కానీ ఒక అమ్మాయిని కాపాడింది అంటే మాకు సంతోషంగా ఉందని బాలు చెప్తాడు. ఇక ప్రభావతి మనోజ్ రోహిణి భయంతో ఇంట్లోకి వచ్చేస్తారు. బాలు మీడియా వాళ్ల దగ్గర నుంచి మీనా విసిరిన రాయిని తీసుకుంటాడు. నిజం చెప్పు నువ్వు ఇంత బరువున్న రాయిని ఎలా విసిరావు అనేసి అడుగుతాడు. ఇక ఇంట్లోకొచ్చిన రోహిణి బాలు మీనాలు ఇద్దరూ రౌడీలుగా మారి అందరిని కొడుతూ గొడవలు తెచ్చి పెడుతున్నారు. బాలు లోపలికి రాగానే మమ్మీ ఈ స్టోన్ చూసావా ఎలా ఉందో మీనాను నువ్వు అన్న మాటలు అన్ని విన్నావుగా నీకు ఏదైనా మీనాను అంటావా బయటికి వెళ్ళింది అని అరుస్తావా అంటూ రాయిని చూపించి బెదిరిస్తాడు. అలాగే మనోజ్ కు చూపిస్తూ ఇన్ డైరెక్టర్గా వార్నింగ్ ఇస్తాడు బాలు. ఈ సమయంలో అమ్మాయి అంటే అనుకువగానే కాదు.. అవసరమైతే ఆదిశక్తిల పోరాడాలంటూ మీనాను పొగిడేస్తాడు.. ఇక మౌనిక కూడా నిన్ను చూసి నేర్చుకుంటాను అని అంటుంది. ప్రభావతి, మనోజ్, రోహిణి మాత్రం టెన్షన్ పడుతుంటారు.. వీళ్ళ సంతోషాన్ని చూసి కుళ్ళు కుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనాను చూసి ఇంట్లో అందరు భయపడతారు. ఏదైనా అడగాలని అన్నా కూడా కొడుతుందేమో అని టెన్షన్ పడతారు. ఇక బాలు భార్య చేసిన దానికి ఫుల్ ఖుషి అవుతుంటాడు. ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ తో చెప్తాడు. తన ఫ్రెండ్స్ మీనా చేసిన సాహసానికి నువ్వు ఎలాగైనా పార్టీ ఇవ్వాలని అడుగుతారు. ఇక బాలు మీ నాన్న చూసి మురిసిపోతూ ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. బాలు మాత్రం అస్సలు నమ్మడు.. నువ్వు నిజంగా ఆ రాయితో కొట్టావా? నాకు ఇంకా డౌట్ గానే ఉంది అనేసి బాలు అంటాడు. మీరు మీ ఎదవలు అనుమానాలు అంటుంది. నన్ను తక్కువ చేసి చూస్తున్నారు నా గురించి మీకు తెలియదనుకుంటాను అని అనగానే ఆపమ్మ నీ గురించి బాగా తెలిసింది చూశాంగా ఎలా కొట్టావో అనేసి అంటాడు. ఇక దానికి మురిసిపోతుంది మీనా.. ఇక టీవీ లో కూడా చూస్తారు. ఇంట్లో అందరూ పొగుడుతూ ఉంటారు. ఇక సత్యంతో ప్రభావతి అప్పుడు నేను కూడా సెలబ్రేటి అయిపోతాను కదా అనేసి అంటుంది. అప్పుడు సెలబ్రిటీ కాదు అయ్యేది హంతకురాలు అయిపోతావ్ నిన్ను పోలీసులు వెతుక్కుంటూ వస్తారు. అనేసి అంటాడు. ప్రభావతి ఏవమ్మా స్టోన్ లేడి భోజనం తయారయిందా అనేసి అడుగుతుంది..
మీనా సెలిబ్రిటీగా మారిన సందర్భంగా తన స్నేహితులుకు పార్టీ ఇవ్వాలని బాలు అనుకుంటాడు. పార్టీకి వెళుతున్నానని తెలిస్తే తండ్రి బాధపడతాడని అనుకుంటాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియకుండా నువ్వే మ్యానేజ్ చేయాలని మీనాను బతిమిలాడుతాడు బాలు. సరేనని మీనా అంటుంది.. మీనాకు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతాడు.. ఇక మీనా మురిసిపోతూ ఉంటుంది. ఇక బార్లో రాజేష్ మీనా గురించి పొగడ్తలతో ముంఛేత్తుతాడు.. ఇక పక్కనే సంజయ్ తన ఫ్రెండ్స్ తో కలిసి కూర్చుంటాడు. పొగుడుతుంటే వాళ్ళు రగిలిపోతాడు. రాజేష్ పొరపాటున సంజయ్ కాలు తగిలింది కింద పడతాడు. దాంతో గొడవకు దిగుతాడు సంజయ్. తన ఫ్రెండుని కొడతావని బాలు సంజయ్ ని చిత్తగొట్టేస్తాడు. బాలు తన స్నేహితులకు బార్‌లో పార్టీ ఇస్తుంటాడు. అదే బార్‌లో సంజు కూడా మందు తాగుతుంటాడు. శృతిపై ఎటాక్ చేసిన వాళ్లను నరికేయాలని బాలు స్నేహితుడు రాజేష్ అంటాడు. అతడి మాటల్ని సంజు వింటాడు. కోపం పట్టలేకపోతాడు. రాజేష్ వెళ్లబోతుంటే కావాలనే తన కాలును అతడికి అడ్డుగా పెడతాడు. తనను కావాలనే తన్నావని రాజేష్‌ను కొడతాడు. తన స్నేహితుడిని సంజు కొట్టడం చూసి బాలు రంగంలోకి దిగుతాడు. సంజుతో పాటు అతడి గ్యాంగ్‌ను చితక్కొడతాడు. సంజు షర్ట్ మొత్తం చించేసి అతడిని అవమానిస్తాడు. నీలాంటివాడిని నరికేస్తాను.. గుర్తుపెట్టుకోమని వార్నింగ్ ఇస్తాడు. తనను కొట్టిన మీనా, బాలులపై రివేంజ్ తీర్చుకోవాలని సంజు ఫిక్సవుతాడు.. ఇక సంజు ఏం చేస్తాడు? మీనా, బాలును చంపాలని సంజయ్ ప్లాన్.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..