Gundeninda GudiGantalu Today episode December 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. సంజయ్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి పెళ్లిళ్ల పేరయ్య వచ్చాడు. సంబంధం చూడమని చెప్పావా అనేసి అడుగుతుంది. అవును రమన్నాను ఇప్పుడు ఏమైందని అంటాడు. ఎవరు ఆ అమ్మాయి అని ఆరా తీస్తుంది సంజయ్ ప్లాన్ తెలుసుకున్న నీలకంఠం మాత్రం కొడుకుకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. పెళ్లి సంబంధం చూడటానికి వెళదామని చెబుతాడు. ప్రభావతిని ఇంటికి రప్పిస్తారు. అక్కడ ఇంటిని చూసి షాక్ అవుతారు. మౌనికకు అదృష్టం మాములుగా లేదని కామాక్షి, ప్రభావతిలు అనుకుంటారు. ఇక కట్నం కూడా వద్దని చెప్పడంతో ప్రభావతి ఆనందానికి అవధులు లేవు. ఇక మావారితో ఒక మాట చెప్పి మీకు చెప్తాను అని అంటుంది. ఇంటికి వెళ్లి ఆ విషయాన్ని చెప్పి అందరిని ఒప్పిస్తుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి చెప్పింది విని బాలు షాక్ అవుతాడు. గొప్పింటి సంబంధం అని రోహిణితో పెళ్లి చేసావు. ఆయన ముఖం కూడా ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు మౌనికను కూడా అలానే చేస్తావా అని వాదిస్తాడు. ఇక మౌనిక మీ ఇష్టమే నా ఇష్టం అని అనడంతో అందరు ఫుల్ ఖుషి అవుతారు. అన్ని బాగున్నాయి. కానీ, అదే రేంజ్ లో కట్నం అడుగుతారు కదా.. అంటూ సత్యం అంటాడు. కానీ కట్నం కూడా ఇవ్వద్దంటూ చెప్పారని, కేవలం తమ కూతుర్ని ఇంటికి పంపిస్తే.. చాలని చాలా క్లియర్ గా చెప్పారని ప్రభావతి చెబుతుంది. దీంతో మీనా కూడా వాళ్ళు చాలా పద్ధతిగా మనుషులని, ఈ సంబంధం ఓకే అయితే మౌనిక జీవితమే మారిపోతుందంటూ మీనా కూడా అంటుంది. కానీ, బాలు మాత్రం ఏదో సందేహిస్తాడు. అంత కోటీశ్వరులు మన ఇంటికి వచ్చి సంబంధం సెట్ చేసుకోవడం ఏంటి అని అందరు అనుమాన పడతారు. ఇక ప్రభావతి మాత్రం అందరిని ఒప్పిస్తుంది. మౌనిక, మనోజ్ లను ఎంతో పద్దతిగా పెంచాననీ, మనోజ్ కు గొప్పింటి సంబంధం చేశానని, అలాగే మౌనిక కూడా కోటీశ్వరులకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రభావతి రేంజ్ లో చెబుతోంది. ఇక కామాక్షికి పెళ్లిళ్ల పేరయ్యకు చెప్పి రేపు వాళ్ళని రమ్మని చెప్పమని చెప్తుంది ప్రభావతి. కామాక్షి వాళ్లకు ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. బార్ లో నిన్ను ఆ బాలు నిన్ను కొట్టాడు కదా మరి వాడి ఇంట్లో ఉండగా ఈ సంబంధం ఓకే అవుతుందా అనగానే దానికి సంజయ్ నా దగ్గర ఒక ప్లాన్ ఉందని తన మనిషి ఫోన్ నుంచి ఫోన్ చేసి కార్ బుక్ చేసుకోవాలని అడుగుతాడు.
బాలు ఉంటే ఈ సంబంధం ఎక్కడ చెడిపోతుందని ప్రభావతి టెన్షన్ పడుతూ ఒప్పేసుకోమని చెప్తుంది. కానీ మౌనిక మాత్రం నా పెళ్లి చూపులకి అన్నయ్య తప్పకుండా ఉండాలనేసి మొండికేస్తుంది. ఇక బాలు కూడా నాకు పర్సనల్ పని ఉందండి అని సంజయ్ తో అంటాడు. మీరు ఎంత సేఫ్ గా డ్రైవ్ చేస్తారని మీకు మీ నెంబర్ తీసుకుని మరీ కాల్ చేసానండి మాకు కొంచెం అర్జెంట్ అనేసి అడుగుతాడు. మీరు తీసుకుంటున్న దానికంటే కిలోమీటర్ పై ఎక్కువ ఇస్తానని అతను అనగానే ప్రభావతి ఒప్పుకోమని అంటుంది. ఇక సత్యం మీ అమ్మ సంగతి తెలిసిందే కానీ ఇక్కడ నేనున్నా కదరా మంచి గిరాకీ అన్నావు కదా వెళ్లేసి రా అనేసి అంటాడు. సత్య మా మాట చెప్పగానే బాలు అతనితో ఒప్పుకుంటాడు. అయితే ఒక కండిషన్ అని చెప్తాడు. త్వరగా ఇంటికి రావాలండి అనేసి అడగగానే మా పని అయిపోగానే మీరు త్వరగా ఇంటికి వచ్చేద్దురని సంజయ్ అంటాడు.
పక్కనే కూర్చుని ఉన్న నీలకంఠం ఇదంతా బాగానే ఉంది పెళ్లిచూపులు వరకి మ్యారేజ్ చేసాం పెళ్ళికి అయితే అలా కుదరదు కదా ఎలా మేనేజ్ చేస్తావు వాడు నిన్ను కొట్టాడు ఒకవేళ గుర్తుపడితే ఈ సంబంధం ఏ క్యాన్సిల్ అయిపోతుంది అనేసి అడుగుతాడు. దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉందని సంజయ్ అంటాడు.. నువ్వేం ప్లాన్ చేసిన పెళ్లి మాత్రం చెడిపోకుండా చూసుకో అనేసి నీలకంఠం హెచ్చరిస్తాడు. మౌనికకు గొప్పింటి సంబంధం వచ్చిందని ప్రభావతి కాళ్లు భూమ్మీద ఉండవు. అంత గొప్పింటి సంబంధానికి తన కూతురు కోడలుగా పోతుందని నెంబర్ పడిపోతుంది. ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను కాళ్లు చేతులు ఆడటం లేదనేసి తనలో తానే మురిసిపోతూ నవ్వుకుంటుంది. ప్రభావతిని చూసి సత్యం మురిసిపోతుంటాడు. రేపటి వరకు ఆగచ్చు కదా ఎందుకింత ఉరకలేస్తున్నావని అడుగుతాడు. అంత పెద్ద ఇంటికి మౌనికను పంపిస్తే ఎలా ఉంటుంది సంతోషపడకుండా ఎలా ఉంటానో చెప్పండి అని తిరిగి కౌంటర్ ఇస్తుంది. ఇక బాలు మాత్రం మీనాతో అంటూ బాధపడతాడు. నా చెల్లి పెళ్లి చూపుల్లో నేను లేకపోవడం నాకు బాధగానే ఉంది ఈ ప్రభావతి మళ్లీ ఏ పెంట పెడుతుందో అర్థం కావట్లేదు అనేసి మీ నాతో అంటాడు. మీరేం కంగారు పడకండి మావయ్య నేను ఉన్నాం కదా చూసుకుంటాము మీరు వెళ్లి క్షేమంగా ఇంటికి రండి అనేసి అంటుంది. ఒకసారి రవి గాడి బాధ్యత నీకు ఇచ్చేసి వెళ్లాను నువ్వేం చేసావ్ వాళ్ళిద్దరికీ పెళ్లి చేశావు ఇప్పుడు మళ్లీ ఆ తప్పు చెయ్యనని చెప్తాడు. త్వరగా ముగించుకొని ఇంటికి వస్తానని చెప్తాడు. తర్వాత రోజు ప్రభావతి కోడళ్ల పై అరుస్తూ హడావిడి చేస్తుంది. పెళ్లి వాళ్ళు వస్తున్నారని త్వరగా కానివ్వాలని అంటుంది. ఇంట్లోకి పెళ్లి వాళ్ళు వచ్చినట్లు కల కంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.