Mahesh Babu : తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు డైరెక్టర్లు ఒక మార్క్ ను అందుకున్నాయి. అందిరిలో తమిళ డైరెక్టర్ శంకర్ వేరు.. విభిన్నమైన కథాంశంతో చిత్రాలను రూపొందిస్తూ ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తారు. శంకర్ డైరెక్షన్ లో చిత్రం వస్తుందంటే చాలు కొత్త కథతో రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తుంటారు. రచయితగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఎన్నో చిత్రాలను రూపొందించారు శంకర్. జెంటిల్ మాన్ చిత్రంతో ఆయన కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత వరుస సినిమాలను చేసి అతి తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వచ్చిన భారతీయుడు మూవీ తప్ప గతంలో వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. అలాంటి ఈ డైరెక్టర్ మహేష్ బాబు తో ఓ సినిమా చెయ్యాలని అనుకున్నాడు. కానీ మహేష్ ఆయనతో సినిమాకు నో చెప్పాడనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అసలు మహేష్ బాబు ఎందుకు అలా అన్నాడో తెలుసుకుందాం..
ఇండియన్ 2 తప్ప ఆయన పని చేసిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ను సాధించాయి. శంకర్ చిత్రాలు అంటేనే టెక్నాలజీకి పెట్టింది పేరు. రోబో వంటి ప్రయోగాత్మమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. గతంలో ఎవరు చెయ్యలేని సాహసాన్ని చేశారు. సక్సెస్ ను అందుకున్నారు.. ఇక శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. Rc15 శంకర్ దర్శకత్వం వహిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా కీయారా అద్వానీ నటిస్తోంది.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.. షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా గురించి సంప్రదించారట.. శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు చిత్రానికి ముందుగా లీడ్ రోల్ లో నటింపజేయడానికి మహేష్ బాబుని అనుకున్నారట. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన త్రీ ఇడియట్స్ చిత్రంలో అమీర్ ఖాన్ పాత్రలో నటించడానికి చర్చ జరగగా, ఈ పాత్ర తనకు సెట్ కాదని నో చెప్పాను అని ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఆ పాత్ర తనకు సరిపోదనే మహేష్ ఆ మూవీని రిజెక్ట్ చేశారని అప్పటిలో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మూవీ రాలేదు. ఇక ఫ్యూచర్ లో ఏదైనా ప్రాజెక్ట్ ను మహేష్ బాబు ఒకే చెప్తారేమో చూడాలి.. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ మూవీలో మహేష్ బాబు ఎలా కనిపిస్తారో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.