Gundeninda GudiGantalu Today episode December 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. పెళ్లే వద్దని ఇంట్లో అందరితో గొడవలు పెట్టుకున్న బాలు హడావిడి పెరిగిపోతుంది. ఇంట్లోనే ఉండిపోతారా? పెళ్లికి టైం అవుతుంది పదండి అని బాలు అనడంతో అంతా బయలుదేరుతారు. అంతా పెళ్లి మండపానికి వెళ్తారు. ఎప్పటిలాగే నీలకంఠం, సంజు తో చాలా మర్యాదగా నడుచుకుంటారు. కానీ, బాలు గెటప్ చూసి ఆశ్చర్యపోతారు. వీడేంట్రా పెళ్లి అంటే ఇష్టమున్నట్లే ఇంత బాగా రెడీ అయి వచ్చాడు అని నీలకంఠం, సంజు అనుకుంటుంటారు. అది గమనించిన బాలు నీలకంఠం కుటుంబాన్ని కావాలనే పొగుడుతూ ఉంటాడు. ఇలాంటి ఫ్యామితో వియ్యం అంటే మాకు ఎంత మంచిదో.. నాకు సరిగ్గా సరిపోవాలి కదా అంటూ అందరితో చెబుతాడు. వాళ్లు చాలా మంచివాళ్లని, చీమకు కూడా హాని తలపెట్టరని మాట్లాడుతుంటాడు బాలు.. అయితే బాలు వాలకం చూసి షాక్ అవుతారు. ఏదైనా ప్లాన్ చేశాడా? నిజంగానే మారిపోయాడా అని ఆలోచిస్తారు.. కానీ బాలు మాత్రం తన మీద ఎవరికీ అనుమానం రాకుండా మ్యానేజ్ చేస్తుంటాడు.. ఇక వీడేంటీ ఇన్ని రోజులు వాళ్లు దుర్మార్గులు అన్నాడు. ఇప్పుడేమో తెగ పొగిడేస్తున్నాడు. నిజమేనా అని ప్రభావతి షాక్ అవుతుంది.. వీడేంట్రా మనల్నీ ఎత్తేస్తున్నాడు అని నీలకంఠం అంటాడు. మనల్నీ చేసేదేం లేదని వాడికి బాగా అర్థమైనట్లుంది. అందుకే ఇలా ప్లేట్ తిప్పేశాడేమో అని సంజు సమాధానం ఇస్తాడు. మరోవైపు మౌనికను చూసి సంజు తల్లి సువర్ణ బాధపడుతుంది.. ఈ అమ్మాయి జీవితాన్ని ఆ దేవుడే కాపాడాలి అని అనుకుంటుంది. రోహిణి వాళ్ళ నాన్న రాలేదని చెబుతుంది. దినేష్ వచ్చి సేవ్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు ఇంట్లో అందరినీ నమ్మించి పెళ్లిలో హడావిడి చేస్తాడు. ఇక రోహిణి బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ తీసుకొచ్చి రోహిణి పరువు కాపాడుతాడు. దీంతో ప్రభావతి తన మలేషియా అన్నయ్య గిఫ్ట్ పంపించాడని తెగ మురిసిపోతుంది. ఏం గిఫ్ట్ పంపాడు చూడమ్మా అంటూ రోహిణికి చెబుతుంది. ఇప్పుడు ఎందుకు అత్తమ్మ.. తర్వాత చూద్దాంలే.. మిమ్మల్ని మండపంలో పిలుస్తున్నారు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది. తర్వాత మనోజ్ కూడా ఒక్కసారి ఆ గిఫ్ట్ ఏంటో చూద్దామనడంతో కాస్త టెన్షన్ పడుతుంది. ఇక రోహిణి ఆంటీ మిమ్మల్ని మండపంలో ఎవరో పిలుస్తున్నారు వెళ్ళండి అనేసి అంటుంది.. అవునమ్మా వెళ్తాను ఏం అవసరం వచ్చిందని ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే మనోజ్ గిఫ్ట్ ఏంటో చూద్దాం అనగానే తర్వాత చూద్దాంలే మనోజ్ అని రోహిణి కవర్ చేస్తుంది. దినేష్ తో సీక్రెట్ గా మాట్లాడుతుంది. నువ్వు నాకు ఏటీఎం లాంటి దానివి నువ్వు డబ్బులు ఇస్తేనే నేను ఇకనుంచి వెళ్తాను లేకపోతే ఈ నిజాన్ని బయటపెడతాననేసి రోహిణికి వార్నింగ్ ఇస్తాడు. దగ్గర నువ్వు చావగొట్టిన ఒక్క రూపాయి కూడా లేవని రోహిణి అంటుంది నీ మరదలు కు వాళ్ళ అత్తింటి వాళ్ళు బాగా నగలు పెట్టారు కదా అందులో ఒక నగని కొట్టేసి నాకు ఇవ్వు అని అనగానే రోహిణి షాక్ అవుతుంది. ఇప్పుడు నన్ను దొంగను కూడా చేద్దాం అనుకుంటున్నావా అని అనగానే నువ్వు దొంగ అవుతావో లేదా ఒక తల్లి అని అందరికీ నిజం చెప్తావో అది నీ ఇష్టం అనేసి బెదిరిస్తాడు దినేష్.
దినేష్ మాటలకి భయపడిన రోహిణి వీడు అనంతపని చేసేలా ఉన్నాడు నాకు కాపురానికి ఎసరు పెట్టేలా ఉన్నాడనేసి మౌనిక దగ్గరికి వెళ్లి నగను కొట్టేసి దినేష్ కి ఇవ్వాలని అనుకుంటుంది.. అనుకున్నట్టుగానే మౌనిక దగ్గరికి వెళ్లి పెళ్లికి ఒకసారి కూర్చుంటే చాలాసేపు వరకు లేచింది నువ్వు వాష్ రూమ్ కి వెళ్ళేసి రాపో అనేసి మౌనికని పంపిస్తుంది. మౌనిక అలా వెళ్ళగానే మౌనిక దగ్గర ఉన్న నగల్లో ఒక నగని కొట్టేస్తుంది. బయట వెయిట్ చేస్తున్న దినేష్ కి ఆ నగరం తీసుకొచ్చి ఇస్తుంది. అంత పెద్ద నగలు పెట్టారు కదా ఇంత చిన్నదే తెచ్చి ఇచ్చావు ఏంటి అనేసి దినేష్ అనగానే పెద్దది కొట్టేస్తే అనుమానం వస్తుంది అందుకే చిన్నది తెచ్చాను అని అనగానే. చావు పెళ్లికొచ్చిన కట్నం ఇదే అనేసి దినేష్ వెళ్ళిపోతాడు. అటు బాలు సంజు తో భారీ ఫైట్ చేస్తాడు. ఓ రేంజ్ లో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. ఇందులోనే పంతులు పిలిచి పెళ్లి కొడుకును తీసుకురమ్మని చెబుతాడు. దీంతో బాలు నేను ఎత్తుకొస్తా అంటూ వెళ్తాడు. ఈ సమయంలో మీనా కు కాస్త అనుమానం వస్తుంది. నిజంగానే మీరు మారారా? సంజును క్షమించారా? అంటూ ప్రశ్నిస్తుంది. తన చెల్లెలి సంతోషం కోసం తాను ఏం చేయడానికి అయినా సిద్ధమే అంటూ ఇండైరెక్టుగా చెబుతాడు. బాలు సంజుని తీసుకెళ్లడం రోహిణి చూస్తుంది.లోపలికి వెళ్లి ప్రభావతితో ఈ నిజాన్ని చెప్తుంది. ప్రభావతి షాక్ అవుతుంది వీడు మొదటినుంచి డ్రామాలు ఇస్తున్నాడని నేను అనుకోలేదు అనంతపని చేశాడు కానీ టెన్షన్ పడుతుంది.
ఇక అప్పుడే అక్కడికి మీనా రావడంతో ప్రభావతి మీనా పై కోపంతో రగిలిపోతుంది. తెలియకుండానే నీ మొగుడు ఇలా చేస్తాడా నా కూతురికి గొప్పింటి సంబంధం చేస్తున్నానని కుళ్ళు తోనే ఇలా చేశాడు నీ మొగుడు నీకు తెలియదా అనేసి తిడుతుంది.. నన్ను నమ్మండి అత్తయ్య నేను ఆయన ఎక్కడున్నా కానీ పట్టుకుంటాను పెళ్ళికొడుకుని తీసుకొచ్చేస్తాను అనేసి అంటుంది. మీనా బాలుకు ఫోన్ చేస్తుంది. బాలు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఈ విషయంలో నాకు ఇలాంటి ప్రమేయం లేదని చెబుతోంది. వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని, తీసుకురమ్మని చెబుతుంది. పెళ్ళికొడుకును తీసుకురావడానికి వెళ్లిన బాలు రాకపోవడంతో నీలకంఠంకు అనుమానం వస్తుంది. వెంటనే తన భార్యను పంపించి చూడమని చెప్తాడు. లోపలికి వెళ్ళిన సువర్ణ అక్కడ తన కొడుకు లేదని టెన్షన్ పడుతుంది ఒక అమ్మాయి జీవితం బాగుపడిందని సంతోషపడుతుంది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని బయటికి వచ్చి నీలకంఠంతో ఆ విషయం చెబుతుంది. నీలకంఠం ఇదంతా బాలు పనే.. ఈ విషయాన్ని బయట చెప్పొద్దని తన భార్యతో చెప్పి బయటకు వస్తాడు. ఇక బయట ఉన్న పోలీసులకు ఈ విషయాన్ని చెప్పి బాలు నా కొడుకుని కిడ్నాప్ చేసి డిక్కీలో వేసుకుని వెళ్తున్నాడని చెప్తాడు ఇక పోలీసులు రౌడీలు బాలుని చేసి చేసుకుంటూ వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో సంజు బాలును కట్టేస్తాడు.. మౌనికకు పెళ్లవుతుంది. మరి మౌనిక మెడలో తాళి కట్టింది ఎవరో రేపటి ఎపిసోడ్లో చూడాలి..