Illu Illaalu Pillalu Narmada: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో సీరియల్స్ ఆకట్టుకుంటున్నాయి.. ఈమధ్య సినిమాలు కన్నా ఎక్కువగా సీరియల్స్ చూసేందుకు జనాలు ఆసక్తికర ఇస్తున్నారు. డిఫరెంట్ స్టోరీలతో పాటుగా ప్రేక్షకులను కట్టి పడేసే ఎమోషన్స్ కూడా ఉండడంతో సీరియల్స్ కు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది.. ప్రస్తుతం బుల్లితెరపై బోలెడు సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. అందులోను స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేటుగా వచ్చిన టాప్ పొజిషన్ లోకి వచ్చినా కూడా సీరియల్స్ లలో ముందుగా వినిపించేది ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ లో నర్మద పాత్రలో అన్షు రెడ్డి నటించింది. ఈమె సీరియల్స్ తో పాటుగా సైడ్ బిజినెస్ చేస్తున్న విషయం చాలామందికి తెలియదు. ఈమె బిజినెస్ ఏంటో? ఆదాయం ఏంటో? ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర హీరోయిన్ అన్షు రెడ్డి పర్సనల్ లైఫ్ గురించి ఇటీవల ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తన అన్నను చదివించడానికి తానుబడ్డ కష్టాల గురించి వివరించింది. అప్పట్లో కష్టాన్ని నమ్ముకుని అంత చేసాము కాబట్టి ఇప్పుడు మంచిగా ఉన్నానని ఆమె చెప్పింది. కష్టపడిన వాడికి ఫలితం దక్కుతుందని అన్షు రెడ్డి ఉదాహరణగా నిలిచింది.. ఈమె సీరియల్స్ తో పాటుగా ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా నడుపుతున్న విషయం చాలామందికి తెలియదు. ఆ ఛానల్ ద్వారా మీకు నెలకు 4 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. నా ఫ్యామిలీ గురించి పర్సనల్ లైఫ్ గురించి చేస్తున్న వీడియోల ద్వారా తాను సంపాదిస్తున్నానని చెప్పింది. అటు సీరియల్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది.. అంతేకాదు తన అక్క బోటిక్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది.
Also Read : గాంధీపై నటుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు.. ఆ సినిమా బ్యాన్..?
అన్షు రెడ్డి తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లలో నటించింది. ఆమె నటించిన ప్రతి సీరియల్ ఆమె నటనకు మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో గవర్నమెంట్ ఉద్యోగి పాత్రలో నటిస్తుంది. రెండో కోడలుగా తన వాళ్లని కాపాడుకోవడంలో ఎప్పుడు ముందుంటుంది. ఈ సీరియల్లో ఆమె పాత్రకు మంచి డిమాండ్ ఉంది. ఇక కేవలం సీరియల్స్ మాత్రమే కాదు ప్రస్తుతం బుల్లితెరపై టాప్ డాన్స్ రియాల్టీ షో గా ప్రచారం అవుతున్న ఢీ షోలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంటుంది. ఈ షోలో పాల్గొన్న తర్వాత ఈ నెలలో ఈ టాలెంట్ కూడా ఉందని చాలామంది ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం టాప్ డాన్సర్లతో పోటీపడి మరి తన పర్ఫామెన్స్ లో ఇస్తుంది. మరి చివరి వరకు ఉంటుందా? ఎలిమినేట్ అవుతుందా? చూడాలి.. డాన్స్ షోలో ఎలాంటి రిజల్ట్ వచ్చినా కూడా టీవీ సీరియల్స్ లలో నటించే ఛాన్స్ కూడా ఉంది. అన్షు రెడ్డి ప్రస్తుతం నటిస్తున్న సీరియల్స్ విషయానికొస్తే.. ఇల్లు ఇల్లులు పిల్లలు సీరియల్లో నటిస్తుంది.