Vinod Kambli Dance: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ) అదిరిపోయే స్టెప్పులతో దుమ్ము లేపాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ( Vinod Kambli )… తన ఎనర్జీ డాన్స్ తో రచ్చ చేశాడు. ఆసుపత్రిలో ఉన్న నర్సులతో…చక్ దే ఇండియా అంటూ…హిందీ పాటకు డాన్స్ చేసి ఇరగదీసాడు వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ). దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల కాలంలోనే… తీవ్ర అనారోగ్యంతో టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండుల్కర్ ( Sachin Tendulkar ) స్నేహితుడు వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ) ఆసుపత్రి పాలయ్యారు.
థానే జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ) కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ) మెదడ్ లో రక్తం గడ్డ కట్టిన వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే గత వారం రోజుల నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ) ఆరోగ్యం విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారని కూడా ప్రచారం జరిగింది. దాదాపు వారం రోజుల పాటు వైద్య బృందం సమక్షంలో చికిత్స తీసుకున్నాడు వినోద్ కాంబ్లీ.
Also Read: Mohammed Siraj – Babar Azam: బెయిల్స్ టెక్నిక్.. సిరాజ్‌ను Copy కొట్టిన పాక్ ?
అయితే ఇప్పుడిప్పుడే వినోద్ కాంబ్లీ కోలుకుంటున్నారట. అయితే తాజాగా ఆసుపత్రిలో ఉన్న లేడి నర్సులతో డ్యాన్స్ చేసి రచ్చ చేశాడు వినోద్ కాంబ్లీ . తన ఆరోగ్యం బాగుందని… తనకు ఎలాంటి ప్రాబ్లం లేదని…. చెప్పే ప్రయత్నంలో భాగంగా డాన్స్ చేసి ఇరగదీశాడు వినోద్ కాంబ్లీ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక కాంబ్లీ డ్యాన్స్ కు ఫిదా అయిన నర్సులు కూడా.. అతనితో కలిసి.. డ్యాన్సులు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా…టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ) అనారోగ్యం నేపథ్యంలోనే.. మహారాష్ట్రలోని బీజేపీ నేతలు, టీమిండియా మాజీ ప్లేయర్లు ఆర్థిక సాయం చేస్తూనే ఉన్నారు. సచిన్ టెండుల్కర్ ( Sachin Tendulkar ) ఇప్పటికే చాలా సార్లు.. వినోద్ కాంబ్లీ కి ఆర్థిక సాయం చేశాడు. వినోద్ కాంబ్లీ కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఇక ప్రస్తుతం బీసీసీఐ నుంచి నెలకు రూ. 30 పెన్షన్ అందుకుంటున్నాడట వినోద్ కాంబ్లీ. అటు టీమిండియా తరఫున 17 టెస్టులు, 104 ODIలలో ఆడాడు వినోద్ కాంబ్లీ. సచిన్ టెండూల్కర్ యంగ్ గా ఉన్నప్పుడే.. వినోద్ కాంబ్లీ ( Vinod Kambli ) కూడా జట్టులో కొనసాగాడు. కానీ సచిన్ అంచలు అంచలుగా ఎదిగితే.. కాంబ్లీ మాత్రం ఫ్లాఫ్ అయ్యాడు.
Also Read: Indian Team – WTC Final: బాక్సింగ్ టెస్ట్ లో ఓటమి.. WTC Final ఛాన్స్ ఇంకా టీమిండియాకు ఉందా ?
ఆసుపత్రిలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఎనర్జిటిక్ డ్యాన్స్
అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుంటున్న వినోద్ కాంబ్లీ
థానే జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వినోద్ కాంబ్లీకి చికిత్స
#VinodKambli #ViralVideo pic.twitter.com/g9TnmaRtC2
— Pulse News (@PulseNewsTelugu) December 31, 2024