Gundeninda GudiGantalu Today episode march 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ బండారం బయట పడటంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. మనోజ్ కు జాబ్ లేదని ప్రభావతికి ముందే తెలుసు అని తెలుసుకొని సత్యం ప్రభావతి పై సీరియస్ అవుతాడు. బాలు మీనా శృతి రవి అందరూ కలిసి రోహిణిని దారుణంగా తిడతారు. మీనా ఇంకాస్త ఎక్కువగా సెటైర్లు వేస్తుంది. మా ఆయన ఇస్త్రీ చొక్కాలు వేసుకొని వెళ్తున్నాడు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆమాత్రం మీ ఆయన ఎక్కడ చేస్తున్నాడని నన్ను నాన్న మాటలు అన్నావు కదా మీ ఆయన చేసే పని మా ఆయన చేయట్లే అని సెటైర్లు వేస్తుంది.. మనసు తన గుట్టు బయటపడడంతో ఇంట్లో ఎలా కవర్ చేసుకోవాలని టెన్షన్ పడుతుంటాడు కానీ రోహిణి మాత్రం మనోజ్ ని అసహ్యించుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ ఇన్ని రోజులు దాచిపెట్టి నిజాన్ని బాలు బయట పెట్టడంతో ప్రభావతి మనోజ్ బాలుపై కోపంగా ఉంటారు. ఇక రోహిణి ఎంత చెప్పినా కూడా వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది. మనోజ్ రోహిణిని బ్రతిమలాడినా కూడా రోహిణి ఒప్పుకోదు. నిన్ను నేను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను నీకు తెలీదు అయితే నువ్వు నన్ను ఇంతగా మోసం చేస్తావని నేను అనుకోలేదు అని బాధపడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ తలా ఒక మాట అనడంతో రోహిణి ఏడుస్తుంది. మనోజ్ మాత్రం రోహిణిని ఓదార్చలేక పోతాడు.
అందరూ తలా ఒక మాట అనడంతో రోహిణి బాధపడుతూ లోపలికి వెళ్తుంది మనోజ్ లోపలికి వెళ్లి ఎంత ఓదార్చాలని చూసినా కూడా రోహిణి మాత్రం అస్సలు మనోజ్ నేను నమ్మను అని మొహానే చెప్పేస్తుంది. ఇక రోహిణి విజ్జి దగ్గరికి వెళ్తుంది. తనకి జరిగిన విషయాన్ని చెప్తుంది.. విజ్జి మాత్రం నువ్వు చేసినంత పోలిస్తే మనోజ్ చేసింది పెద్ద తప్పు కాదు నువ్వు ఎంత పెద్ద మోసం చేసి తనని పెళ్లి చేసుకున్నవో తెలుసా అంటే అవును నేను చేసింది మోసమే నేను దానికి రోజు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. అలాగే నీ మనోజ్ ని ఎంత నమ్మాను నాకు లైఫ్ సెక్యూరిటీగా ఉంటాడని చాలా ఊహించుకొని తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని రోహిణి బాధపడుతుంది.
ఇక నాకు చిన్నప్పుడే ఒక పెళ్లి జరిగిపోయింది అది అనుకోకుండా జరిగింది అలానే వెళ్ళిపోయింది ఇప్పుడు నా ఇష్ట ప్రకారంగా నేను మనోజ్ ని పెళ్లి చేసుకుని బ్రతుకుతున్నాను జాబ్ లేదన్న విషయాన్ని నాకు చెప్పి ఉంటే నేను అంత ఫీల్ అయ్యే దానికి కాదు అని రోహిణి ఫీల్ అవుతుంది. బాలు అన్న మాటలు కూడా నువ్వు పట్టించుకుంటావా ఎందుకు నువ్వు ఇలా ఇంత సీరియస్గా తీసుకుంటున్నావ్.. నువ్వు వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని మోసం చేశావు కానీ ఈ నిజం బయట పెడితే ఇప్పుడు నిన్ను అందరు ఎలా మాట్లాడుతారో అసలు మనోజ్ నువ్వు అన్న ప్రతి మాటను నిన్నే అంటాడు ఆ తర్వాత నువ్వేం చేస్తావో నీకే తెలీదు అని విజ్జి రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. అదే నాకు అర్థం కావట్లేదు కానీ మనోజ్ మాత్రం నన్ను ఇప్పుడు జాబ్ లేకుండా మోసం చేశాడు అని ఏడుస్తుంది. మనోజు విజ్జి కి ఫోన్ చేస్తాడు. విజ్జి రోహిణి ఇక్కడ లేదని చెప్తుంది.
రోహిణి విద్య దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిరోజులు మనోజ్ కి దూరంగా ఉంటేనే తెలుగు జాబ్ తెచ్చుకుంటాడని బ్రిడ్జికి చెప్పి రోహిణి దూరంగా వెళ్ళిపోతుంది. అయితే మనోజ్ రోహిణి ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తాడు. విజ్జి ఫోన్ లిఫ్ట్ చేసి రోహిణి ఇక లేదండి ఎక్కడికో వెళ్లిపోయిందని అంటుంది. తనకి షాక్ అయిన మనోజ్ ఇంట్లోకి వెళ్లి బాలు వల్ల ఇదంతా జరిగిందని గొడవ పెట్టుకుంటాడు. అయిన రోహిణిని అనాల్సిన అవసరం నీకేంటి నా భార్య నా అనే హక్కు నీకు ఎవరు ఇచ్చారు అని ఇద్దరు ఒకరినొకరు కాలర్ పట్టుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మనోజ్ బాలు ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటారు ఇంట్లోని వాళ్ళందరూ వాళ్ళిద్దర్నీ ఆపే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళిద్దరూ ఆగరు . నా భార్య వెళ్లిపోవడానికి కారణం నువ్వే అంటూ మనోజ్ బాలుని కొడతాడు. అటు బాలు కూడా మనోజ్ ని తగ్గకుండా కొడతాడు.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..