Gundeninda GudiGantalu Today episode May 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేష్ ఇంత డబ్బులు నీకు ఎక్కడ నుంచి వచ్చాయి రాని బాలుని అడుగుతాడు. నేను మీ అందరి కుటుంబాల్లో చీకటి నింపాలి అనుకోవట్లేదు రా అందుకే నా కారుని అమ్మేశానని చెప్పేస్తాడు. బాలు కారు నమ్మిస్తే నువ్వెలా బతుకుతావు రా అని రాజేష్ అంటాడు. నాకేమన్నా అయితే చూసుకోవడానికి మీరు ఉన్నారు కదా అని బాలు అంటాడు.. ఇక మనోజ్ ఏం చేస్తున్న హోటల్ కి తనకు అప్పు ఇచ్చిన తన ఫ్రెండు అక్కడికి వస్తాడు. మనోజ్ అతను చూసి లోపలికి వెళ్లబోతుంటే అతను అడ్డుపడతాడు.. అప్పు వసూలు చేసుకోవడం నాకు రాదు అనుకున్నావా అని అతను మనోజ్తో అంటాడు..
మనోజ్ ఫ్రెండ్ రెస్టారెంట్ కి వచ్చి అన్ని ఐటమ్స్ తీసుకురమ్మని చెప్తాడు. అయితే ఆ ఐటమ్స్అన్నీ ఒక్కడి తినేస్తాడు. అది చూసిన మనోజ్ చిరాగ్గా ఫీల్ అవుతాడు. అలాగే ఇవన్నీ ఒక పార్సెల్ తీసుకొచ్చి ఇవ్వమని అడుగుతాడు. ఇది డబ్బులు ఎవరు కడతారని అడిగితే నువ్వే కట్టాలి. వడ్డీ ఇవ్వలేదు కదా అని షాక్ ఇచ్చి వెళ్ళిపోతాడు.. సత్యం ఇంటికి వస్తాడు. ప్రభావతి సత్యమును ఎక్కడికి వెళ్లి వచ్చారు డబ్బులు తీసుకుని వెళ్లారు కదా తీసుకున్నారా..? మీ కొడుకు ఇలా అందరిని కొట్టుకుంటూ పోతుంటే నువ్వు మాత్రం డబ్బులు ఇచ్చుకుంటూ పోతుండు అని అంటుంది. వాళ్లకి ఇంకేముంది తీసుకునే ఉంటారులే అని ప్రభావతి దారుణంగా మాట్లాడుతుంది. కానీ సత్యం మాత్రం వాళ్ళు డబ్బులు తీసుకోలేదు అని అరుస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ జాబ్ మానేసి ఓనర్ ని తిట్టేసి బయటకు వచ్చేస్తాడు. మీనా సత్యంతో టిఫిన్ పెట్టేసాను మామయ్య పది నిమిషాల్లో టిఫిన్ అవుతుంది మీరు తినేసి టాబ్లెట్ వేసుకోవాలని చెప్తూ ఉంటుంది. పార్వతి అమ్మ మీనా అంటూ వస్తుంది. వాళ్ళు ఉన్నాడేమో చూస్తూ భయపడుతూ ఇంట్లోకి సుమతి పార్వతి వస్తారు. వాళ్లిద్దరిని చూసిన ప్రభావతి రెచ్చిపోతుంది. ఇది మీ నా ఇల్లు కాదు సత్యం గారి ఇల్లు. అయితే గీతే నా ఇల్లు అని కొట్టినట్టు మాట్లాడుతుంది. దానికి సత్యం ప్రభావతి పై సీరియస్ అవుతాడు.
ఇంటి గుమ్మం దగ్గర నిల్చొని మీనా అని పిలుస్తారు. ఆ పిలుపు విని మీనా అత్త ప్రభావతి మండిపడుతుంది. మీనా ఇల్లు కాదిది.. సత్యం ఇల్లులు అని, ఎప్పుడూ పడితే అప్పుడు ఊడిపడటానికి, దర్జాగా రావడానికి అవమానంగా లేదా అని ప్రభావతి మీనా తల్లిని అంటుంది. దీంతో మీనా మండిపోతుంది. అత్తపై చూపించలేని కోపాన్ని తన తల్లిపై చూపిస్తుంది. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారంటూ గట్టిగా మందలిస్తుంది. ఇంకోసారి ఈ ఇంటివైపు రావొద్దని ఏదైనా ఉంటే ఫోన్ లోనే చెబితే సరిపోతుందని మీనా తిడుతుంది. మీకు ఇక్కడ అవమానం జరిగితే అది చూసి నేను తట్టుకోలేనని అంటుంది. ఇక ఇదే సమయంలో సత్యం జోక్యం చేసుకుంటాడు.
ఇంటికి వచ్చిన వాళ్లని ఇలానే మాట్లాడతారా నీకు ఇదేనా మీ వాళ్ళు నేర్పించిన సంస్కారం అని సత్యం ప్రభావతిపై సీరియస్ అవుతాడు. ప్రభావతి మాత్రం ఇంతకీ వాళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కోండి అని అంటుంది. ఏమైందమ్మా ఎందుకు ఇలా వచ్చారు అని సత్యం అడుగుతాడు. మీనా కూడా తన తల్లిని అవమానించినందుకు బాధపడుతుంది. మీరెందుకు వచ్చారో ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేసి వెళ్లిపోండి అమ్మ అందుకే నేను ఇంటికి రావద్దని చెప్తాను.. మా అత్త చూసావా రాబందు లాగా ఎలా మాట్లాడుతుందో అని అరుస్తుంది.
మేమంతా సంతోషంగా ఉండటం మీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. అందుకే ఇలా వచ్చి ఏడుస్తున్నారా? అంటూ విసుక్కుంటుంది. దానికి మీనా స్పందిస్తూ చనిపోయింది మా అమ్మ భర్త, నాకు తండ్రి ఆయన లేరనే విషయం గుర్తుకొచ్చి ఏడ్వకుండా ఉంటారా? అని అంటుంది. మా బాధ మీకు నసలాగా మారిందా? అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీనా మాటలతో సత్యం స్పందిస్తూ ప్రభావతి నోరు మూయిస్తాడు. ఇంకొక్క మాట మాట్లాడితే వెంటనే నీ పరువు పోయేలా చేస్తానని అంటాడు. మౌనం ఉన్న కొద్ది రెచ్చిపోతున్నావంటూ మండిపడుతాడు. నువ్వు లోపలికి వెళ్లమని అంటాడు. ఇక మీనా తన తల్లితో నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పి వెళ్లు అని అంటుంది.
ఇక పార్వతి మా ఆయన గారి చనిపోయి ఏడాది అవుతుంది సంవత్సరికలు చేయాలి కదా అన్నయ్య మీరందరూ కలిసి రావాలి అంటూ అడుగుతుంది. అని కూడా ప్రభావతి పార్వతి పై సీరియస్ అవుతుంది. చనిపోయిన వాడి వల్లే కదా ఈ అరిష్టం మా ఇంటికి వచ్చి పట్టుకుంది. ఆయనేమో బస్సు కింద పడి దర్జాగా చచ్చిపోయారు కానీ మేము కదా ఇబ్బంది పడుతున్నాం అంటూ ప్రభావతి రెచ్చిపోతుంది. దానికి సత్యం సీరియస్ అవుతాడు.
అదే సమయానికి బాలు ఇంటికి తిరిగి వస్తాడు. గేట్ దగ్గర మీనా తల్లి పలకరించినా తిరిగి మాట్లాడకుండా వెళ్లిపోతాడు. ఇక ఇంట్లోకి తిరిగి వచ్చిన మీనా బాలుతో గొడవ పడుతుంది. తన తల్లి పిలిచినా ఎందుకు మాట్లాడలేదని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు సత్యం మీనా వాళ్ల నాన్న సంవత్సరికం కార్యక్రమానికి వెళ్లాలని ఆదేశిస్తాడు. తన ఇష్టం లేదని బాలు చెబుతాడు. కానీ వెళ్లాల్సిందేనని సత్యం చెబుతాడు. దాంతో సరేనని అంటాడు. ఇక శృతికి వాళ్ళమ్మ ట్రిప్పుకు వెళ్లడానికి టికెట్స్ ఇస్తుంది. మనోజ్ జాబ్ మానేయడం పై రోహిణి దారుణంగా తిడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…