BigTV English

Green Tea Face Packs: గ్రీన్ టీతో అద్భుతమైన ఫేస్ ప్యాక్స్.. మచ్చలులేని ముఖం మీ సొంతం

Green Tea Face Packs: గ్రీన్ టీతో అద్భుతమైన ఫేస్ ప్యాక్స్.. మచ్చలులేని ముఖం మీ సొంతం

Green Tea Face Packs| గ్రీన్ టీ ఆరోగ్యకరమైందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. గ్రీన్ లోని పోషకాలు చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయనేది కాదనలేని నిజం. ఈ టీ పొడి కెమీల్లీయా సినెన్‌సిస్ అనే మెక్క నుంచి వస్తుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటి ఆక్సిడెంట్స్ మానవ శరీరంలో హాని కలిగిందే రాడికల్స్ తో పోరడడానికి ఉపకరిస్తాయి. యాంటి ఆక్సిడెంట్స్ తో పాటు గ్రీన్ టీ లో విటమిన్ సి, విటమిన్ ఈ కూడా అధిక మొత్తంలో ఉన్నాయి. గ్రీన్ టీ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని, దీని వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయని వింటూనే ఉంటాం. కానీ ప్రతి రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యవంతమైన, అందమైన చర్మం కూడా పొందవచ్చు.


గ్రీన్ టీ మన శరీరంలో మలినాలు తొలగించడంతో పాటు ఇందులో యాంటి ఏజింగ్ గుణాలు కూడా ఉన్నాయి. అంటే చర్మంపై ముడతలు పడకుండా ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి మొటిమలు రాకుండా నివారిస్తుంది. అయితే ఈ లాభాలన్నీ పొందడానికి రోజూ గ్రీన్ టీ తాగాల్సిన అవసరం లేదు. గ్రీన్ టీ పొడి ఒక ఫేస్ ప్యాక్ లాగా మార్చుకోవచ్చు.

గ్రీన్ టీతో మూడు రకాల అద్భుతమైన ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.


మచ్చలు లేని ఈవెన్ టోన్ స్కిన్ కోసం గ్రీన్ టీ ఫేస్ ప్యాక్
చర్మంలోని మలినాలు తొలగించే శక్తి గ్రీన్ టీకి ఉంది. మీకు మచ్చలు లేని క్లియర్ స్కిన్ కావాలని కోరుకుంటుంటే.. ఆలాంటి సమయంలో మీరు గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ ఉపయోగించాలి. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా రెండు గ్రీన్ టీ బ్యాగ్స్, ఒకటి న్నర టేబుల్ స్పూన్ తేనె, 5 నుంచి 6 నిమ్మకాయ జ్యూస్ చుక్కలు తీసుకోవాలి. వీటన్నింటినీ చిక్కటి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఆ తరువాత దాన్ని ముఖంపై బాగా అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ని 15 నిమిషాలు ముఖంపై ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయండి.

చర్మం పొడిబారి పోయే సమస్య ఉంటే గ్రీన్ టీతో ఇలా ఫేస్ ప్యాక్ చేసుకోండి

చర్మం పొడిబారడం అంటే చర్మంపై మృత కణాలు ఏర్పడడం. ఈ మృత కణాలతో చర్మం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే వీటిని తొలగించడానికి ఆరెంజ్ పండు తోలుతో గ్రీన్ టీ పొడి కలిపి ఒక ఫేస్ ప్యేక్ చేసుకోండి. అందుకోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ, కొన్ని ఆరెంజ్ పండు తొక్కలు, సగం టీ స్పూన్ తేనె తీసుకోండి.
ఈ ఆరెంజ్ పీల్స్‌ని పౌడర్ లాగా ఒక బ్లెండ్ చేసుకోండి. అది పూర్తయ్యాక, ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ ని తేనె, గ్రీన్ టీతో కలిపి ఒక బౌల్ లో వేసి బాగా కలపండి. ఆ తరువాత ముఖంపై అప్లై చేసి 10 నిమిషాలు అలా వదిలేయండి. ఆ తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయండి.

Also Read: రాత్రి నిద్రపట్టడం లేదా? కమ్మని నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి

చర్మంపై ముడతలు రాకుండా గ్రీన్ టీ ఫేస్ ప్యాక్

ఇది చాలా అద్భుతమైన ఫేస్ ప్యాక్. ఇది రెడీ చేయడం చాలా ఈజీ. ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ, 2 టేబుల్ స్పూన్ తాజా పెరుగు కావాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయండి. ఆ తరువాత వాటిని మీ ముఖంపై బాగా అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేశాక 20 నిమిషాలు ఆగి.. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయండి.

వారానికి రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ లు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి.

 

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×