E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అరుణ్ కు సుమతి దూరం.. రోహిణి ప్లాన్ సక్సెస్.. పాపం మీనా..

Gundeninda GudiGantalu Today episode: అరుణ్ కు సుమతి దూరం.. రోహిణి ప్లాన్ సక్సెస్.. పాపం మీనా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 17th: ఇక రాత్రి అవగానే శృతి తన రెస్టారెంట్ ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. ఎలాగైనా సరే రవిని ఆ రెస్టారెంట్ నుంచి బయటకు తీసుకురావాలి కచ్చితంగా తనని ఒక రెస్టారెంట్ కి ఓనర్ని చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అయితే రవి రాగానే ఎంతవరకు వచ్చింది రెస్టారెంట్ పనులు రెస్టారెంట్ పూర్తయిందా లేదా అని వెటకారంగా మాట్లాడతాడు. ఆ మాట వినగానే.. శృతి ఏంటి నేను రెస్టారెంట్ పెట్టలేను నువ్వు అనుకుంటున్నావా? డబ్బులు ఉంటే రెస్టారెంట్ ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పగానే రవి కున్న నాలెడ్జ్ గురించి బయట పెట్టేస్తాడు రెస్టారెంట్ పెట్టడం అంత ఈజీ అనుకుంటున్నావా దానికి ఎంత ప్రాసెస్ ఉందో నీకు తెలుసా అని మొత్తం చెప్పగానే శృతి నోరు వెళ్ళబెట్టి వింటూ ఉంటుంది. అటు మనోజ్ ను ఎలాగైనా సరే టెన్షన్ పడేలా చేయాలని రోహిణి కావాలనే తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు నడుస్తుంది అది విన్న మనోజ్ నిజంగానే రోహిణి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అంటూ భయపడి పోయి బాత్రూం నుంచి బయటకు వచ్చేస్తాడు.

అరుణ్ తో బాలు గొడవ..

తర్వాత రోజు మీనా బాలు వెళ్తూ ఉండగా ఎదురుగా అరుణ్ అటుగా వస్తాడు. అయితే అరుణ్ అడ్డు తప్పుకోడు. అలాగే బాలు కూడా అటు తప్పుకోడు. తనరు ఇద్దరు బయటికి ఒకరినొకరు గొడవపడే వరకు తీసుకుని వస్తారు. మీనా ఎందుకండి గొడవ మనం వెళ్ళిపోదాం పదండి అని ఎంతగా చెబుతున్నా సరే అరుణ్ కూడా తగ్గడు అలాగే బాలు కూడా తగ్గరు. ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్తారు. అయితే అక్కడే ట్రాఫిక్ లో ఆటోలో కూర్చుని ఉన్న సుమతి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని బయటకు వస్తుంది. అది చూసిన సుమతి వాళ్ళిద్దరు గొడవను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదంతా చూస్తూ ఉన్న సుమతి మాత్రం వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ బాలు మాత్రం నేను అస్సలు తగ్గను అని అంటాడు.. సుమతి మాట విన్న అరుణ్ పక్కకి తప్పుకోవాలని అనుకుంటాడు. అది చూసిన బాలు మౌనంగా ఉండిపోతాడు…

అరుణ్ కు దిమ్మతిరిగే షాక్..

Advertisement

ఇక సుమతి బాలుకి చెప్పేసే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అయితే బాలు సుమతి అరుణ్ దగ్గరికి వెళ్తుందా లేదా అని చూస్తూ ఉండిపోతాడు. వసుమతి ఏం మాట్లాడకుండా అరుణ్ కి దూరంగా వెళ్లిపోవడంతో బాలు కి గౌరవం ఇచ్చింది అని చాలా సంతోష పడిపోతూ ఉంటాడు. సుమతీ తనని వదిలేసి వెళ్ళిపోయింది అని అరుణ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. అసలు సుమతి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటాడు.. ఇక మీనా సుమతి వెళ్లిపోయింది కదా మనం ఇక్కడే ఉండి పోదామా రేపటి వరకు వెళ్లిపోదామా అని అంటుంది.. చిన్న గంప వెళ్ళిపోయింది కాబట్టి మనం కూడా వెళ్ళిపోదామని బాలు మీన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తర్వాత సుమతి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది.. నా వల్ల అరుణ్ చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. బావ ఎలాగో ఒప్పుకోడు కాబట్టి నేను అరుణ్ణి మర్చిపోవడమే మంచిది అని అనుకుంటుంది.

సుమతిని చూసి బాధపడ్డ మీనా..

ఇక మీద ఇంటికి వస్తుంది ఏంటే దీని పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు. ఈమధ్య ఎవరితోనూ మాట్లాడడం లేదు ఒంటరిగానే ఉంటుంది అంటూ మీనా అనడంతో తను బాధపడుతుంది అమ్మ.. ఈయన మాత్రం అసలు ఒప్పుకునేలా కనిపించడం లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని నేను అంటుంది. మీనా ఏం చేసినా కూడా సుమతి సంతోషంగా ఉండడం కోసమే కదా మనం చేస్తున్నాము తను సంతోషంగా ఉండాలి అంటే.. ఈయన అరుణ్ణి ఒప్పుకునేలా చేయాలి ఈమధ్య వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే బగ్గు మంటుంది. మరి వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని ఎలా మాట్లాడుకుంటారు. నాకేం అర్థం కావట్లేదు అమ్మ అని మీనా కూడా బాధపడిపోతూ ఉంటుంది..

రోహిణి ప్లాన్ సక్సెస్..

Advertisement

రోహిణి తన ఫ్రెండ్ మహేశ్వరిని కాస్త మహేష్ లాగా మార్చేసుకుంటుంది. మనోజ్ కి అనుమానం వచ్చేలా చేసి తనకి దగ్గర ఇలా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక తన ఫ్రెండు అలా అనడంతో నీకోసం నేను ఏదైనా చేస్తాను రోహిణి అని సపోర్ట్ కూడా ఇస్తుంది.. దాంతో ఈమధ్య రోహిణి మనోజ్ నాకు దూరమవుతున్నాడు వాళ్ళ అమ్మ మాట వింటున్నాడు.. ఎలాగైనా సరే మనోజ్ నేను నా సొంతం చేసుకోవాలి నువ్వు నాకు సహాయం చేయాలని మహేశ్వరీని అడుగుతుంది. ఇక తన ఫ్రెండ్ అంతగా అడగడంతో నేను కూడా నీకు సహాయం చేస్తానే నావల్ల నువ్వు బాగుపడతావు నీ సంసారం బాగుంటుంది.. అంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను అని తన ఫ్రెండు అనగానే రోహిణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొత్తానికి మనోజ్ ని తన వైపు తిప్పుకునేందుకు రోహిణి ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది..

బాలు సీరియస్..

మీనా తన తమ్ముడు వస్తున్నాడని బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అయితే అక్కడికి వచ్చిన బాలు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అని అడగగానే.. నేను మా తమ్ముడు వస్తున్నాడు అని వెయిట్ చేస్తున్నానండి అని అంటుంది. అయితే రాత్రిపూట సుమతి అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్లి నీకు నాకు సెట్ అవదు. ఇకమీదట మనిద్దరం కలవడం కుదరదు అని చెప్పేసి వచ్చి ఇంట్లో చెప్పి బాధపడిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని శివ ఎలాగైనా సరే బాలుకి చెప్పాలని అనుకుంటాడు.. మీనా బాలుకి శివ ఆ విషయం చెప్పగానే బాలు ఒక్కసారిగా సీరియస్ అవుతాడు వాడు ఒక ఎదవ వాడిని పెళ్లి చేసుకుంటే సుమతి జీవితాంతం ఏడవలసి వస్తుంది అని సీరియస్గా అనేసి వెళ్ళిపోతాడు.. తన చెల్లెలి జీవితం ఇలా మారిపోతుంది అని నేను అసలు ఊహించలేదు అని మీనా చాలా బాధపడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : శైలు మాటతో కేశవ ఫ్యూజుల్ అవుట్.. చక్రికీ దెయ్యం పట్టిందా..? డ్యూయట్ సాంగ్..

Related News

Podarillu Today Episode : శైలు మాటతో కేశవ ఫ్యూజుల్ అవుట్.. చక్రికీ దెయ్యం పట్టిందా..? డ్యూయట్ సాంగ్..

Karthika Deepam 2 Serial Today Episode November 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  మాలిని ప్లాన్ సక్సెస్ – జ్యోత్స్నను తిట్టిన సూరజ్   

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి నర్మద సూపర్ ప్లాన్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. వల్లి గెటప్ అదిరిపోలే..

Brahmamudi Serial Today Episode November 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఎక్స్ ఫో విన్నర్ ఐశ్వర్య – షాక్ లో ఇందు, రాజు  

Intinti Ramayanam Today Episode: కమల్ ఫుల్ హ్యాపీ.. పాపం రమ్య.. నిజం తెలుస్తుందా..?

పట్టు చీరలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న బ్యూటీ.. కుర్రాళ్ళు ఫిదా..

Tuesday TV Movies : మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

Big Stories

Advertisement
×