E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఎక్స్ ఫో విన్నర్ ఐశ్వర్య – షాక్ లో ఇందు, రాజు  

Brahmamudi Serial Today Episode November 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఎక్స్ ఫో విన్నర్ ఐశ్వర్య – షాక్ లో ఇందు, రాజు  
Advertisement

Brahmamudi serial today Episode: ఎక్స్‌ఫోలో ఒక కస్టమర్‌ వెళ్లి ఐశ్వర్య డిజైన్‌ నచ్చిందని రెండు రోజుల్లోనే ఇలాంటి డిజైన్‌ ఇరవై కావాలని అడుగుతాడు. అడ్వాన్స్‌గా యాభై లక్షలు ఇస్తానంటాడు. రెండు రోజుల కన్నా లేట్ అయితే తాను ఆ ఐటమ్‌ తీసుకోనని చెప్తాడు. అయితే ఐశ్వర్య తన దగ్గర బెస్ట్‌ టీం ఉందని రెండు రోజుల్లో మీరు అడిగింది సప్లై చేస్తానని చెప్తుంది. అయితే ఒకే డెలివరీ అయ్యాక టోటల్ పేమెంట్ చేస్తానని అడ్వాన్స్‌ ఇచ్చి వెళ్లిపోతాడు ఆ కస్టమర్‌. ఈ ఎక్స్‌ఫోలో నా బిజినెస్‌ యాభై లక్షలు ఇక చూడు నా బిజినెస్‌ ఎలా చేస్తానో చూడు అంటూ పార్వతీశానికి చెబితే.. ఏంటి చేసేది ఇప్పటికే లంచ్‌ బ్రేక్‌ అయింది. ఇక మిగిలింది మీకు నాలుగు గంటలు మాత్రమే అంటూ పార్వతీశం చెప్పగానే..

అవునా అప్పుడే లంచ్‌ బ్రేక్‌ అయిందా…? అంటూ ఆశ్చర్యంగా చూస్తుంటే.. నిర్వాహకులు వచ్చి అందరికీ లంచ్‌ ఏర్పాటు చేశామని అందరూ వెళ్లి లంచ్‌ చేయాలని చెప్తారు. ఇప్పటి వరకు స్వరాజ్‌ గ్రూప్‌ ఎక్కువ బిజినెస్‌ చేసి ముందు వరుసలో ఉన్నారని చెప్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వరాజ్‌ గ్రూప్‌ ముందు వస్తుందేమో.. ఏదైతే అది అవ్వని ఏం మిరాకిల్‌ జరుగుతుందో సాయంత్రం వరకు వెయిట్‌ చేద్దాం అంటూ వెళ్లిపోతాడు. అందరూ భోజననానికి వెళ్తారు.

Advertisement

రాజు, ఇందు వెళ్లి భోజనం చేస్తుంటారు. ఆఫ్‌ డేలో ఫిఫ్టీన్‌ క్రోర్స్‌ అంటే చాలా మంచి గుడ్‌ ఫిగర్‌ కదా అంటాడు రాజు. చాలా మంచి అనలేము కానీ గుడ్‌ నెంబర్‌ అంటుంది ఇందు. మనం హండ్రెడ్‌ స్పీడులో వెళ్తుంటే కొంతమంది ఇంకా టెన్‌ స్పీడ్‌లోనే వస్తున్నారు పాపం మీ అక్క అయితే ఇంకా స్టార్టింగ్‌ ట్రుబుల్‌లోనే ఉంది. పాపం అక్కడ చూడు ముద్ద కూడా దిగడం లేదు అంటూ వెటకారంగా మాట్లాడుతుంటే ఇందు.. రాజును సైలెంట్‌గా తినమని చెప్తుంది. అక్కడే భోజనం చేస్తున్న కస్టమర్లలో ఐశ్వర్యకు ఆర్డర్‌ ఇచ్చిన కస్టమర్‌కు ఐశ్వర్య చేసే మోసం గురించి చెప్తాడు. దీంతో అతను బ్రేక్‌ అయిపోయాక వెళ్లి డీల్‌ క్యాన్సిల్‌ చేసుకుంటానని చెప్తాడు.

లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఆ వ్యక్తి వచ్చి ఐశ్వర్యతో డీల్‌ క్యాన్సిల్‌ చేసుకుంటున్నానని తన చెక్‌ తనకు రిటర్న్‌ ఇవ్వమని అడుగుతాడు. ఎందుకని ఐశ్వర్య అడిగితే. లాస్ట్‌ టైం మీరు చేసిన డీల్‌లో మోసం చేశారట. కస్టమర్లను మోసం చేసే మీ కంపెనీతో నేను డీల్‌ చేసుకోను అంటాడు. ఆ కస్టమర్‌ అలాగే మాట్లాడుతుంటే.. మిగతా కస్టమర్లు కూడా వీళ్లు ఇలాంటి వ్యక్తులా పద ఇంకో స్టాల్‌కు వెళ్దాం అంటూ వెళ్లిపోతుంటారు. ఐశ్వర్య ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ ఆగరు. ఐశ్వర్య కోపంగా కస్టమర్‌ దగ్గరకు వెళ్లి అసలు ఎవడ్రా నువ్వు నా కంపెనీ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ తిడుతుంది.

Advertisement

ఎక్స్‌ఫోలో పెద్ద గొడవ చేస్తుంది. నా కంపెనీ గురించి తక్కువ మాట్లాడినందుకు నీ మీద పరువునష్టం దావా వేస్తాను అంటూ బెదిరిస్తుంటే.. ఆ కస్టమర్‌ కూడా ఐశ్వర్యను తిట్టి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఎక్స్‌ఫోలో నీలాంటి వాళ్లను రానివ్వడమే వేస్ట్‌ అంటూ తిడతాడు. గొడవ పెద్దది అవుతుంది. ఇందు కల్పించుకుని ఆ కస్టమర్‌ను కన్వీన్స్‌ చేస్తుంది. ఇందు మాటలతో కన్వీన్స్‌ అయిన అతను ఐశ్వర్య ఎక్స్‌ఫోలో ఉండటానికి ఒప్పుకుంటాడు. ఐశ్వర్య కోపంగా ఇందును తిట్టి వెళ్లిపోతుంది.

జీరో బిజినెస్‌ చేశామని సైలెంట్‌ గా ఇక్కడి నుంచి వెళ్లిపోదామని పార్వతీశం చెప్తాడు. ఇప్పుడు సైలెంట్‌గా వెళ్లిపోతే బిజినెస్‌ చేతకాక వెళ్లిపోయామని అనుకుంటారు అంటూ ఐశ్వర్య చెప్తుంది. తర్వాత సాయంత్రం ఎక్స్ ఫో అయిపోయిందని ఇక ఈ సంవత్సరం ఎవరు విన్నరే తెలుసుకుందామని నిర్వాహకులు చెబితే.. పార్వతీశం మనకు ఎలాంటి బిజినెస్‌ జరగలేదని వెళ్లిపోదామని అంటాడు. మనం ఇక్కడే ఉండాలని మా చెల్లి గెలుపును చూసి షాక్‌ కావాలి అంటూ చెప్తుంది ఐశ్వర్య. అప్పుడే నిర్వాహకులు స్టేజీ మీదకు వచ్చి ఈ ఎక్స్‌ఫోలో విన్నర్ ఐశ్వర్య గ్రూప్‌ అని అనౌన్స్‌ చేస్తారు. ఆ అనౌన్స్‌కు అందరూ షాక్‌ అవుతారు.

ఇందు, రాజు మౌనంగా కూలబడిపోతారు. పార్వతీశం ఆశ్చర్యంగా మేడం ఇది కలా నిజమా అంటూ అడుగుతాడు. నిజమే పారు ఇది నిజమే అంటూ చెప్తుంది. ఐశ్వర్య చేసిన బిజినెస్‌ చేసింది మూడు వందల కోట్లు అని చెప్తారు. ఆ మాటకు రాజు, ఇందు మరింత షాక్‌ అవుతారు. ఇదేదో జరిగింది ఫ్రాడ్‌ జరిగింది అంటాడు రాజు. ఈ డీల్ ఇచ్చింది ఎవరో తెలుసుకోవాలని ఉంది కదా ఆయన ఎవరో కాదు మిస్టర్‌ రఘువీర్‌ అంటూ ఇన్వైట్‌ చేస్తారు. రఘువీర్‌ను చూసి రాజు, ఇందు షాక్‌ అవుతారు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: కమల్ ఫుల్ హ్యాపీ.. పాపం రమ్య.. నిజం తెలుస్తుందా..?

పట్టు చీరలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న బ్యూటీ.. కుర్రాళ్ళు ఫిదా..

Tuesday TV Movies : మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

రికార్డు సృష్టించిన ‘రాను బొంబాయికి రాను’ సాంగ్.. అల్లు అర్జున్ పాటను బీట్ చేసిందిగా?

బిగ్ బాస్ 10లో నా ప్రయాణం ముగిసింది.. రీ ఎంట్రీ పై రోహిత్ క్లారిటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

నువ్వో చేతకానివాడివి అంటూ హేళన చేశారు: డైరెక్టర్ బాబు

జగపతిబాబు షోలో సుమ,రాజీవ్ సందడి.. బయటపడ్డ పాత ప్రేమ రహస్యాలు!

Big Stories

Advertisement
×