E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode November 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  మాలిని ప్లాన్ సక్సెస్ – జ్యోత్స్నను తిట్టిన సూరజ్   

Karthika Deepam 2 Serial Today Episode November 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  మాలిని ప్లాన్ సక్సెస్ – జ్యోత్స్నను తిట్టిన సూరజ్   
Advertisement

Karthika Deepam 2 serial today Episode: సూరజ్‌ దగ్గరకు వెళ్లిన మాలిని ఎలాగైనా సూరజ్‌ మనసు మార్చాలని ముందే పారిజాతంతో కలిసి ప్లాన్‌ చేసి ఉంటుంది. అందువల్ల సూరజ్‌తో జ్యోత్స్న మంచిది కాదని మీ నాన్న  చావుకు కారణం అయిన సుమిత్ర కూతురని.. మన ఇంట్లో ప్రశాంతత లేకపోవడానికి ఆ కుటుంబమే కారణమి చెప్తుంది. మాలిని ఎన్ని చెప్పినా సూరజ్‌లో మార్పు కనబడదు. చివరి అస్త్రంగా జ్యోత్స్న నీ ప్రేమను రెండు కోట్లకు అమ్ముకుందని చెప్తుంది. సూరజ్‌ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా అంటూ కోపంగా చూస్తూ.. అవును నాన్న నేను చెప్పేది నమ్మకపోతే ఈ వీడియో చూడు తనకు రెండు కోట్లు ఇస్తే సూరజ్‌ను మర్చిపోతానని వాళ్ల గ్రానీ పారిజాతంను నా దగ్గరకు రాయబారం పంపింది అంటూ మాలిని వీడియో చూపిస్తుంది.

వీడియో పారిజాతం తన మనవరాలు జ్యోత్స్న సూరజ్‌ను ప్రేమిస్తుందని.. మీ సూరజ్‌ కూడా తన మనవరాలిని ప్రేమిస్తున్నాడని జ్యోత్స్న, సూరజ్‌ను మర్చిపోవాలంటే రెండు కోట్లు అడుగుతుందని మీరు ఆ రెండు కోట్లు ఇస్తే.. జ్యోత్స్న, సూరజ్‌కు కనిపించకుండా పోతుందని చెప్తుంది. వీడియో మాలిని, పారిజాతానికి డబ్బులు ఇచ్చింది కూడా ఉంటుంది. అంతా చూసిన సూరజ్‌ కోపంతో రగిలిపోతుంటాడు. జ్యోత్స్న కనిపిస్తే చంపేసేంత కోపం సూరజ్‌కు వస్తుంటుంది.

Advertisement

ఆఫీసుకు వచ్చిన జ్యోత్స్న హ్యాపీగా సూరజ్‌ పెళ్లి ప్రవస్తావన తీసుకొస్తాడని అనుకుంటుంది. అప్పుడే సూరజ్‌ బయటకు వస్తాడు. సూరజ్‌ను చూసిన జ్యోత్స్న సిగ్గు పడుతూ  ఏదో ముగింపు ఇస్తా అన్నారు కదా ఏంటా ముగింపు అని అడుగుతుంది. అందుకు సూరజ్‌ కోపంగా ముగించాలనే అనుకున్నాను కానీ ఇక్కడ కాదు రా అంటూ జ్యోత్స్నను పక్కకు తీసుకెళ్లి జ్యోత్స్న ఫోన్‌లో బ్యాంక్ బాలెన్స్‌ చెక్‌ చేస్తాడు. అందులో రెండు కోట్లు క్రెడిట్‌ అయినట్టు చూపిస్తుంది. అది చూసి సూరజ్‌ షాక్‌ అవుతాడుద. ఏమైందని జ్యోత్స్న అడిగితే.. నీ మనసును బజారులో రెండు కోట్లకు అమ్మేశావా..? అంటాడు సూరజ్‌. అందుకు జ్యోత్స్న షాక్‌ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు సార్‌ అంటుంది.

సూరజ్‌ మాత్రం జ్యోత్స్న అకౌంట్‌లో పడిన రెండు కోట్ల గురించి అడుగుతాడు. తనకు తెలియదని జ్యోత్స్న చెప్తుంది. ఇక పారిజాతం, మాలిని దగ్గర డబ్బులు తీసుకున్న వీడియో పారిజాతం మాట్లాడిన వీడియో చూపిస్తాడు. మా అమ్మ దగ్గరకు మీ నాన్నమ్మను రాయబారం పంపించి డబ్బులు తీసుకున్నావు.. అంటే నీ మనసును అమ్మేసుకున్నట్టే కదా అంటాడు. అదంతా తనకు తెలియదని జ్యోత్స్న ఎంత చెప్పినా సూరజ్‌ నమ్మడు. ఇంత క్లియర్‌గా వీడియో ఉంది ఇంకా బుకాయిస్తున్నావా..? అంటూ సూరజ్‌ తిడుతూ.. నా ఫోన్‌ ఇరవై నాలుగు గంటలు ఆన్‌లోనే ఉంటుంది. నీకు డబ్బు అవసరం అయితే నన్న ఆడగాల్సింది అంటూ తిట్టి వెళ్లిపోతాడు సూరజ్‌. మాలిని చాటుగా జ్యోత్స్ను చూసి నవ్వుతుంది. కార్తీక్, దీప అంతా గమనిస్తుంటారు. జ్యోత్స్న ఏడుస్తూ ఉంటుంది.

Advertisement

కట్‌ చేస్తే.. సుమిత్ర పని చేసే ఇంట్లో ఒనరు తన చెవి రింగులు కనిపించడం లేదని నువ్వు చూశావా అని అడుగుతుంది. చూశానని అక్కడ టేబుల్‌ మీద ఉన్నాయి కదా అంటుంది. అక్కడ లేవు అవి నువ్వే తీసి ఉంటావు.. మంచి దానివి అని ఎక్కువ చనువు ఇస్తే ఇలా దొంగతనం చేస్తావా.? అంటూ తిడుతుంది. నువ్విక మా ఇంట్లో పని చేయోద్దని రింగులు ఇచ్చి వెళ్లిపోమ్మని చెప్తుంది. సుమిత్ర ఏడుస్తూ.. తాను రింగులు తీయలేదని ప్రాదేయపడుతుంది. అప్పుడే దశరథ వచ్చి చూసి బాధపడతాడు. తాను తీయలేదని చెప్తుంది కదా అంటాడు. అయినా ఇంటి ఓనరు వినకుండా సుమిత్రను తిడుతూనే ఉంటుంది. అప్పుడే వాళ్ల పిల్లలు ఆ రింగులు తీసుకొచ్చి ఇస్తారు. అవి చూసిన ఓనరు సుమిత్రకు సారీ చెప్తుంది. సుమిత్ర ఇంట్లో పని చేయనని వెళ్లిపోతుంటే.. వద్దని ఆపుతుంది ఇంటి ఓనరు.

కార్తీక్‌, దీప ఇద్దరూ జ్యోత్స్న దగ్గరకు వెళ్లి ఓదారుస్తారు. అసలు ఏం జరిగిందని అడిగితే.. ఇవాళ సూరజ్‌ మా పెళ్లి గురించి మాట్లాడతాడు అనుకున్నాను కానీ అంతా రివర్స్‌ అయిపోయింది. మాలిని అత్త చాటు నుంచి చూస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయింది. సూరజ్‌ను మర్చిపోమ్మని లేకుంటే అనర్థాలు జరుగుతాయని నిన్న గ్రానీ చెప్పింది అంటూ మొత్తం జ్యోత్స్న చెప్పగానే.. కార్తీక్‌ తనకు పూర్తిగా అర్తం అయిందని ఇదంతా మాలిని పిన్ని కావాలని పారుతో కలిసి ఆడుతున్న డ్రామా అంటాడు. ఇదంతా వాళ్లిద్దరి ముందే తేల్చాలని దీప, జ్యోత్స్నలను తీసుకుని వెళ్లిపోతాడు కార్తీక్‌. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి నర్మద సూపర్ ప్లాన్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. వల్లి గెటప్ అదిరిపోలే..

Brahmamudi Serial Today Episode November 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఎక్స్ ఫో విన్నర్ ఐశ్వర్య – షాక్ లో ఇందు, రాజు  

Intinti Ramayanam Today Episode: కమల్ ఫుల్ హ్యాపీ.. పాపం రమ్య.. నిజం తెలుస్తుందా..?

పట్టు చీరలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న బ్యూటీ.. కుర్రాళ్ళు ఫిదా..

Tuesday TV Movies : మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

రికార్డు సృష్టించిన ‘రాను బొంబాయికి రాను’ సాంగ్.. అల్లు అర్జున్ పాటను బీట్ చేసిందిగా?

బిగ్ బాస్ 10లో నా ప్రయాణం ముగిసింది.. రీ ఎంట్రీ పై రోహిత్ క్లారిటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×