Podarillu Today Episode November 17th : కన్నా బాంబులు పేలుస్తూ ఉండగా నారాయణ చూసి మురిసిపోతూ ఉంటాడు. అయితే కన్నా బాంబులు పెట్టదని ఇప్పుడు గాలికి ఆ బాంబులు రివర్స్ గా పడిపోతాయి. అయితే ఆ బాంబుల నీ కన్నా వరకే రావడంతో కన్నా ఒక్కసారిగా షాక్ అవుతాడు. అన్నయ్య అన్నయ్య అంటూ గట్టిగా అరిచేస్తాడు. కానీ అది చూసి నన్ను నారాయణ కన్నా ని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటాడు తన ప్రాణాలకు తెగించి ఆ బాంబులకి అడ్డుగా నిలబడతాడు. అది చూస్తున్న అందరూ కన్నా అంటూ అరుస్తూ వెళ్తారు.. నారాయణ మాత్రం బాంబులికి అడ్డుపడి కన్నాని తన కౌగిలిలో బంధించి మరి కాపాడతాడు. అయితే అందరూ కూడా అది చూసి కన్నాకి ఏమైంది అని కంగారు పడిపోతూ ఉంటారు కానీ నారాయణకు మాత్రం బాంబులు ఒళ్లంతా కాలడంతో అందరూ అతన్ని తిడుతూ ఉంటారు.. ఇక తర్వాత తెగించాడు ప్రాణాలను కూడా పక్కనపెట్టి నారాయణ కన్నాని కాపాడాడు అని అందరూ కూడా తనని పొగిడేస్తూ ఉంటారు అంతేకాదు తనకి బాగా కాలింది అని బాధ పడిపోతూ ఉంటారు..
మహాలక్ష్మి ఒంటరిగా కూర్చుని తన పని చేసుకుంటూ బిజీగా ఉండగా తనకి ఏదో డౌట్ వచ్చిందని దగ్గరికి వెళ్తుంది అయితే విక్కీ తనకి దేశంలోని ఖరీదైన పెర్ఫ్యూమ్ని తెచ్చేస్తాడు కానీ తన మీద అభిమానం ఉండొచ్చు కానీ ఇలాంటి గిఫ్ట్లు నాకొద్దు అని అంటుంది.. ఇక విక్కీ తనని ప్రేమిస్తున్నాడని మహాలక్ష్మికి అర్థమయ్యేటట్టు కనిపిస్తుంది.. ఇక లాయరు ఏంటమ్మా మీరిద్దరు విడాకులు తీసుకుని రాలేదా అని లాయర్ అడుగుతాడు. అయితే నేను కచ్చితంగా విడాకులు తీసుకుంటాను అని అంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రితో విడిపోవాలి అంటే భయపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది..
ఇక ఉదయం లేవగానే షాప్ కి వచ్చిన కేశవ అక్కడ ఒకప్పుడు షాప్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చూసుకొని చాలా ఎమోషనల్ అయిపోతాడు. అయితే మహాలక్ష్మి వల్లే ఇదంతా జరిగింది అని చెప్పగానే.. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన శైలు ను చోటు పార్ట్నర్ అని అనగానే ఏంట్రా పార్ట్నర్ఏం మాట్లాడుతున్నావ్ రా.. అసలు నువ్వు నా పార్ట్నర్ ఏంట్రా ఈ షాప్ కి ఓనర్ ని నేను ఓనర్ భార్యను కాబట్టి నువ్వు నన్ను మేడమ్ అని పిలవాలి అని శైలు అంటుంది ఆ మాట వినగానే చోటు కాస్త ఫీలవుతాడు. ఈ షాపు పెట్టడానికి కారణం నేనే.. నేను నీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగాయి అని చెప్పగానే.. శైలు లైఫ్ లోకి వచ్చిన తర్వాత తన జీవితం ఎలా మారింది అన్న విషయాన్ని కేశవ గుర్తు చేసుకుంటాడు..
నువ్వు నా అదృష్టం అని ఇంతకుముందు అన్నావు కదా నిజం చెప్పరా నేను నీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత కదా నీకు ఇదంతా మారిపోయింది అని శైలు కేశవ అని అడుగుతుంది. ఆ మాట మాత్రం అనకే బస్సు ఒకసారి నిన్ను అదృష్టం అన్నందుకే బైక్ టైరు పంచర్ అయింది ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని కేశవ అనగానే శైలు చాలా ఫీల్ అయిపోతుంది.. ఈరోజు నీ షాప్ కి చాలామంది కస్టమర్లు వస్తారు కచ్చితంగా అప్పుడు నువ్వే నన్ను అదృష్టం అని అంటావు అని శైలు అంటుంది.. కేశవ అన్న మాటలు విని చాలా ఫీల్ అయిపోతుంది శైలు.. ఈరోజు ఏదో ఒకటి చేసి వాడి షాప్ కి కష్టపడ్లని తీసుకురావాలి అని శైలు అనుకుంటుంది..
చక్రి ఇంట్లో కూర్చుని వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే చక్రీకి ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు. వీడు ఇందాక డ్రైవింగ్ కి వెళ్ళినప్పుడు ఏమైనా స్మశానం దగ్గర నుంచి వచ్చాడా ఏంటి? అని కన్నా అలాగే మాధవ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అసలు చక్రి ఏంట్రా ఇలా ప్రవర్తిస్తున్నాడు కొంపతీసి దెయ్యం ఏమైనా పట్టిందా అని కన్నా అలాగే మాధవ ఇద్దరు కూడా భయపడిపోతూ చక్రీకి ఏమైందో కనుక్కోవాలని ధైర్యం చేసే ముందుకు వెళ్తారు.. అసలు చక్రికి ఏమైందో తెలుసుకోవాలి అని మాధవ్ కూడా ముందుకు వెళ్తాడు చక్రీని పరీక్షిస్తాడు. మొదట కాస్త వింతగా అనిపించిన కూడా ఆ తర్వాత చక్రీకి ఏం కాలేదు అని అనుకుంటారు. మొత్తానికి చక్రి తన ఊహలకి కారణం ఏంటి అన్న విషయాన్ని వాళ్ళిద్దరికీ చెప్పి చాలా సంతోషంగా ఉంటాడు.. ఇక తన ఊహలో మహాలక్ష్మితో డ్యూయెట్ సాంగ్ ని వేసుకోవడం గురించి చెప్పి వాళ్లకి షాక్ ఎలా చేస్తాడు. ఆ తర్వాత మహాలక్ష్మి చక్రి డ్యూయెట్ సాంగ్ మాత్రం ఎపిసోడ్కి హైలెట్గా నిలిచింది అని చెప్పాలి.
ఇక శైలు ఎలాగైనా సరే ఈరోజు ముంగిస గాడికి బాగా డబ్బులు చాలా చేయాలి అని పక్క వీధిలో నిలబడి అక్కడ పార్క్ చేస్తున్న బైకులు అన్నిటిని రిపేర్ కి వచ్చేలా చేస్తుంది. అయితే ఈరోజు ఇన్ని బైకులు రిపేర్ అయ్యాయి ఏంటి అని అటు కేశవా చోటు ఇద్దరు కూడా అనుమాన పడుతూనే ఆ బైకులను రిపేర్ చేస్తారు.. ప్రతిరోజు కూడా ఎప్పుడు ఇన్ని బైకులు రిపేరుకు రాలేదు కదరా.. ఫస్ట్ టైం ఇన్ని బైకులు రిపేరుకు రావడం అన్న బ్రో ఈరోజు మన షాపు లక్ష్మీదేవితో కలకలలాడుతుంది అని చోటు కూడా చాలా సంతోషంగా ఉంటాడు.. మొత్తానికి శైలు అక్కడున్న బైకులను పాడు చేసే వాళ్ళని మెకానిక్ షాప్ కి పంపిస్తుంది అని కేశవ తెలుసుకుంటాడు. కేశవ కి అడ్డంగా దొరికిపోయాను అని శైలు కంగారు పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…