E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి నర్మద సూపర్ ప్లాన్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. వల్లి గెటప్ అదిరిపోలే..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి నర్మద సూపర్ ప్లాన్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. వల్లి గెటప్ అదిరిపోలే..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 17th: భాగ్యం భద్ర ఇద్దరు కలిసి ప్లాన్ చేసిన ఆ ప్లాను దారుణంగా ఫెయిల్ అవుతుంది. అయితే భాగ్యం భద్ర ఇద్దరు కూడా ఈ రౌడీలు వేస్ట్ గాళ్ళు వీళ్ళని పంపించి నేను చాలా తప్పు చేశాను అని భాగ్యం కూడా చాలా ఫీల్ అవుతుంది. అయితే ఇలాంటి రౌడీలను నమ్ముకుంటే మనము ఏమి చేయలేము అని భాగ్యం చాలా ఫీల్ అయిపోతుంది. కానీ భద్ర మాత్రం ఎంత సంతోషకన్నా ఇప్పుడే కదరా సంతోష్ పడేది పడనివ్వు ఎగిరెగిరి పడేవాడు ఏదో ఒక రోజు కింద పడక తప్పదు అంటూ భద్ర శ్లోకాలు చెప్తుంది అయితే ఆ మాటలు విన్న సేన ఏమైంది అక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అనేసి అంటాడు. అయితే భద్ర ఆ చందు ధీరజ్ వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు ఏదో ఒక విధంగా వాళ్ళకి నష్టాన్ని చేకూర్చాలి అని పక్క ప్లాన్ చేస్తారు.. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎలాగైనా సరే చందు కి మరోసారి షాక్ ఇవ్వాలని అనుకుంటారు.

ప్రేమ హ్యాపీ.. రామరాజు ఫుల్ ఖుషి..

ప్రేమ ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రాలేదేంటి ఎవరూ ఏం చెప్పినా కూడా వీడు వినడ కట్టుకున్న భార్య పక్కన ఉండగానే ఫోన్లో మాట్లాడుతున్నాడు అని ప్రేమ ధీరజ్ని పిలుస్తుంది. ఇక ధీరజ్ తనమై ప్రేమ వచ్చిందని సరసాలు ఆడుతూ ఉంటాడు తినేసేయ్. ఇక ఎస్సై పోస్ట్లు పడబోతున్నాయి అని తెలిసి ఇద్దరు ఒక్కసారిగా సంతోష పడుతూ ఉంటారు మనకు ఇక మీదట అదృష్టం కలిసి వచ్చింది అని అనుకుంటారు. కానీ రామరాజు మాత్రం తన కొడుకు ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు అని ఆకాశం వైపు చూస్తూ తెగ ఖుషిగా మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉండగా వేదవతి అక్కడికి వెళ్లి ఏంటి మీ బుగ్గలు సంతోషంతో ఎరుపెక్కాయి అని అనగానే నా చిన్న కొడుకు అనుకున్న మాట ప్రకారమే అన్ని చేస్తున్నాడు అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అని రామరాజు అనుకుంటాడు..

వల్లికి నర్మద ప్లాన్..

Advertisement

వల్లి అక్కని బాధపెట్టారు కదా అయితే ఆవిడ బాధ పడిపోతూ వెళ్ళింది. ఒకసారి ఫోన్ చేసి తను బాధ పడిపోతుందేమో కనుక్కోవాలి అని నర్మదా అనుకుంటుంది. అయితే వల్లికి నర్మద ఫోన్ చేయగానే అక్క బాధపడుతున్నావా నువ్వు అలాంటివన్నీ ఏమి పెట్టుకోవద్దు అక్క అని అంటుంది. నన్ను బావే కదా అనింది.. నేనెందుకు ఫీలవుతాను చెల్లి నువ్వేం బాధపడకు నేను బాగానే ఉన్నాను అని నర్మదకు వల్లి చెబుతుంది. ఇక నువ్వు అలా బావగారికి దూరంగా ఉంటే నిన్ను ఇప్పట్లో తను ఒప్పుకోడు నువ్వు అప్పుడప్పుడు మన కుటుంబంలోని వాళ్లందరికీ కనిపిస్తూ ఉండాలి అని నర్మదా చెబుతుంది. ఇక నర్మదా చెప్పినట్లుగానే బావ ఇకమీదట నిన్ను వదలను అని వల్లి అంటుంది. అయితే నర్మదా చెప్పినట్లుగానే ఇంట్లో వాళ్లకి కనిపిస్తూ ఉంటే అప్పుడప్పుడు నన్ను పిలుస్తూ ఉంటారు అని వల్లి కూడా రేపటి నుంచి అదే ప్రయత్నంలో ఉంటాను అని అంటుంది.

లంచం తీసుకున్న సాగర్..

సాగర్ అర్ధరాత్రి పూట ఎవరో వ్యక్తిని కలచి అతనికి ఒక ఫైల్ ఇచ్చి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు.. ఏం కంగారు పడకండి ఇలాంటివి నేను చాలానే చూశాను కదా మీ పని అయిపోయింది కదా మీరు చాలా నిశ్చింతగా ఉండండి ఏం జరిగినా నేను చూసుకుంటాను అని సాగర్ అంటాడు అయితే అవతలి వ్యక్తి మాత్రం చాలా బాధపడిపోతూ భయపడిపోతూ ఉంటాడు. మీరు గనక దొరికితే మీతో పాటు మేము కూడా దొరకాల్సి వస్తుంది కాబట్టి మాకు భయంగా ఉంది అని సాగర్ ను అడుగుతాడు అయితే నేను మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టను మీరు ఏమి కంగారు పడకండి అని సాగర్ భరోసా ఇచ్చి ఇంటికి వస్తాడు. తన ఫ్రెండ్ కి డబ్బులు ఇవ్వలేదు అని సాగర్ లంచం తీసుకుంటూ ఉండగా వీడియో తీస్తాడు తన ఫ్రెండ్..

అడ్డంగా దొరికిన సాగర్..

Advertisement

ఇక సాగర్ తన గురించి ఎవరికీ తెలియకుండా ఇంట్లో డబ్బులని దాచి పెట్టాలని అనుకున్నాడు. ఇక తర్వాత ఇంట్లోకి రాగానే ఆ డబ్బులని పెరట్లో పెట్టాలని అనుకుంటు ఉంటాడు.అయితే వల్లితో మాట్లాడుతున్న నర్మదా సాగర్ అక్కడ ఏదో దాచిపెడుతున్నాడు అని అనుకుంటుంది అయితే వెనకాలే వెళ్లి ఏం దాస్తున్నాడో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఇక మళ్ళీ ఫోన్ పెట్టేసి సాగర్ దగ్గరికి వస్తుంది. సాగర్ ఏంటి ఏం చేస్తున్నావ్ ఇక్కడ ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడ నువ్వు ఏం పని చేస్తున్నావు అని నర్మదా అనుమానంగా అడుగుతుంది. ఏమీ లేదు ఇక్కడ పూల కుండీ ఏదో వీగినట్లు అనిపిస్తే చూస్తున్నాను అని అబద్ధం చెప్తాడు. అయితే డబ్బులు దొరికాయి అని చెప్పగానే నర్మదకు అనుమానం కూడా మొదలవుతుంది. ఏం తప్పు చేయట్లేదు కదా ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నావని నాకు అనిపిస్తే మాత్రం ఆ తర్వాత నిన్ను అస్సలు క్షమించను అని మనసులో అనుకుంటుంది నర్మదా..

కూరగాయలు అమ్ముకున్న వల్లి..

ఇక తర్వాత రోజు ప్రేమ ధీరజులు ట్రావెల్ ఆఫీస్ కి వెళ్లాలని రెడీ అవుతుంటారు. అదేవిధంగా ఇక సుకన్య కూడా కూరగాయలు కొనాలి అని అనుకుంటుంది అప్పుడే అక్కడికి ఒక కూరగాయలమ్మ ఆవిడ రావడంతో ఈ వీధిలో కూరగాయలు అమ్మే వాళ్ళు ఎవరబ్బా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ధీరాజ్ ఏంట్రా కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా నీకు తెలిసే ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావ్ రా అసలు ప్రేమ షాక్ అవుతుంది.. ఆ తర్వాత అందరూ కూరగాయలు అమ్మే ఆవిడని పిలుస్తారు.. ఇక్కడ కూరగాయలు అమ్మడానికి వచ్చిన ఆవిడ అందరితో వరుసలు కలుపుతూ ఉండగా ఈవిడ ఎవరో తెలిసిన మొహం లాగే ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఆ మాట వినగానే వల్లి మొహం చూసి సుకన్య వల్లి నువ్వు కూరగాయలు అమ్ముతున్నావా అని అంటుంది.. ఇక అందరూ కూడా మా ఇంటి పరువు తీస్తున్నావా కూరగాయలు అమ్మి అని అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: కమల్ ఫుల్ హ్యాపీ.. పాపం రమ్య.. నిజం తెలుస్తుందా..?

Related News

Brahmamudi Serial Today Episode November 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఎక్స్ ఫో విన్నర్ ఐశ్వర్య – షాక్ లో ఇందు, రాజు  

Intinti Ramayanam Today Episode: కమల్ ఫుల్ హ్యాపీ.. పాపం రమ్య.. నిజం తెలుస్తుందా..?

పట్టు చీరలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న బ్యూటీ.. కుర్రాళ్ళు ఫిదా..

Tuesday TV Movies : మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

రికార్డు సృష్టించిన ‘రాను బొంబాయికి రాను’ సాంగ్.. అల్లు అర్జున్ పాటను బీట్ చేసిందిగా?

బిగ్ బాస్ 10లో నా ప్రయాణం ముగిసింది.. రీ ఎంట్రీ పై రోహిత్ క్లారిటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

నువ్వో చేతకానివాడివి అంటూ హేళన చేశారు: డైరెక్టర్ బాబు

Big Stories

Advertisement
×