Gundeninda GudiGantalu Today episode November 25th : బాలు ఒక చాక్ పీస్ తీసుకొని వచ్చి అక్కడ లైన్ గీస్తాడు అయితే ఆ లైన్ ఏంట్రా ఇప్పుడు ఏం చేస్తున్నావ్ రా అని అందరూ అడుగుతూ ఉంటే బాలు మాత్రం నేనేం చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను మీరు ఏమి కంగారు పడకండి అని అంటాడు. నాన్న ఈ గీత మీద నుంచి అమ్మ నీకు దాటమని చెప్పండి అని అడుగుతాడు అయితే ప్రభావతి దాటతు ఉండగా వద్దు అని అంటాడు. అయితే ఈ ప్రభావతి ఏంట్రా ఏమన్నా పిచ్చమైన పట్టిందా నన్ను ఎందుకురా ఇలా ఆడుకుంటున్నావు అని అడుగుతుంది అయితే ప్రభావతి కాలు పట్టుకొని అమ్మ చూసావా నువ్వు ఎంత మంచి దానివో నాన్న మాట ఎలా వింటున్నావో అని అంటాడు బాలు మాత్రం చాలా ఫీల్ అయిపోతుంది. మీనా నిజం చెప్పకుండా అందరినీ అక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది.
ఇక రవి అందరూ వెళ్ళిపోయిన తర్వాత శృతిని ఆ గీతం మీద దాటమని అంటాడు. శృతి నా మాట వింటాదో లేదో అని రవి చాలా క్యూరియాసిటీతో వెతుకుతూ ఉంటాడు. అయితే శృతిని ఆ లైన్ మీద నుంచి దాటమని చెప్పగానే.. శృతి వెళ్లి దాన్ని చెరిపేస్తుంది ఆ మాటతో రవి ఒక్కసారిగా షాక్ అవుతాడు మీకు లైన్ దాటాలా నీ మాట వినాలి అంటూ శృతి కూడా తన వెనకాల వెళ్ళిపోతుంది. ఇక బాలు మాత్రం మీనా వెళ్లిపోయిందని తన వెనకాల వెళ్లిపోతాడు. మీనా మాత్రం అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అయితే మీనా బాలుకి అన్నం పెట్టుకుని తిను అని చెప్పేసి వెళ్లిపోగానే బాలు కూడా మీనా అనుకొని ఒక తలుపు దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటాడు.. మనోజ్ అది చూసి వీడికి ఏమైంది అంటూ షాక్ అవుతాడు..
మనోజ్ బాలు ఒక తలుపు దగ్గరికి వెళ్లి అయ్యో మీనా నన్ను క్షమించు మీనా నేను నీకు తెలియకుండా తాగొచ్చాను కదా నీకు కోపం వచ్చిందా అంటూ మాట్లాడుతూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు. తలుపును పట్టుకొని ఏం చేస్తున్నాడు అంటూ మనోజ్ అక్కడ చూస్తే వీడికి బాగా ఎక్కింది ఒక్కసారి విని ఆడుకోవాలి అని మన బాలు దగ్గరికి వెళ్తాడు.. ఎవరితో మాట్లాడుతున్నావ్ రా అక్కడ ఎవరు లేరు కదా అని మద్దిలేటి వెళ్లి బాలు తో పరాచకాలు ఆడతాడు. అయితే అసలే తిక్కలో ఉన్న బాలు మందు తాగి రావడంతో మనోజ్ ని ఒక్క గుద్దు గుద్దుతే కింద పడిపోతాడు. నిద్రపోతున్న గాడిద నువ్వు లేపి తన్నించుకోవడం ఇదే అన్నట్లుగా మనోజ్ పరిస్థితి అవుతుంది. మొత్తానికి మనోజ్ కి మాత్రం అటు రోహిణి టెన్షన్ తో పాటుగా ఇటు బాలు దెబ్బలు కూడా తోడవడంతో చాలా బాధపడిపోతూ ఉంటాడు.
ఉదయం లేవగానే ప్రభావతి ఏమైందే మీ ఇద్దరి మధ్య ఎందుకు వాడు రాత్రి తాగి వచ్చి అంత గొడవ చేసాడు అని అడుగుతుంది. అసలు మీ ఇద్దరు అంతగా గొడవ పడడానికి కారణం ఏంటి అని ప్రభావతి మీనా అని అడుగుతుంది కానీ మీనా మాత్రం నాకేం తెలుసు అత్తయ్య నన్ను అడుగుతారే లేచిన తర్వాత మీ అబ్బాయిని మీరే అడగండి అని అంటుంది. వాడు అసలు ఎందుకు తాగొచ్చాడమ్మా ఏదైనా బాధ ఉంటే తప్ప వాడు తాగడు కదా అని సత్యం మీనా అని అడుగుతాడు.. అయితే అప్పుడే బాలు అక్కడికి వచ్చి ఏంటి పొద్దున్నే ఏదో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అని ప్రభావతిని అడుగుతాడు. ఈమధ్య తాగడం లేదు కదరా ఎందుకు మళ్ళీ తాగొచ్చావు అని సత్యం అడుగుతాడు. ఇక బాలు ఒక కట్టు కథను చెప్తాడు కానీ సత్యం మాత్రం నాకు నిజం చెప్పురా అని అంటాడు. బాలు ఏం చెప్పాలనుకున్న కూడా సత్యం ఏమి మాట్లాడకుండా ఉంటాడు.
అసలు ఏమైందిరా తాగుడు కి బానిస అవ్వకూడదు అని నేను ఎన్ని సార్లు చెప్పిన వినలేదు.. కానీ ఈ మధ్య నీ అంతటి నువ్వే తాగడం లేదు కదా.. మళ్లీ ఎందుకు ఈ కొత్త అలవాటు అని సత్యం బాలుని పదేపదే అడుగుతాడు.. కానీ బాలు మాత్రం అస్సలు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. మీరేమీ కష్టపడకండి నేను అసలు నిజం చెప్తాను అని నేను అంటుంది. అసలేమైందో చెప్పమ్మా ఎందుకు వాడు అలా తాగి వచ్చి రచ్చ చేసాడు అని సత్యం అడుగుతాడు. సుమతీ ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు అని నేను అంటున్నాడు అని మీనా అనగానే.. నన్ను ఎందుకు చెడ్డగా చూపిస్తున్నావు నేనేమన్నా అంత దుర్మార్గుడిన అని బాలు చాలా సీరియస్ అవుతాడు.
బాలు వాడు ఒక మంచి వాడు కాదు అని నేను ఎంత చెప్తున్నా సరే వీళ్ళు మాత్రం అస్సలు నా మాట వినడం లేదు సుమతి అంటే నాకు ఏమైనా కక్ష ఉందా అని బాలు అడుగుతాడు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ సుమతికి మంచి జీవితం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సుమతి సంతోషంగా ఉండడమే నాకు కావాలి కాబట్టి తన సంతోషాన్ని నేను ఎప్పుడూ కాదనను అని అంటాడు. అతను మంచివాడు కాదు పేరుకే పోలీస్ అయినా అతను ప్రవర్తన వేరేలా ఉంది కాబట్టే నేను వద్దు అని అంటున్నాను అని బాలు అంటాడు. మీనా మాత్రం తన గురించి ఒకసారి ఆలోచించమని ఎంత చెప్పినా వినట్లేదు మామయ్య అని అంటుంది ఇంకా ఆ మాటతో మీనా తో గొడవపడి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు బాలు.
ఇక పార్వతి ఉదయం ఎంత సేపైనా కూడా సుమతి ఇంకా లేకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటుంది. అయ్యో సుమతి ఏమైంది ఇంకా పడుకొని ఉన్నాము లేవమ్మా అని అంత లేపిన సరే సుమతి మాత్రం అస్సలు లేవకుండా అలానే ఉండిపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. శివ సుమతి ఇద్దరూ భయపడిపోతూ అసలు సుమతికి ఏమైందో అర్థం కావడం లేదు అని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఆ విషయాన్ని మీనాక్షి చెప్పడంతో అటు మీనా కూడా హాస్పిటల్ కి బాలుని తీసుకుని వెళుతుంది. తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దు అని అన్నందుకే ఇలాంటి పని చేసిందా అని పార్వతీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ బాలు మాత్రం చాలా సీరియస్ అవుతాడు.. ఇక అదే హాస్పిటల్ కి అరుణ్ కూడా రావడంతో బాలు అతనిపై కోపంతో ఉంటాడు ఆ తర్వాత ఎపిసోడ్ కి ఇదే హైలెట్ శీనుగా మారుతుంది మరి బాలు తన మనసు మార్చుకుంటాడా లేదా అన్నది మాత్రం ఇకముందు ఎపిసోడ్లలో చూడాలి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.