Brahmamudi serial today Episode: రాజుకు మృత్యుగండం ఎలా పోతుందని అపర్ణ, సుభాష్ స్వామీజీని అడిగితే ఈ కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేయాలని ఒక మంత్ర జపం వల్ల అపమృత్యుగండం తొలగిపోతుందని మంత్రం చెప్తాడు స్వామిజీ. తప్పకుండా అన్ని జరిపిస్తామని ఎలాంటి అడ్డంకులు వచ్చినా పూర్తి చేస్తామని అప్పటి వరకు రాజుకు ఏమీ కాదు కదా అని అపర్ణ అడిగితే.. అది మన చేతుల్లో లేదని మృత్యువు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది అంటూ స్వామిజీ చెప్పగానే.. అపర్ణ ఏడుస్తూ అయ్యో ఎందుకు స్వామి మాకు ఈ పరీక్ష అంటే.. భయపడి పారిపోకండి మీ మనవడిని కంటికి రెప్పలా కాపాడుకోండి.. అతను ఎవరితోనూ గొడవకు పోకూడదు. ఈ ఒక్క నెల నోటి మాట చేతి వాట కంట్రోల్ లో ఉండాలి అంటూ స్వామిజీ చెప్పగానే.. సుభాష్ అలాగే గురువు గారు మా వంశానికి మిగిలిన వాడిని ఒక్కడిని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్తాడు. స్వామిజీ ఆశీర్వదించి వెళ్లిపోతాడు.
ఆఫీసులో ఉన్న రాజు, ఇందు తాము చేసిన కొటేషన్ ఐశ్వర్యకు ఎలా తెలిసిందని ఆలోచిస్తుంటారు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది అది మనం విశ్లేషించుకోవాలి అంటూ ఇందు చెబితే.. రఘువీర్ వచ్చి తప్పు మీ వైపు లేదు ఇందు అంటాడు. రఘువీర్‌ను చూసి రాజు, ఇందు షాక్ అవుతారు. ఎందుకొచ్చావని అడిగితే.. నేన పక్కా ప్లాన్‌తో గెలిచానని చెప్పడానికి వచ్చానంటాడు. మీ కంపెనీలో ఎక్కడో తప్పు జరిగిందని ఆలోచిస్తున్నారు కదా తప్పు మీ వైపు జరగలేదు నా వైపు జరిగింది. నిజం చెప్పాలంటే ఈ డీల్ మీకే రావాల్సింది.
కానీ లాస్ట్ మినిట్‌లో మీరు వేసిన కొటేషన్ కంటే ఒక్క రూపాయి నేను వేసి ఈ డీల్ ఐశ్వర్య జువ్వెల్లరీకి వచ్చేలా చేశాను అంటాడు. అంత కరెక్ట్ గా ఎలా వేశానో మీకు అనుమానం రావడం లేదా..? మీ దగ్గర పని చేసే మీ మనిషే నాకు ఇన్మఫర్మేషన్ ఇచ్చాడు అంటూ రఘువీర్ చెబితే.. ఇందు కోపంగా నువ్వు అబద్దం చెప్తున్నావు అంటే.. మీ దగ్గర పని చేస్తున్న ఒకరిని నేను కొనేశాను. అదెవరో మీరు తెలుసుకోవడం అసాధ్యం అంటూ రఘువీర్ చెప్పి వెళ్లిపోతాడు. రఘువీర్ మీద కేసు పెడదామని రాజు చెబితే.. అలా కాదని మెంటల్ గా దెబ్బ కొట్టాలని దాని కంటే ముందు మన ఆఫీసులో ఉన్న వాడి మనిషి ఎవరో తెలుసుకోవాలని చెప్తుంది ఇందు.
లక్కీ ఇంట్లో అందరికీ స్వీట్లు పంచుతుంటాడు. ఎంటా గుడ్ న్యూస్ అంటూ అపర్ణ అడిగితే.. అప్పుడే ఐశ్వర్య వస్తుంది. ఇదిగో ఐశ్వర్యనే వచ్చింది కదా తనే చెప్తుంది అంటూ లక్కీ అంటాడు. అవునులే ఐశ్వర్య వచ్చాక ఎలాగూ లక్కీ నోటికి లాక్ పడుతుంది కదా అంటాడు శేషు. నేను రుద్రప్రతాప్ వాళ్ల డీల్ సక్సెస్‌ఫుల్‌గా దక్కించుకున్నానని స్వీట్లు పంచుతున్నావా..? అంటూ ఐశ్వర్య అడిగితే అవునని అంటాడు లక్కీ. అందరూ హ్యాపీగా స్వీట్లు పంచుతూ ఐశ్వర్యను అభినందిస్తారు. అప్పుడే రాజు, ఇందు వస్తారు. వాళ్లకు స్వీట్లు ఇవ్వమని ఐశ్వర్య చెబితే లక్కీ స్వీట్లు ఇవ్వబోతే రాజు వాటిని తోసేస్తాడు. అందరూ షాక్ అవుతారు. ఐశ్వర్య కోపంగా తిడుతుంది. నాకు డీల్ వచ్చిందని మీకు కుల్లుగా ఉందని అంటుంది. అందుకు రాజు కోపంగా తిడతాడు. అందరి మధ్య గొడవ జరుగుతుంది. రాజును గొడవ వద్దని రూంలోకి తీసుకెళ్తుంది ఇందు.
రూంలోకి వెల్లిన రాజు, ఇందుతో నువ్వు దొంగలను వెనకేసుకొస్తున్నావు అయినా ఆఫీసులో ఎవడు అమ్ముడుపోయాడో తెలుసుకుందా అన్నావు అది కూడా సైలెంట్‌గా వచ్చేశావేంటి అంటాడు. ఇప్పుడే తెలియదు కదా అంటుంది ఇందు. మరోవైపు అపర్ణకు రాజు చిన్ననాటి ఫోటోలు ఎవరో కొరియర్ లో పంపిస్తారు. ఆ ఫోటోలు చూసిన అపర్ణ షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.