Nindu Noorella Saavasam Serial Today Episode: పార్థు గురించి డీటెయిల్స్ చెప్తానని అందుకు తనకు యాభై లక్షలు కావాలని మంగళ, మనోహరికి ఫోన్ చేసి బెదిరిస్తుంది. యాభై లక్షలు ఇవ్వకపోతే పార్థును అమర్ కు కానీ మిస్సమ్మకు కానీ అప్పగిస్తానని చెప్తుంది. ఆ మాటలకు మనోమరి లేదు యాభై లక్షలు ఇస్తానని చెప్తుంది. మంగళ సరే అంటూ కాల్ కట్ చేస్తుంది.
తర్వాత మనోహరి యాభై లక్షలు ఎలా తీసుకురావాలి అనుకుంటూ ఆలోచిస్తుంది. ఎంత ఆలోచించినా మనోహరికి యాభై లక్షలు వచ్చే మార్గం కనిపించదు. యాదమ్మ వెళ్లి నువ్వు కాలు కాలిన పిల్లిలా ఎంత తిరిగినా యాభై లక్షలు దొరకవు కానీ ఆ లేడీ కిలాడికి ఫోన్ చేసి యాభై లక్షలు ఇవ్వలేనని చెప్పు అంటుంది. అప్పుడు అది పార్థును అమర్‌కు అప్పగిస్తుంది. నేను జైలుకు వెళ్లి కూర్చుంటాను అంటూ మనోహరి కోపంగా చెప్తుంది. నువ్వు ఎప్పుడూ ఇంతే మనోహరి సగం సగం పనులు చేస్తుంటావు చంపేదేదో ఆ పార్థును పూర్తిగా చంపొచ్చు కదా అంటే వాడి ఆయుష్షు గట్టిదని నాకేం తెలుసు అయినా నీ వెధవ డౌట్స్ పక్కన పెట్టి ఇప్పుడు యాభై లక్షలు దొరికే మార్గం చెప్పు అంటుంది మనోహరి.
నాకే అంత తెలివి ఉంటే నీ దగ్గర ఎందుకు పని చేస్తాను మనోహరి అంటుంది యాదమ్మ అప్పుడే రామ్మూర్తి వస్తుంటాడు. మనోహరిని చూసి బాగున్నావా మనోహరి అంటూ పలకరిస్తే.. మనోహరి కోపంగా ఏదో సంవత్సరాల తర్వాత వచ్చిన వాడిలా ఎలా అడుగుతున్నాడు చూడు అని కోపంగా తిడుతుంది మనోహరి. అందుకు యాదమ్మ ఆ పెద్దాయనకు నీ మీద ప్రేమతో అడిగాడు మనోహరి ఎందుకు సీరియస్ అవుతావు అంటూ యాదమ్మ చెబితే అది ప్రేమ కాదు వెటకారం అంటూ మనోహరి, రామ్మూర్తిని పలకరిస్తుంది. ఏంటి ఇలా వచ్చారని అడుగుతుంది. రామ్మూర్తి చిన్న పని ఉండి వచ్చానమ్మా అని చెబితే.. పిల్లలకు ఫ్రూట్స్ కాకుండా బట్టలు, బంగారం ఏమైనా తెచ్చారా బాబాయ్ గారు అంటూ మనోహరి వెటకారంగా అడిగితే ఆ ఏ యాపిల్సో, బత్తాయిలో తెచ్చుంటారు అంతే కదా సార్ అంటుంది యాదమ్మ.
ఏం తెచ్చానో చూడు అంటూ బ్యాగ్ తెరచి చూపిస్తాడు రామ్మూర్తి బ్యాగులో డబ్బుల కట్టలు ఉంటాయి. వాటిని చూసిన యాదమ్మ షాక్ అవుతుంది. ఏంటి యాదమ్మ అలా ఫ్రీజ్ అయిపోయావు.. బ్యాగులో బంగారం కానీ ఏమైనా ఉందా..? అంటూ మనోహరి బ్యాగులోకి చూసి షాక్ అవుతుంది. డబ్బులు అనగానే.. డబ్బులే మనోహరి యాభై లక్షలు. ఊర్లో భాగీ వాళ్ల అమ్మ పేరు మీద ఉన్న పొలం అమ్మితే వచ్చాయి. ఈ డబ్బులు నా మనవళ్లు, మనవరాళ్ల పై చదువులకు ఉపయోగపడతాయి కదా.? అయినా నీకేం తెలుస్తుంది. ఒక పెల్లి విడాకులు అయింది. ఇంకో పెళ్టి పెటాకులు అయింది. పిల్లా జెల్లా లేని దానివి అంటూ రామ్మూర్తి వెళ్లిపోతాడు.
మనోహరి కోపంగా విన్నావా చంభా ఆ ముసలోడిది ప్రేమ అన్నావు.. చూడు ఎంత వెటకారంగా మాట్లాడుతూ వెళ్లిపోయాడో అంటూ మనోహరి కోపంగా తిడుతుంటే.. మనోహరి కోపంతో నీ బుర్ర పని చేయడం లేదు. నీకు యాభై లోలు దొరికేశాయి అంటూ చంభా చెబితే.. మనవళ్ల కోసం తెచ్చిన ఆ డబ్బును ముసలోడు మనకెందుకు ఇస్తాడు చంభా అంటూ మనోహరి అడిగితే.. ఎవ్వరూ ఇవ్వరు మనోహరి మనమే తీసుకోవాలి అర్థం కాలేదా..? ఆ డబ్బులు నువ్వు కొట్టే్స్తే సరిపోతుంది అంటూ చంభా చెప్పగానే.. అబ్బా చంభా ఇన్ని రోజులకు ఎంత మంచి సలహా ఇచ్చావు పద రేపు అమర్ ఆ డబ్బులు పిల్లల అకౌంట్ లో వేసే లోపే అవి నా అకౌంట్ లో ఉండేలా చేయాలి అంటూ చంభాను తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది మనోహరి. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.