E-Paper
Advertisement

సోషల్ మీడియా ట్రెండ్ సెట్ చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే!

సోషల్ మీడియా ట్రెండ్ సెట్ చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే!
Advertisement

Folk Songs:ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ షార్ట్స్ చూసినా మన పల్లెటూరి ఫోక్ పాటలే మారుమోగిపోతున్నాయి. పెద్ద పెద్ద సినిమా పాటలను కూడా పక్కన పెట్టేసి, నాటు డప్పు బీట్స్, మన గ్రామీణ యాస జనాలను ఊపేస్తున్నాయి. డీజే స్టెప్పులతో డిజిటల్ వరల్డ్‌ను షేక్ చేస్తూ, మిలియన్ల కొద్దీ వ్యూస్ కొల్లగొట్టిన ఆ టాప్ వైరల్ ఫోక్ పాటలు ఏంటో, వాటి వెనుక ఉన్న క్రేజీ కథేంటో ఇప్పుడు చూద్దాం..

‘రాను బొంబాయికి రాను’.. రికార్డుల సునామీ:

ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న పాట ‘రాను బొంబాయికి రాను’. రాము రాథోడ్ రాసి, సింగర్ ప్రభతో కలిసి పాడిన ఈ పాట 2025 జనవరిలో వచ్చి ఏకంగా 95 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇక ఎంతలా అంటే అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ రికార్డును కూడా దాటేసి ఇంటర్నేషనల్ లెవల్లో సంచలనం రేపింది. కళ్యాణ్ కీస్ మ్యూజిక్ దీనికి పెద్ద ప్లస్.

‘ఓ పిల్లగా యంకటేషు’.. ‘సెనిగ చేన్ల నిలబడి’:

Advertisement

రెండో స్థానంలో సింగర్ ప్రభ పాడిన ‘ఓ పిల్లగా యంకటేషు’ నిలిచింది. పూజా నాగేశ్వర్ డ్యాన్స్‌తో ఈ పాట రీల్స్‌లో తెగ వైరల్ అయింది. ఇక మూడో స్థానంలో 2024లో వచ్చిన ‘సెనిగ చేన్ల నిలబడి చేతులీయవే’ ఉంది. జోగుల వెంకటేష్, అశ్విని యాదవ్ పాడిన ఈ పాటకు పార్ట్-2 కూడా వచ్చిందంటే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

‘ఎర్ర ఎర్రని రుమాలు’.. ‘కాపోల్ల ఇంటికాడ’:

నాలుగో స్థానంలో నాగదుర్గ, మల్లమ్మ పాడిన ‘ఎర్ర ఎర్రని రుమాలు’ డీజే బీట్స్‌తో యూత్‌ను ఉర్రూతలూగించింది. ఇక ఐదో స్థానంలో 2023లో వచ్చి ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న ‘కాపోల్ల ఇంటికాడ’ ఉంది. ఇక కుమార వాగ్దేవి పాట, నాగదుర్గ స్టెప్పులు, శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ కలిసి దీనికి ఐదు పార్టులు వచ్చేలా చేశాయి.

Advertisement

also read:బాడీ పెరిగింది కానీ బుర్రలేదా.. ముఖేష్ షాకింగ్ కామెంట్!

ఆరో స్థానంలో ‘దారిపొంటత్తుండు’:

ఆరో స్థానంలో ‘దారిపొంటత్తుండు.. దవ్వ దవ్వత్తుండు’ పాట నిలిచింది. ఇక మామిడి మౌనిక రాసి పాడిన ఈ పాట, మదీన్ మ్యూజిక్, నాగదుర్గ డీజే వెర్షన్ స్టెప్పులతో సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయింది.

‘రాను బొంబాయికి రాను’.. ‘నిమ్మ వనము తోటలో ‘..

గత ఏడాది విడుదలయి ఇప్పటికీ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన పాటలతో పాటు ఈ ఏడాది యూట్యూబ్లోకి వచ్చిన రాను బొంబాయి కి రాను, నిమ్మ వనము తోటలో వంటి ఎన్నో ఫోక్ సాంగ్స్ ఆడియన్స్ కి మంచి ఊపునిస్తున్నాయని చెప్పవచ్చు.

పల్లె పాటల పవర్ వేరే లెవల్:

సినిమా పాటలకు ఏమాత్రం తగ్గకుండా, మన మట్టి వాసన ఉన్న జానపద పాటలు ఇప్పుడు గ్లోబల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ నాటు బీట్స్ హవా ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

Related News

బాడీ పెరిగింది కానీ బుర్రలేదా.. ముఖేష్ షాకింగ్ కామెంట్!

అప్పుడు గాజులు.. ఇప్పుడు గజ్జెలు.. ప్రతిసారీ అదే పాట ఫార్ములానా?

మా బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది.. శాలినితో రిలేషన్ పై రోహిత్ ఓపెన్ కామెంట్స్!

బిగ్ బాస్ 10 లో పొలిటికల్ గేమ్స్.. సీక్రెట్ బయట పెట్టిన శివాజీ!

బిగ్ బాస్ హౌస్లో స్పెషల్ సర్ప్రైజ్.. సందడి చేసిన ఇమ్మానుయేల్, సంజన!

లోపల త్రిగుణ్..బయట పీఆర్ టీం.. బిగ్ బాస్ వారి చేతుల్లోనే: నటరాజ్ మాస్టర్

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న శ్రీవల్లి.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×