Rohit Naidu: రోహిత్ నాయుడు ఒక సామాన్యుడిగా అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో మొదటి రోజు నుంచి అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ ఓటింగ్ విషయంలో టాప్ లో ఉన్న రోహిత్(Rohit Naidu) కచ్చితంగా ఈ సీజన్ విన్నర్ అవుతారని అందరూ భావించారు కానీ ఎవరు ఊహించని విధంగా ఈ కార్యక్రమం 8వ వారంలోనే రోహిత్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా రోహిత్ ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ టీం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇక ఈ కార్యక్రమంలోకి రోహిత్ రీ ఎంట్రీ ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు కానీ తాను ఇకపై హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఉండదని రోహిత్ క్లారిటీ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ 10(Bigg Boss 10) తర్వాత రోహిత్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అదేవిధంగా పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఇకపోతే హౌస్ లో ఉన్న సమయంలో రోహిత్ శాలిని (Shalini) మధ్య ఉన్న బాండింగ్ చూసి అందరూ లవ్ లో ఉన్నారని భావించారు. ఇక వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పినప్పటికీ వీరి గురించి లవ్ రూమర్స్ మాత్రం ఆగడం లేదు.
ఇలా తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల పుకార్లు వస్తున్న నేపథ్యంలో వీటిపై స్పందించిన రోహిత్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక నోట్ విడుదల చేశారు.. ఇందులో భాగంగా రోహిత్ తెలియజేస్తూ.. ఒక నటుడిగా నేను ఏ షోలో అయితే పాల్గొంటున్నానో ఆ షో కి సంబంధించిన స్క్రిప్ట్, కాన్సెప్ట్ అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను గౌరవించాలని నమ్ముతాను. తన వృత్తిపరంగా తెరపై కేవలం నటిస్తున్నానని తెలిపారు. ఇలా నా వృత్తిపరమైన జీవితాన్ని వ్యక్తిగత జీవితానికి అలాగే ఇతర నటీనటులతో రిలేషన్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.
#RohitNaidu #TeamRohitNaidu pic.twitter.com/wRxeDahWyO
— Rohit Naidu Patnam (@RohitNaiduPatnm) November 24, 2026
తెరపై నన్ను చూస్తున్నది కేవలం వృత్తిపరమైన జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. దయచేసి ఎవరు నా విషయంలో ఎలాంటి ఊహగానాలు, పుకార్లు పుట్టించొద్దు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పర్సనల్ లైఫ్ ,అలాగే వారి ఫ్యామిలీని గౌరవిద్దాం అంటూ ఈ సందర్భంగా రోహిత్ నాయుడు ఒక నోట్ విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. అయితే కచ్చితంగా ఈయన శాలినితో వస్తున్న లవ్ రూమర్ల గురించి అలాగే బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా ఈయనపై వస్తున్న ఫేక్ న్యూస్ గురించి స్పందించారని తెలుస్తోంది.
Also Read: మా మధ్య గొడవలు లేవు.. బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్..