Nindu Noorella Saavasam Serial Today Episode: అబార్షన్ కోసం హాస్పిటల్‌కు వెళ్లిన మిస్సమ్మకు అమర్ ఫోన్ చేస్తాడు. మిస్సమ్మ సైలెంట్‌లో ఉంటుంది. డాక్టర్ తో కలిసి ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తుంది. భాగీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని రామ్మూర్తి కూడా హాస్పిటల్‌కు వెళ్తా అన్నారు ఆయనకు కాల్ చేద్దాం అనుకుని అమర్ రామ్మూర్తికి ఫోన్ చేస్తాడు. రామ్మూర్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే.. హాలో మామయ్యా హాస్పిటల్‌కు వెళ్లారా..? అని అడగ్గానే.. ఆ ఇక్కడే ఉన్నాను బాబు అని చెప్తాడు రామ్మూర్తి. భాగీ ఎక్కడుందని అమర్ అడగ్గానే.. టెస్టుల కోసమని ఇప్పుడే డాక్టర్ గారు లోపలికి తీసుకెళ్లారు… అని చెప్పగానే.. అమర్ భాగీ టెస్టులు చేయించుకోవడం లేదండి అబార్షన్ చేయించుకుంటుంది అని చెప్పగానే.. రామ్మూర్తి భయంతో బాబు గారు ఏంటి మీరు అనేది.? కడుపులో బిడ్డను వద్దనుకుంటుందా..? అని అడగ్గానే.. అవును మామయ్య వెంటనే వెళ్లి ఆపండి నేను వస్తున్నాను అని చెప్పగానే.. రామ్మూర్తి కోపంగా రాథోడ్‌ను చూస్తాడు.
దీంతో రాథోడ్.. నన్ను క్షమించండి సార్ ఈ విషయం ఎవరితో చెప్పోద్దని మిస్సమ్మ నాతో ఒట్టు వేయించుకుంది అని చెప్పగానే.. రామ్మూర్తి గట్టిగా డాక్టర్ ఆపండి.. ఆపరేషన్ ఆపండి.. అంటూ కేకలు వేస్తాడు. డోర్‌ను కొడతాడు. దీంతో లోపల మిస్సమ్మకు ఇంజక్షన్ ఇవ్వబోతున్న డాక్టర్ ఆగిపోతుంది. అందరూ బయటకు వస్తారు. మరోవైపు బయట కారుల వెయిట్ చేస్తున్న మనోహరి ఈ పాటికి ఆ భాగీ కడుపులో బిడ్డ కైలాసానికి వెళ్లి ఉంటుంది. లోపలికి వెళ్లి దాని ఏడుపు ముఖం చేసి వస్తాను అనుకుంటూ కారు దిగి వెళ్లబోతుంటే.. వెంటనే అమర్ వస్తాడు. కారు దిగి కంగారుగా హాస్పిటల్‌లోకి వెళ్తాడు. అమర్‌ను చూసిన మనోహరి అబ్బా అమర్ వచ్చాడేంటి ఇప్పుడు అనుకుని కారు రివర్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
లోపలికి వెళ్లిన అమర్ కోపంగా భాగీ అని పిలుస్తాడు. అమర్‌ను చూసిన రామ్మూర్తి రండి అల్లుడు గారు సమయానికి మీరు ఫోన్ చేయకపోయి ఉంటే చాలా పెద్ద ఘోరం జరిగిపోయేది అనగానే అమర్ కోపంగా పిచ్చి పట్టిందా నీకు నువ్వేం చేయబోయావో నీకు తెలుస్తుందా..? నిన్ను.. అంటూ అమర్ కోపంగా మిస్సమ్మను కొట్టబోతుంటే.. అక్కడే అంతా గమనిస్తున్న ఆరు ఏవండి అని అంటుంది. అమర్‌కు వినిపించి ఆలాగే ఆగిపోతాడు. అటూ ఇటూ చూసి రాథోడ్ నీకు ఈ విషయం తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు అంటాడు. దీంతో రాథోడ్ సారీ సార్ మీతో చెప్పొద్దని మిస్సమ్మ నాతో ఒట్టు వేయించుకుంది అని చెప్పగానే.. అమర్ కోపంగా కడుపులో బిడ్డ నీకు భారం అయిపోయిందా..? చెప్పు.. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేయాలనుకున్నావు.. తల్లివి కావడం నీకు ఇష్టం లేదా..? చెప్పు అని అడగ్గానే.. సవతి తల్లిని అవ్వడం నాకు ఇష్టం లేదండి అంటుంది మిస్సమ్మ..
సవతి తల్లి ఏంటి అని అమర్ అడగ్గానే.. నాకు సొంత బిడ్డ పుడితే నా అక్క పిల్లలకు నేను సవతి తల్లినే అవుతాను కదండి.. సొంత బిడ్డతో మమకారంతో ఆ నలుగురు పిల్లలను చిన్నచూపు చూస్తానేమోనని నాకు భయం వేసింది. నా వల్ల వాళ్లు బాధపడకూడదు అనుకుంటున్నాను.. అదే నాకంటూ పిల్లలు లేకపోతే ఆ నలుగురు పిల్లలను నా పిల్లలుగానే చూసుకుంటాను కదా అనుకున్నాను అని చెప్పగానే.. భాగీ ఈ పని నువ్వు ఎప్పుడో చేశావు. నా పిల్లలకు నువ్వు కేర్ టేకర్‌గా వచ్చిన రోజే నువ్వు వాళ్లను నీ సొంత పిల్లల్లా చూసుకున్నావు.. అలాగే అనుకున్నావు.. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న రోజే వాళ్లు నీ కన్న పిల్లలు అయ్యారు. వాళ్లు నీ సొంత అక్క పిల్లలు అని తెలిశాక కూడా నువ్వు వాళ్ల పట్ల నిర్లక్ష్యంగా ఉండగలవు అని ఎలా అనుకుంటున్నావు భాగీ అంటూ చెప్తాడు అమర్.
దీంతో మిస్సమ్మ వాళ్లు నా పిల్లలు కాబట్టే నాకంటూ మళ్లీ పిల్లలు వద్దనుకుంటున్నాను అండి.. అంటుంది. తప్పు భాగీ మీ అక్క బతికి ఉంటే నువ్వు తల్లివి కావాలని తను చాలా కోరుకునేది. ఎవరికి తెలుసు మీ అక్కే మన కూతురుగా పుట్టొచ్చని చెప్పగానే.. అక్కడే ఉన్న ఆరు ఏడుస్తూ.. నాకు ఆ అదృష్ట లేదండి.. నాకు మళ్లీ జన్మ లేదని చెప్పేశారు.. ఇక ఎప్పటికీ నేను మీ ఒడి చేరలేను.. నేను మీకు శాశ్వతంగా దూరం అవతాను.. సెలవు.. అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆరు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.