BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (24/10/2025) ఆ రాశి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు – నూతన పనులు ప్రారంభిస్తారు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (24/10/2025) ఆ రాశి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు – నూతన పనులు ప్రారంభిస్తారు
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 24వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ముఖ్యమైన  పనులు వాయిదా వేయడం మంచిది.  ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వృషభ రాశి:

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు  ఉంటాయి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతికి ధనం అందక ఇబ్బందిపడతారు. సంతానం విద్య ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి.


మిథున రాశి:  

ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.  వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు.

కర్కాటక రాశి:

బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.  నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ క్షేత్రాలు దర్శించుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

సింహరాశి:

వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో  ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగమున ఊహించని సమస్యలు  ఎదురవుతాయి. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.

కన్యారాశి :

వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.  చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు  నిరుత్సాహ పరుస్తాయి. దూరప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో  పరిచయాలు విస్తృతమవుతాయి.  సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి.  వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలకు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

వృశ్చికరాశి:

వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. మిత్రులతో సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇంటాబయట సమస్యలు కొంత బాధిస్తాయి.  ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమౌతాయి. రుణదాతల నుండి ఒత్తిడులు అధికమౌతాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి.

ధనస్సు రాశి:

వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందుకు సాగుతారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

మకరరాశి:

మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యయ ప్రయాసలతో కానీ  పనులు పూర్తి కావు.  మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపారాలు ముందుకు సాగక చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

కుంభరాశి:

ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఉంటాయి.

మీనరాశి:

భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు అందుతాయి. విందువినోద కార్యక్రమాలకు హాజరు అవుతారు. ఉద్యోగాలలో మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Brahmamudi Serial Today October 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అబర్షన్‌ చేయించుకోనని చెప్పిన కావ్య – కావ్యను మెచ్చుకున్న రుద్రాణి

GudiGantalu Today episode: పండగవేళ చిచ్చుపెట్టిన శోభ.. రెచ్చిపోయిన బాలు..సత్యం సీరియస్..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు..వాటిని డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today october 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను తిట్టిన అమర్‌

TV Serials : వణుకు పుట్టించే హారర్ సీరియల్స్.. ఒంటరిగా చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..

Illu Illalu Pillalu Today Episode: కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..కూల్ డ్రింక్ కోసం ఆడాళ్ళ ఫైట్..వల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి పై చక్రధర్ సీరియస్.. శ్రీయ పెద్ద గొడవ.. అవనికి సపోర్ట్ గా అక్షయ్..

Big Stories

×