TV Serials : ఒకప్పుడు సినిమాలు మంచి స్టోరీ తో పాటు నటుల పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా బ్లాక్ అండ్ వైట్ సినిమాలతో అప్పట్లో మంచి విజయాలను అందుకున్న స్టార్స్ ఎందరో ఉన్నారు. అలాంటి రోజుల్లో కేవలం సినిమాలు మాత్రమే కాదు సీరియల్స్ కూడా బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అయితే మంచి స్టోరీ తో పాటుగా అప్పటి కాలంలో వెన్నులో వణుకు పుట్టించే సీరియల్స్ సైతం ప్రసారమయ్యేవి. ఆ సీరియల్స్ భయపెట్టేవి గా ఉన్నా సరే ఎక్కువమంది వాటిని చూసేవారు.. 1990లో రియల్ స్టోరీలతో వచ్చిన హారర్ తెలుగు సీరియల్స్ గురించి మనం ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుందాం..
ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఈటీవీలో ప్రసారమైన సక్సెస్ఫుల్ సీరియల్స్లలో ఒకటి అన్వేషిత.. ఇలియాస్ అహ్మద్ దర్శకత్వం వహించారు. రామోజీ గ్రూప్ అధినేత, అప్పటి ఈటీవీ అధిపతి రామోజీరావు నిర్మాణ సారథ్యంలో 100 ఎపిసోడ్లు పూర్తిచేసుకుంది. అప్పట్లో బెస్ట్ హారర్ సినిమాగా ఎనిమిది అవార్డులను కూడా అందుకుంది. ఇందులో అచ్యుత్, యమున ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ డైలీ సీరియల్ కు ఇలియాస్ అహ్మద్ దర్శకత్వం వచ్చిన ఈ సీరియల్ గ్రహాంతర, అతీంద్రియ, మిస్టరీ-థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. అతీత శక్తులచే పిలువబడ్డ త్రిష్ణ అనే యువతి తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తెలియనివారి కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు గురించి స్టోరీలో చూపించారు. అప్పటిలో ఎంతగానో భయపెట్టింది.
రామోజీ రావు నిర్మాణంలో వచ్చిన టాప్ మోస్ట్ హారర్ సీరియల్స్ లలో మర్మదేశం కూడా ఒకటి. డిఫరెంట్ కథతో.. ఒకవైపు భయంతో మరోవైపు తెలుసుకోవాలని, మరోవైపు క్యూరియాసిటితో ఈ సీరియల్ కదా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. రహస్యం నాగద్వారా దర్శకత్వంలో వచ్చిన తెలుగు ధారావాహిక నాటిక. ఇది మొట్టమొదటగా అరవంలో మర్మదేశం అనే పేరుతో వెలువడింది.. అప్పట్లో దీనికి మంచి డిమాండ్ కూడా ఉండేది. దాంతో ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది.
ఇక ఇవే కాదు మనోయజ్ఞం, నాగమ్మ, నాగాస్త్రం వంటి హారర్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ రోజుల్లో ఇప్పట్లోగా ఎటువంటి గ్రాఫిక్స్ లేకపోయినా సరే భయంకరమైన సీన్లతో కనిపించేలా సీరియల్ ను తెరకెక్కించారు. అప్పట్లో ప్రసారమైన ప్రతి సీరియల్ కు స్పెషల్ సాంగ్ లు కూడా ఉండేవి. అవి జనాలను బాగా ఆకట్టుకునేవి.. అయితే ఈ రోజుల్లో వస్తున్న సీరియల్స్ శృతిమించిన రొమాన్స్ తో.. లేదా కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటివి చూపిస్తూనే స్టోరీని అందిస్తున్నారు. ఆరోజుల్లోనే ఇలాంటివి ఉండేవి అంటే నమ్మడం కష్టమే కానీ.. సీరియల్స్ పేర్లు వింటే మాత్రం ఖచ్చితంగా వారెవ్వా అంటూ పొగడ్తలు వర్షం కురిపించాయి. అలాంటి సీరియల్స్ ఈరోజుల్లో వస్తే మాత్రం జనాలు టీవీల ముందు నుంచి లేవరు అని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ రోజుల్లో వచ్చిన సీరియల్స్ ఈరోజుల్లో కూడా తెరకెక్కిస్తారేమో చూడాలి..