Fire Accident: హైదరాబాద్ లో శనివారం తెల్లవారుజామున.. ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా కూకట్ పల్లి పరిధిలోని మూసాపేట గూడ్ షెడ్ రోడ్డులో ఉన్న.. కంటైనర్ కార్పోరేషన్ డిపో కెమికల్ విభాగంలో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగనట్లు తెలుస్తోంది.