Gundeninda GudiGantalu Today episode October 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. నాన్న రూమ్ కట్టాలని అనుకున్నాడు కదా ఆ రూమ్ కి డబ్బులు ఇవ్వాలని ఇలా చేస్తున్నాడేమో అని మనోజ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ మావయ్య మాకు రూమ్ కట్టించేదేంటి మా ఆయనే మాకు రూమ్ కట్టిస్తాడు. అప్పుడు బంగారం కొనిస్తాడు అంతవరకు వేసుకొని అని అన్నారు… ఇప్పుడు మళ్లీ రూమ్ కట్టిస్తాడు అని అంటున్నావు ఇవి తీరినట్టే అని ప్రభావతి పెట్టుకోరంగా మాట్లాడుతుంది. మీనా మాత్రం మా ఆయన రూమ్ కట్టిస్తాడు అని శబదం చేస్తుంది. బాలు మీనా దగ్గరికి వచ్చి నువ్వు ఇలా అంటుంటే నాకు మాత్రం భయంగా ఉంది అని అంటాడు. ఇంకొక కారు కొని దాన్ని రెంటిగిద్దాం. అప్పుడు మనకి డబ్బులు వస్తాయి కదా అని మీనా అంటుంది. మీ ఒంటిమీద బంగారు ఉంటే వాటిని తాకట్టు పెట్టి కారు కొనేవాన్ని కానీ ఇప్పుడు అవి కూడా లేవు కదా అని బాలు అంటాడు.. మీ అమ్మని అడిగి మళ్ళీ తీసుకుందామని అంటుంది మీనా.. మా అమ్మని అడిగి తీసుకుంటే మళ్ళీ చులకన చేస్తుంది.. మనమే సంపాదించుకుందామని బాలు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే…నావల్ల కావట్లేదు ఇంకా జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను అని అంటుంది శృతి.. అంతసేపు నిలబడుకునే బదులు కాసేపు కూర్చోవచ్చు కదా అని రవి అంటాడు. ఎపిసోడ్ మొత్తం పూర్తవ్వాలి అని నిల్చోని పూర్తి చేసేసాను అందుకే నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని రోహిణి అంటుంది. నా కాళ్ళు నొక్కువా రవి అని బతిమిలాడుతుంది. రవి శృతి కాలు నొక్కడం ప్రభావతి చూస్తుంది. కొడుకుని పనిమనిషి చేసేసింది అని బాధపడుతూ ఉంటుంది. వాళ్ల రూమ్ లోకి వెళ్లి ఏంటి ఏం చేస్తున్నావని అడుగుతుంది. ప్రభావతిని చూసిన రవి నెయిల్ పెయింట్ వేయడం ఆపేస్తాడు. ఏంట్రా తను వెయ్యమంటే నువ్వు మాత్రం ఎలా వేస్తావు? పనిమనిషి చేస్తుంది రా చులకన అయిపోతావ్ అని అంటుంది.
ఆ మాట విన్న శృతి ఇందులో తప్పేముంది ఆంటీ భార్య కాళ్లు భర్త పట్టుకోవడం తప్ప ఏముంది.. ఒక స్టూడియోలో నిల్చుని కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అంటే రవి నొక్కాడు చాలా బాగుంది అని అంటుంది. మీకెప్పుడూ అంకుల్ ఇలా నెయిల్ పాయింట్ వేయలేదా ముందు ఈ నెయిల్ పెయింట్ తీసుకెళ్లి అంకుల్ని అడిగి వేయించుకోండి మీకే తెలుస్తుంది ఆ ఫీల్ ఏంటో అని అంటుంది. ప్రభావతి అక్కడి నుంచి బయటికి రాదని బాలు ప్రభావతికి తిక్క కుదిరింది అని అనుకుంటూ ఉంటాడు.. ఏంటి కుల్లావతి ఇలా వచ్చావ్ వాళ్ళకాపురంలో ఏమైనా పుల్లలు పెట్టాలని అనుకుంటున్నావా అని అంటాడు..
నీకు భార్యాభర్తలు సంతోషంగా ఉంటే నచ్చదు కదా అందుకే నువ్వు వెళ్లి ఏదో ఒక పుల్ల పెట్టేస్తున్నావే అని అడుగుతాడు.. అన్యోన్యంగా ఉంటే తప్పేంటి అని బాలు కూడా అంటాడు.. ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రవి బయటకొచ్చి ఏంటన్నయ్య అమ్మతో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు.. నువ్వు కరెక్ట్ గానే చేసావ్ రా భార్య కాళ్ళు పట్టుకొని తప్పేమీ కాదు.. ఆ నీల్ పెయింట్ ఏది ఇలా ఇవ్వు. నేను చెప్తాను అమ్మకి ఇంకా కాల్చి అలా చేస్తేనే అప్పుడు మన దారికి వస్తుంది అని సలహా ఇచ్చి వెళ్తాడు..
ప్రభావతి సత్యం దగ్గరకు వెళ్లి ఆ శృతి మన కొడుకుని ఆడుకుంటుందండి కాళ్లు పట్టించుకుంటుంది.. మనిషిని చేస్తుందని నాకు బాధగా ఉంది మీరు వచ్చి మాట్లాడండి అని అంటుంది.. నేను మాట్లాడితే ఏం బాగోదు ఇప్పుడు నాకు ఒక అర్జెంటు పని ఉంది అది చూసుకొని వచ్చిన తర్వాత మాట్లాడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు.. ఎక్కడికి వెళ్తున్నారు అని బాలు అడుగుతారు. చిన్న పనుంది వెళ్ళొస్తాను అని సత్యం అంటాడు. నేను వెళ్లొస్తాను నాకు చెప్పండి నాన్న అని బాలు అడుగుతాడు.. పర్లేదురా నేను వెళ్ళొస్తాను చిన్న పనే కదా మళ్ళీ వచ్చి చెప్తాను అని అంటాడు.
Also Read :డాక్టర్ బాబు మాములోడేమి కాదు.. అమ్మ దొంగ నువ్వు మొదలెట్టేశావా..?
ఆ తర్వాత మనోజ్ షాపుకి కొందరు వ్యక్తులు వచ్చి నాలుగు లక్షలకు ఫర్నిచర్స్ కొనుక్కొని వెళ్తారు. డబ్బులు వచ్చినాయన సంతోషంతో రోహిణి తో ఆ విషయాన్ని చెప్పి చాలా సంతోషంగా ఉంటాడు. ఇక వెంటనే షాప్ కి విజిలెన్స్ అధికారులు అంటూ మరో ఇద్దరు వస్తారు. వాళ్లు కూడా మనోజ్ ని నమ్మించి అక్కడున్న డబ్బులని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్లు ఫ్రాడ్స్ మిమ్మల్ని పట్టుకున్నాము పోలీస్ స్టేషన్కు వెళ్లి మీ ఫర్నిచర్స్ ని తెచ్చుకోండి అని అంటారు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తే, ఎక్కడున్నావ్ ఎస్సై కూడా మనోజ్ ని దారుణంగా తిడతాడు. ఇంత తింగ్రోడివి ఎలా బిజినెస్ చేస్తున్నావని తిట్టడంతో పాటుగా నిన్ను కూడా జైల్లో వేస్తానని షాక్ ఇస్తాడు. అక్కడి నుంచి ఎలాగోలాగా మేనేజ్ చేసి వచ్చేస్తాడు మనోజ్. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..