Montha Disaster in AP: ఆంధ్రప్రదేశ్‌లోని మొంథా తుఫాను బీభత్సానికి చిరుగుటాకులా వణికించింది. ఆదివారం అర్థరాత్రి నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం మొదలు నెల్లూరు వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు ధాటికి వివిధ జిల్లాల్లో అర్బన్ ఏరియాల్లో చెట్లు విరిగిపోయాయి. పలు ప్రాంతాల్లో నేలకొరిగాయి. విద్యుత్ స్థంబాల గురించి చెప్పనక్కర్లేదు. ఎక్కడికక్కడే నేల కూలాయి. ఈ పరిస్థితిని ముందుగా ఊహించిన అధికారులు విద్యుత్ సరఫరాను పలు ప్రాంతాలకు నిలిపివేశారు.
కోస్తా జిల్లాల్లో మొంథా తుఫాను బీభత్సం
మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు, గాలులు ఏపీని వెంటాడుతున్నాయి. తుపాను తీరం ధాటే సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. దీని ధాటికి తీర ప్రాంతంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఏడు జిల్లాల్లో పెనుగాలులు బీభత్సం సృష్టించినట్టు అధికారులు చెబుతున్నారు. భారీ వృక్షాలు సైతం కూకటివేళ్లతో కూలి పోయాయి.
గాలుల తీవ్రతకు కరెంటు స్తంభాలు పడిపోయాయి. కృష్ణా జిల్లా తీరంలో అంధకారం అలుముకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకారం, నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని హెచ్చరిక జారీచేసింది వాతావరణ శాఖ. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
చెట్లు, విద్యుత్ స్థంబాలు.. రైల్వే ట్రాక్ ధ్వంసం
మొంథా తుఫాను ధాటికి శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు పలు ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాజెక్టులు నీటి ప్రవాహం అమాంతంగా పెరిగింది. ఒడిషా నుంచి వస్తున్న వరదతో మహేంద్ర తనయ, వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా గురించి చెప్పనక్కర్లేదు.
ALSO READ: మొంథా తుఫాను తీరం ధాటింది.. కుమ్మేస్తున్న వర్షాలు
ఉమ్మడి విశాఖ, పాడేరు, అరకు ఘాట్‌రోడ్‌పై వరద నీరు ఏరులై పారింది. అనంతగిరి సమీపంలో రోడ్డుపై ఉధృతంగా వరద నీరు ప్రవహించింది. దీంతో ఆయా ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖ నుండి అరకు వెళ్లే సింగిల్ రైలు మార్గంలో వర్షం బీభత్సం అంతా ఇంతా కాదు. త్యాడ, చిమిడిపల్లి రైల్వేస్టేషన్ లైన్ సెక్షన్ మధ్య సొరంగం దగ్గర ట్రాక్‌పై బండరాళ్లు పడిపోయాయి. 63వ కిలోమీటర్ వద్ద ట్రాకుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. సమీపంలో ఉన్న అధికారులు, ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. చాలా ప్రాంతాల్లో సమద్రం కోతకు గురైంది.
కృష్ణా, గుంటూరు, ప్రకారం జిల్లాల్లో తుఫాను వల్ల భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోస్తా జిల్లాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నారు. వరితోపాటు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కోనసీమ జిల్లాలోని అంతర్వేది పల్లిపాలెంలో అలలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద మత్య్సకారుడు సముద్రంలో గల్లంతు అయ్యాడు. బోటును ఒడ్డుకు చేర్చే క్రమంలో సముద్రంలోకి జారిపోయాడు సాయిరామ్ అనే వ్యక్తి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక విరిగిపోయిన చెట్లు గురించి చెప్పనక్కర్లేదు. ఒంగోలు పట్టణంలో ప్రధాన రహదారులపై మోకాళ్లలోతు ప్రవహిస్తోంది వరద నీరు. ఆ జిల్లా వ్యాప్తంగా 60 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాదాపు 3 వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.
విశాఖ, అరకు ఘాట్‌రోడ్‌పై ఏరులై పారుతోన్న వరద నీరు
అనంతగిరి సమీపంలో రోడ్డుపై ఉధృతంగా వరద నీరు
తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
కేకే లైన్లో వర్ష బీభత్సం
63వ కి.మీ వద్ద ట్రాకుపై విరిగిపడిన కొండచరియలు
బొర్రా, చిమిడిపల్లి రైల్వేస్టేషన్ మధ్య ట్రాక్‌పై వర్షపు నీరు
ట్రాక్… pic.twitter.com/YDBZDWYqd2
— BIG TV Breaking News (@bigtvtelugu) October 29, 2025
భారీ వర్షాలు.. నేలకొరుగుతున్న చెట్లు
మొంథా తుఫాను ప్రభావం కారణంగా ఈదురుగాలులకు నేలకూలుతున్న భారీ వృక్షాలు
ఈదురుగాలులకు చల్లపల్లి-మచిలీపట్నం ప్రధాన రహదారిపై నేలకొరిగిన చెట్లు
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట-ఎస్.రాయవరం మండలం గోకులపాడు 16వ జాతీయ రహదారిపై కూలిన భారీ చెట్టు
దీంతో… pic.twitter.com/IKqhIY31qJ
— BIG TV Breaking News (@bigtvtelugu) October 29, 2025