Ind vs Aus 1st T20: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Australia vs India ) మధ్య మొన్నటి వరకు వన్డే సిరీస్ జరగక.. నేటి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ టి20లో ఆడనుంది టీమిండియా. ఈ టి20 సిరీస్ లో భాగంగా మొత్తం మూడు మ్యాచ్ లు ఆస్ట్రేలియాతో తలపడనుంది టీమిండియా.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 1st T20I ) మధ్య ఇవాళ్టి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కాన్‌బెర్రా వేదికగా జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అంటే టాస్ ప్రక్రియ 1:15 గంటలకు ఉంటుందన్నమాట. సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ఫినిష్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఈ టి20 సిరీస్ ను హాట్ స్టార్ లో ఉచితంగానే చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ లు వస్తున్నాయి. మొన్నటి వరకు వన్డేలు గిల్ సారథ్యంలో టీమిండియా ఆడింది. ఇవాల్టి నుంచి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా టి20 సిరీస్ ఆడుతుంది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Australia vs India ) మధ్య ఇప్పటి వరకు 32 టీ20లు జరిగాయి. ఇందులో 20 మ్యాచ్ లలో టీమిండియానే గెలిచింది. ఆస్ట్రేలియా 12 మ్యాచ్ లలో గెలిచింది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మతో పాటు హెడ్ ఇద్దరు కలిసి ఓపెనింగ్ కు దిగేవారు. చాలా భయంకరమైన ఇన్నింగ్స్ ఆడేవారు. అలాంటి అభిషేక్ శర్మ, హెడ్ ఇద్దరు బద్ధ శత్రువులుగా మారిపోనున్నారు. ఆస్ట్రేలియా తరఫున హెడ్ బరిలోకి దిగుతుంటే టీమిండియా తరఫున అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. ఇన్ని రోజులు కలిసి ఆడిన వీళ్లిద్దరూ, RRR సినిమాలో రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లాగా ఇద్దరు విడిపోయి, తమ తమ జట్ల కోసం ఆడనున్నారు.
ఆస్ట్రేలియా ప్రాబబుల్ XI: ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్‌లెట్/సీన్ అబాట్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్
ఇండియా ప్రాబబుల్ XI: అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు సామ్సన్ (వికెట్ కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్
Also Read: Indian Team: ఎముకలు కొరికే చలిలో టీమిండియా ప్రాక్టీస్.. చేతులు పగిలిపోతున్నాయి.. వీడియో వైరల్
?igsh=ajJmZDI0MWdxM3p4