Intinti Ramayanam Today Episode October 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో అవని వదిన ఒక్కటే కష్టపడుతుంది. ఇంటి అడ్డు కట్టడానికి ఆమె ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలుసు. వదినకు సాయంగా ఉండాలని ఎవరు అనుకోలేదు. భార్య ఇంటి వద్ద కట్టడానికి డబ్బులు ఇవ్వకుండా టీవీ కొన్నది. అందుకే నేను వదినకి సాయంగా ఉండాలని అనుకుంటున్నాను. నేను ఇలానే ఉంటాను ఇలానే చేస్తాను అని కమల్ అంటాడు. కమల్ మాటకి అందరూ సంతోషపడతారు. పల్లవి నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు బావ నీ చేత నేను బిజినెస్ చేయిస్తాను అని అంటుంది..
ఆ తర్వాత అవని దగ్గరికి వెళ్లిన అక్షయ్ ఏంటండీ ఉద్యోగం వచ్చిందా అని అడుగుతుంది అవని. లేదు అవి రాలేదు అని అక్షయ్ అంటాడు. మీరేం ఫీల్ అవ్వకండి మీకు మంచి క్వాలిఫికేషన్ ఉంది కదా ఖచ్చితంగా మీకు మంచి జాబ్ ఏ వస్తుంది అని అంటుంది. ప్రణతి, భరత్ లు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆ తింగరోడి కోసం నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని చక్రధర్ పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు. మీ ఆస్తికి వారసురాలు నేనే కదా ఆస్తిని వాటపంచండి అని అడుగుతుంది.. ఏ తండ్రి తన బిడ్డలకి వాటపరచాలని కచ్చితంగా రూల్ లేదు. నేను వాడికైతే అస్సలు రూపాయి కూడా ఇవ్వను. నీకు కావాలంటే చెప్పు ఎంతైనా ఇస్తాను. వాన్ని వదిలేసి వచ్చేసేయ్ నువ్వు ఇక్కడే ఉంటే నా బిజినెస్లకు నువ్వే మహారాణి అవుతావు అని చక్రధరంటాడు.. పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డబ్బులు తీసుకొని వస్తానని వెళ్ళావు కదా.. నా చేత ఏం బిజినెస్ పెట్టిస్తున్నావు అని కమల్ అడుగుతాడు.
డబ్బులు ఏం ఎంత తెచ్చావో చెప్తే ఏం పెట్టాలో నేను చెప్తాను అని కమలం అంటాడు. నేను డబ్బులు తీసుకురాలేదు బావ అని పల్లవి అంటుంది. నాకు తెలుసు నీకు నాకు ఇవ్వాలని మీ నాన్నని అడిగితే అస్సలు ఇవ్వడని తెలియదు అనుకుంటా.. బాగా తెలుసు అని కమలంటాడు.. కానీ నాకు ఇవ్వాల్సిన వాటా గురించి అడిగినా కూడా మా నాన్న ఇవ్వను అని అన్నాడు. చూసావా ఎవరైనా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా తమ పిల్లలకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని అనుకుంటారు. నాన్న నీకు కూడా ఇవ్వను అన్నాడంటే కచ్చితంగా ఇప్పటికైనా నువ్వు ఆలోచించాలి మీ నాన్న ఎలాంటి వాడో.. నీకు అక్కడ విలువలేదు ఇక్కడ విలువలేదు అంటే నువ్వు ఇకమీదట తోక జాడిచావంటే బాగోదు అని వార్నింగ్ ఇస్తాడు.
అక్షయ్ ఇంటిని లాక్కున్న వాడి గురించి లాయర్ చెప్పిన విషయాన్ని అవనితో మాట్లాడుతాడు.. అవని వాడి గురించి ఎలాగైనా తెలుసుకోవాలండి అని అంటుంది. అయితే మనము పోలీసులు కోర్టులు అంట వెళితే పనికాదు వేరే పద్ధతిలో ఎలాగైనా సరే అతను చేసింది ఫ్రాడ్ అని నిరూపించాలి అని అంటాడు. కమలు వేరే పద్ధతి ఏంటి నీ పట్టుకుని నాలుగు పీకితే వాడే నిజం కక్కుతాడు. ఇప్పుడు వదిన చేసింది తప్పు లేదని తెలిసిపోతుంది అని ఆవేశపడతాడు. అన్నిటికీ ఈ ఆవేశం వద్దురా ఆలోచించి చేయాలి అని అక్షయ్ అంటాడు. పల్లవి వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. నేను చాటుగా వింటే ఏదో అనుకుంటారు అక్కడికే వెళ్లి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటుంది.
అయితే పల్లవి అక్కడికి వెళ్లి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. ఇంట్లో శ్రియ శ్రీకర్ కనిపించలేదు ఎక్కడికి వెళ్లారు అని అవని అడుగుతుంది. ఇంట్లో ఎవరు లేరు ఎవరున్నారు తెలుసుకొని నాఫనా.. నేనెందుకు తెలుసుకోవాలి నాకేం అవసరమని అంటుంది. ఆ మాట వినగానే ఇంట్లో మనిషివి కదా మనుషుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంటుంది కదా అని కమలంటాడు. అప్పుడే అక్కడికి శ్రీకర్ శ్రీయ ఫుల్లుగా తాగేసి వస్తారు.. ఏంటి మీరిద్దరూ ఎలా ఉన్నారు తాగేసి వచ్చారా అని అవని అడుగుతుంది. స్పీకర్ అంటే అబ్బాయి నువ్వు అమ్మాయివై ఉండి కూడా తాగేసి వచ్చావా అని అవని అడుగుతుంది. ఈరోజుల్లో పార్టీ కల్చర్ గురించి మీకు తెలియదనుకుంటా అందరూ తాగేసే వస్తారు. నువ్వు కూడా అవనీని అడుగుతుంది..
అయినా ఈ రోజుల్లో తాగితే తప్పేంటి అని పల్లవి కూడా అంటుంది. అవని శ్రియ తాగడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి అనడంతో చెంప పగలగొడుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కనీసం నీకు ఆ బుద్ధి కూడా లేకుండా తాగేసి వచ్చావా అని అడుగుతుంది.. పెద్దవాళ్ళు ఉంటే వాళ్లని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పిస్తే సరిపోతుంది కదా అని శ్రీకర్ అనగానే అవని శ్రీకర్ని కొట్టబోతుంది. అక్షయ్ అవని ఆపుతాడు. ఏంటండీ మీరు కూడా శ్రీకర్ కి సపోర్ట్ చేస్తున్నారా..? నా తమ్ముని నువ్వు కొట్టడం కరెక్ట్ కాదు నేను కొట్టాలని చంప పగలగొడతాడు..
మమ్మల్ని కొడతావా అని శ్రియ అడుగుతుంది. కొట్టడం కాదు ఇంకొకసారి ఇలా మాట్లాడితే నిన్ను కూడా కొడతాను అని శ్రీకర్ ను అక్షయ్ అంటాడు.. మీరిద్దరు ఇలా తాగొచ్చి ఇంట్లో పెద్ద వాళ్ళని ఇబ్బంది పెట్టడం మీకు మంచిదేనా అని అక్షయ్ అడుగుతాడు. అయితే శ్రీయ శ్రీకర్ మాత్రం ఏం మాట్లాడుకుండా వెళ్ళిపోతారు.. ఉదయాన్నే లేవగానే శ్రీకర్ తలనొప్పిగా ఉందని బాధపడుతూ ఉంటాడు. అయితే అవని మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది. ఏంటివి అని శ్రీకర్ అడుగుతాడు రాత్రి తాగింది దిగాలంటే ఉదయం కచ్చితంగా నువ్వు మజ్జిగ తాగాల్సిందే అని అవని అంటుంది. రాత్రి తాగి వచ్చినపుడు తెలియదా రా ఎందుకు తాగనంటున్నావ్ అని అక్షయ్ అంటాడు.
Also Read :ప్రభావతికి క్లాస్ పీకిన శృతి.. బాలు దెబ్బకు షాక్.. దారుణంగా మోసపోయిన మనోజ్..
నీ చేత ఇస్తే నేను తాగను నువ్వు తప్పు లేదని నిరూపించుకో అప్పుడే నువ్వు ఇచ్చిన మజ్జిగ తాగుతాను లేదా నీతో మాట్లాడతాను అని శ్రీకర్ అంటాడు. పల్లవి కమల్ చెప్పిన పనులన్నీ చేయాలని అనుకుంటుంది. బయట కూరగాయలు మూసుకొని వస్తుంటే ఎదురుగా తన ఫ్రెండు రావడం చూసి ఇది గనక నన్ను చూస్తే కచ్చితంగా అందరికీ చెప్పేస్తుంది. నా పరువు పోతుంది అని మేనేజ్ చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…