BigTV English
Advertisement

OTT Movie : చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… 13 ఏళ్ల తరువాత రివేంజ్… క్లైమాక్స్ కాటేరమ్మ జాతర

OTT Movie : చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… 13 ఏళ్ల తరువాత రివేంజ్… క్లైమాక్స్ కాటేరమ్మ జాతర

OTT Movie : సైకలాజికల్ సినిమాలు చూడటానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే కొన్ని సినిమాలలో వయలెన్స్, టార్చర్ సీన్స్‌ వణుకు పుట్టిస్తుంటాయి. వయలెన్స్ ప్రధాన అంశంతో ఒక సైకలాజికల్ హారర్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో చనిపోయేంత వరకు టార్చర్ పెడతారు. మరణం తరువాత ఏముందో తెలుసుకోవడానికి ఇలా చేస్తుంటారు. ఈ సినిమాలో హింస మరో లెవెల్ లో ఉంటుంది. ఫ్యామిలీతో అస్సలు చూడలేం. ఒంటరిగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘మార్టిర్స్’ (Martyrs)  2008లో విడుదలైన ఫ్రెంచ్ కెనడియన్ సైకలాజికల్ హారర్ సినిమా. డైరెక్టర్ పాస్కల్ లాగియర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో లూసీ (మైలీన్ జామ్పానోయ్), ఆనా (మోర్జానా అలావుయ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 99 నిమిషాల రన్‌ టైమ్ తో ఐయండిబిలో 7.0/10 రేటింగ్ పొందింది. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

లూసీ అనే 10 ఏళ్ల చిన్న అమ్మాయిని, ఒక రహస్య గోడౌన్‌లో బంధించి రోజుల తరబడి టార్చర్ చేస్తారు. ఒక రోజు ఆమె ఎస్కేప్ అవుతుంది. కానీ ఆమె మనసు పూర్తిగా పాడైపోతుంది. ఆమెకు ఒక భయంకరమైన, చర్మం లేని ఆత్మ కనిపిస్తూ హాన్ట్ చేస్తుంది. 13 సంవత్సరాల తర్వాత, లూసీ, ఆనా అనే స్నేహితురాలితో ఉంటుంది. అయితే ఆ ఆత్మ “రెంజ్ తీర్చుకో” అని మళ్ళీ వెంట పడుతుంది. లూసీ ఒక ఫ్యామిలీ ఇంట్లోకి వెళ్ళి వాళ్లను షూట్ చేసి చంపుతుంది. ఆనా ఇది చూసి షాక్ అవుతుంది. కానీ స్నేహం కోసం డెడ్ బాడీలను దాచుతుంది.


ఆ చనిపోయిన ఫ్యామిలీ సాధారణమైనది కాదు. వాళ్లు ఒక రహస్య సొసైటీలో భాగం. ఈ సొసైటీ చిన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తుంది. ఎందుకంటే “మార్టిర్” క్రియేట్ చేయడానికి. మార్టిర్ అంటే ఎక్స్‌ట్రీమ్ నొప్పి ద్వారా మరణం తర్వాత ఏముందో చూసి, తిరిగి వచ్చి చెప్పే వ్యక్తి అని అర్థం. లూసీ, ఆనా చిన్నప్పుడు వీళ్ల చేతుల్లో పడ్డారు. లూసీకి వాళ్ల ప్రయోగం వల్ల ఆత్మలు కనిపిస్తుంటాయి. ఇంతలో సొసైటీ మెంబర్స్ లూసీని పట్టుకుని మళ్లీ టార్చర్ చేస్తారు. గోళ్లు పీకేయడం, చర్మం ఒలవడం లాంటివి చేయడంతో లూసీ మరణిస్తుంది. ఆనా రివేంజ్ గా సొసైటీ మెంబర్స్‌ను చంపుతుంది. కానీ ఆమెను కూడా వాళ్ళు పట్టుకుంటారు.

Read Also : అడవిలో అంధుడి అరాచకం… 1 గంట 48 నిమిషాల గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఈగోను శాటిస్ఫై చేసే మలయాళం రివేంజ్ డ్రామా

ఆనాను అండర్‌గ్రౌండ్ రూమ్‌లో బంధిస్తారు. చాలా రోజులు టార్చర్ చేస్తారు. కొట్టడం, బర్న్ చేయడం, చర్మం ఒలవడం తో ఆమె శరీరం పూర్తిగా చితికిపోయి ఉంటుంది. చివరికి ఆమె “మార్టిర్” స్టేజ్ కి చేరుకుంటుంది. మరణానంతర లోకం చూస్తుంది (హెవెన్ లాంటిది). సొసైటీ లీడర్ “ఏమి చూశావు?” అని అడుగుతాడు. ఆనా ఆ రహస్యం చెప్పకుండా, గన్ తీసి తన మీదే షూట్ చేసుకుంటుంది. సినిమా ఆనా కళ్లు తెరచుకుని దూరంగా ఏదో చూస్తూ ముగుస్తుంది.

 

Related News

OTT Movie : ప్రెగ్నెంట్ వైఫ్ తో ఇదేం పాడు పనిరా అయ్యా… కేక పెట్టించే సీన్లు… మెంటల్ మాస్ క్లైమాక్స్

OTT Movie : ఊరికి మిస్టీరియస్ శాపం… స్కిన్ లేకుండా పుట్టే పిల్లలు… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు అస్సలు చూడకూడని హర్రర్ మూవీ

IT Welcome To Derry on OTT : ఒకే ఒక్క ఎపిసోడ్ తో ఓటీటీని వణికిస్తున్న ‘ఐటీ: వెల్‌కమ్ టు డెర్రీ’… మిగతా ఎపిసోడ్ల స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : ఓటీటీలో ఆడరోబో అరాచకం… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని ట్విస్టులు… తుక్కురేగ్గొట్టే యాక్షన్ డ్రామా

OTT Movie : వర్షంలో లిఫ్ట్ అడిగే అమ్మాయి… స్ట్రేంజర్స్ కన్పిస్తే పారిపోయేలా చేసే మూవీ… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : అమ్మాయిలను కిడ్నాప్ చేసి, వెర్రివేశాలేసే సైకో .. రాత్రయితే ఫ్యామిలీ అంటూ నరకం… ఆ పాడు పనులన్నీ ఒకే గదిలో

OTT Movie : మొగుడిని వదిలేసి మరొకడితో… ముసలి వాళ్లను నరికి చంపే లేడీ సైకో… ఒళ్ళు గగుర్పొడిచే సీరియల్ కిల్లర్ మూవీ

Big Stories

×