Star Maa Parivaaram Promo : బుల్లి తెరపై ఎన్నో రకాల షోలు ప్రసారమవుతూ ఉంటాయి.. అందులో కొన్ని రకాల షోలకు మాత్రం ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిలో శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న షోలకైతే డిమాండ్ కూడా ఎక్కువే. యాంకర్ సుమ తర్వాత ఆ స్థానంలో ఉన్నది శ్రీముఖి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన అందం చలాకితనం మాట తీరుతో షోలో ప్రేక్షకులను ఆకట్టుకునే డైలాగులు వదలడంతో ఆమె షోలకు డిమాండ్ ఎక్కువే.. ప్రస్తుతం శ్రీముఖి పలు టీవీ షోలలో హోస్ట్ గా వ్యవహరిస్తుంది.. అందులో ఒకటి స్టార్ మా లో ప్రసారమవుతున్న స్టార్ మా పరివారం.. ఈ షోలో సీరియల్స్ స్టార్స్ పాల్గొని సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ఈ షో ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ షోలో ఏ పండగకు తగ్గట్లు ఆ థిమ్ తో సెలబ్రేట్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈవారం కార్తీక వారం సందర్భంగా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ ని మొదలుపెడతారు. సీరియల్ సెలబ్రెటీలు ప్రియాంక జైన్, కావ్యశ్రీ, సుహాసిని, గాయత్రి సింహాద్రి సహా పలువులు షోకి వచ్చారు. ఈ సందర్భంగా కాబోయేవాడి టాపిక్ రాగా శ్రీముఖిపై కావ్య వేసిన పంచు మాత్రం దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించింది. ఈ ప్రోమోలో ఇదే హైలెట్ అయిందని చెప్పాలి. అసలు ఏం జరిగింది అంటే.. షోలోకి ఎంటర్ అవ్వగానే వీళ్ళ కట్టుబొట్టు పండగ ఎప్పుడు చూస్తే కొరికేయాలి అనిపిస్తుంది అంటూ శ్రీముఖి అంటుంది. ఆ తర్వాత సుహాసిని మీ ఆయన గారు ఏం చేస్తుంటారు అని అడుగుతుంది. తర్వాత గాయత్రీ ని నీకు ఎలాంటి భర్త కావాలి అని అడుగుతుంది. శ్రీముఖికి ఎలాంటి భర్త అయితే వస్తాడో నాకు అలాంటివాడే కావాలి.. అని గాయత్రి చెప్పడంతో శ్రీముఖి అవాక్కైంది. శ్రీముఖి వారి దేవుడో నా మొగుడి మీద కన్నేసావ్ ఏంటి తల్లి అంటూ అంటుంది. ఇంతలో మీకు నిజంగా అబ్బాయి కావాలా.. అని కావ్య అడిగిన ప్రశ్నకి శ్రీముఖి బిత్తర పోయింది. శ్రీముఖి ఏదో అబ్బాయిల కోసం పడి చచ్చిపోతుంది అన్నట్లుగా కావ్య అడగడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్లో శ్రీముఖి తన కాబోయే భర్త గురించి చెప్తుందేమో చూడాలి..
Also Read : డాక్టర్ బాబు మాములోడేమి కాదు.. అమ్మ దొంగ నువ్వు మొదలెట్టేశావా..?
ఈ ప్రోమోలో చివరగా సిరి ఎంట్రీ ఇస్తుంది. ఒకప్పుడు యాంకర్ గా పలు షోలలో చేసిన ఈ అమ్మడు ఈ మధ్య బిజినెస్ లు కూడా చేస్తుందని శ్రీముఖి షోలో బయట పెట్టేస్తుంది.. మా పరివారానికి సిరిసంపదలు వచ్చాయ్.. అంటూ వెల్కమ్ చెప్పింది. సిరి.. బిజినెస్‌ని చూసుకుంటుందని విన్నాను ఎందుకు ఇట్ల చేస్తున్నావ్ అని అడుగుతుంది. ఆ తర్వాత సమీరా భరద్వాజ్ గురించి మాట్లాడుతుంది శ్రీముఖి. సింగరు యాక్టర్ కాదు యాంకర్ కూడా ఉన్నారు. కొంపతీసి మాకేమైనా పోటీ వస్తుందా ఏంటి అని శ్రీముఖి అనడంతో అక్కడ వాళ్ళందరూ నవ్వుకుంటారు. దాంతో ప్రోమో ఎండ్ అవుతుంది. మొత్తానికి అయితే ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శ్రీముఖి ఉన్న షో బ్లాక్ బస్టర్ హిట్ అవడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ ఎపిసోడ్లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో తెలియాలంటే కచ్చితంగా షో ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..