Gundeninda GudiGantalu Today episode October 31st : గుడిలోకి వెళ్ళగానే అందరం పక్కలు వేసుకొని పడుకోవాలి అని అనుకుంటారు. కానీ అప్పుడే పడుకుంటే ఏం మజా వస్తుంది. ఇక్కడికి వచ్చి మనం ఏదో ఒకటి చేసి సరదాగా గడపాలి అని మీనా అంటుంది. అదే విధంగా శృతి కూడా అవును ఎప్పుడు తిని పడుకోవడమేనా ఇలా సరదాగా ఏదో ఒక ఆట ఆడుకోవాలి అని అంటుంది. అయితే అందరూ కలిసి మాట్లాడుకుని ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటారు. అందులో చీటీలు తీసి ఎవరికి ఏది వస్తే అది చేయాలి అని శ్రుతి చెప్తుంది. అనుకున్న విధంగానే మొత్తం చీటీలను రాసుకొని వస్తుంది. ఇకపోతే శృతి అందులో ఏమి వస్తే అది కచ్చితంగా చేయాలి అని అంటుంది అయితే.. ముందుగా ఆడవాళ్లు గొప్ప వల్ల మగవాళ్ళు గొప్ప వాళ్ళ అనే ప్రశ్న వాళ్ళకి వస్తుంది. ఇక ఆడవాళ్లు మగవాళ్ళు కొట్టుకునే పని వరకి వెళ్తారు. ఈ గేమ్ ఎపిసోడ్కి కాస్త ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది.
ఆ తర్వాత అత్తలు గ్రేటా కోడలు గ్రేటా అన్న ప్రశ్న రావడంతో ఇక మగవాళ్ళు మీరు కొట్టుకు చావండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని అంటారు. మొత్తానికి అత్తలు వర్సెస్ కోడలు ప్రశ్న అందరిని మాటలు యుద్ధానికి తీసుకువెళుతుంది. ఒకరినొకరు మాట్లాడుకుంటూనే నువ్వు గ్రేట్ఆ నువ్వు గ్రేట్ఆఅంటు చెప్పుకుంటూ ఉంటారు. చివరికి అత్తలే గ్రేట్ అని మీనా చెప్పడంతో ప్రభావతి కాస్త శాంతిస్తుంది. అయితే బామ్మ గారి గురించి నేను చెప్పాను బామ్మగారు చాలా గ్రేట్ కదా అని అంటుంది దాంతో ఇక ప్రభావతి కూడా తప్పక ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తానికి అత్తలు వర్సెస్ కోడలు ప్రశ్నకి మీనా పుల్ స్టాప్ పెట్టిస్తుంది. ఇక మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్లి నీళ్లు తాగేసి వస్తాను మనోజ్ వెళ్తాడు అక్కడ రాజేష్ రాగానే నాకు మరింత గిఫ్ట్ లు కావాలి అని మళ్లీ ఈ డబ్బులు ఇస్తాడు. అటు గుణ మాత్రం బాలు నెలగైనా సరే దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో గుణ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి..
రాజేష్ చెప్పినట్టుగా గుడిలో ఉన్న అన్ని గిఫ్ట్లు తనకే రావాలి అని అనుకుంటూ ఉంటాడు. ఎలాగైన సరే ఆ కాస్ట్లీ గిఫ్ట్లను తనే సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. ఈ విషయం గురించి రాజేష్ ని ఒకసారి అడగాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే రాజేష్ పక్కకు వెళ్ళగానే ఈరోజు గిఫ్ట్ ఇస్తారా ఇవాళ లాస్ట్ డేట్ కదా నాకు ఏమొచ్చిందో లక్కీ డ్రా ని తీస్తే బాగుంటుంది కదా 10 నేనే వేసాను కదా అని అడుగుతాడు. అయితే రాజేష్ అప్పుడేనా ఇంకా టైం పడుతుంది ఇప్పుడు నువ్వు ఇంకొక 10000 ఇవ్వాలి అని అనగానే మనోజ్ మళ్ళీ ఇంకొక 10000 ఇస్తాడు. ఇవాళ గిట్లన్నీ నావే అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే గుణ ఎలాగైనా సరే బాలుని తీసుకొచ్చి చిత్తగోట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు తన మనుషులని పక్కా ప్లాన్ ప్రకారం గుడిలోకి పంపిస్తాడు.
ఇక్కడింది ఇప్పుడు పవర్ పోయింది గుడిలో అందరూ కంగారు పడిపోతారు ఆ పవర్ స్విచ్ ఎక్కడుందో చూడండి అని బాలు వెళ్లి పవర్ కి ఏమైందో అని కనుక్కునే పని చేస్తాడు. అయితే మనోజ్ చీకట్లో ఏమీ కనిపించలేదని అక్కడే అన్ని గిఫ్ట్లు తనకే వస్తాయి అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. అయితే ఎలాగైనా సరే నేనే సొంతం చేసుకోవాలి అని సంతోష్ పడిపోతూ ఉంటారు. అప్పుడే గుణాతన మనుషుల్ని లోపలికి పంపిస్తాడు. గుణ మనుషులు లోపలికి వచ్చి మనోజ్ ని బాలు అనుకొని తీసుకొని వచ్చి బయట కుమ్మేస్తూ ఉంటారు. అయితే ఎవర్రా మీరు ఎందుకురా నన్ను కొడుతున్నారని బాలు గట్టిగా కేకలు వేస్తారు. అప్పుడే కరెంటు రావడంతో అందరూ కూడా మనోజ్ నీ వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. అయితే ఏ గుణ మనుషులని గుణాన్ని చితక్కొట్టేస్తారు.
గుణ ని మేన మా ఆయన కారులో బ్రేక్ వైరు కట్ చేసింది నువ్వే కదా అసలు నీకు తాళాలు ఎవరు ఇచ్చారు రా చెప్పురా కొట్టేస్తుంది. అయితే రోహిణి తన పేరు ఎక్కడ బయట పడుతుందని గుణాన్ని కొడుతుంది. మొత్తానికి బాలు జోలికొచ్చిన గుణకి ఆడవాళ్లు రెచ్చిపోయి గట్టిగానే బుద్ధి చెప్తారు ఒక్కొక్క రౌడీని ఆడవాళ్లు మాత్రమే చితగ్గొట్టేస్తారు. ఆడోల్ల దెబ్బకి గుణ పని అయిపోయింది అని సీరియల్ వీక్షిస్తున్న ప్రేక్షకులు అనుకున్నారు. మొత్తానికి ప్రతిరోజు ఏం జరుగుతుందన్న సస్పెన్స్ తో ఈ సీరియల్ ముందుకెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్టులతో సీరియల్ ఉండబోతుందో చూడాలి..
Also Read :మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..