E-Paper
Advertisement

ఇస్రో మరో సంచలనం.. విజయవంతంగా నింగిలోకి GSLV ఎఫ్18.. ఎన్‌వీఎస్ 03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్!

ఇస్రో మరో సంచలనం.. విజయవంతంగా నింగిలోకి GSLV ఎఫ్18.. ఎన్‌వీఎస్ 03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్!
Advertisement

ISRO NVS-03 Launch: స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం రాత్రి మరో ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న షార్ కేంద్రం నుంచి రాత్రి 11.51 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్ 18 రాకెట్, 2,232 కేజీల బరువున్న అత్యాధునిక నావిగేషన్ శాటిలైట్ ఎన్‌వీఎస్ 03 ని నింగిలోకి మోసుకెళ్లింది. ప్రాథమికంగా ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి (జీటీఓ) ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. అక్కడ నుంచి మెల్లమెల్లగా కక్ష్యను పెంచే విన్యాసాల ద్వారా తూర్పున 32.5 డిగ్రీల వద్ద ఉన్న అంతిమ (స్థిరంగా ఉండిపోయేది) జియోసింక్రోనస్ స్లాట్‌లోకి దీనిని చేరుస్తారు.

ఈ ప్రయోగంతో ఇస్రో జీఎస్ఎల్వీ ప్రోగ్రామ్.. విజయవంతంగా తన 20వ ప్రయోగాన్ని పూర్తి చేసుకున్నది. ఆరంభంలో ఎదురైన వరుస వైఫల్యాల కారణంగా ‘నాటీ బాయ్’గా పిలుచుకున్న ఈ రాకెట్.. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్‌వీఎస్ 03 ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఎన్‌వీఎస్ 03 నావిక్ వ్యవస్థను బలోపేతం చేసే రెండో తరం నావిగేషన్ సిరీస్‌లో ఇది మూడవ ఉపగ్రహం. నావిగేషన్ సేవల్లో అంతరాయం లేకుండా చూడడమే దీని ప్రధాన లక్ష్యంగా ఉన్నది.

Advertisement

Also Read: Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న వల్లి.. చందు ప్రియురాలు ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్.

Advertisement

కచ్చితమైన సమాచారం, సమయ గణన కోసం స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన అటామిక్ క్లాక్‌తో పాటు విదేశాల నుంచి సేకరించిన అటామిక్ క్లాక్‌లను కూడా ఇందులో అమర్చారు. ప్రస్తుతం ఉన్న ఎల్ 5, ఎల్ బ్యాండ్ సిగ్నళ్లతో పాటు సరికొత్త ఎల్ 1 సిగ్నల్‌ను కూడా ఇది ప్రసారం చేస్తుంది. భారతదేశంతో పాటు దేశ సరిహద్దుల నుంచి దాదాపు 1,500 కిలోమీటర్ల మేర విస్తృతమైన నావిగేషన్ పరిధిని ఈ శాటిలైట్ అందిస్తుంది. తద్వారా నావిక్ వ్యవస్థ పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్ సేవలను మెరుగుపరుస్తుంది. పౌర అవసరాలతో పాటు ‘ఆపరేషన్ సిందూర్’ వంటి కీలక మిలిటరీ వ్యూహాత్మక, రక్షణ రంగ అవసరాలకు ఈ స్వదేశీ సిగ్నల్ వ్యవస్థ ఎంతో కీలకంగా నిలవనున్నది.

Also Read: ‘గెలిచే దమ్ములేక.. ఈసీపై నిందలా?’.. రాహుల్, అఖిలేష్‌లకు అమిత్ షా ఓపెన్ ఛాలెంజ్!

Tags

Related News

GPS కు ఇక బైబై? నింగిలోకి ఇస్రో నావిక్ NVS-03.. అసలు దీని ప్రత్యేకత ఏంటి?

తుఫాన్‌లు ఎక్కువగా బంగాళాఖాతంలోనే ఎందుకు పుడతాయి? అరేబియా సముద్రంలో ఎందుకు తక్కువ?

యాపిల్ నుంచి మరో సంచలనం.. కేవలం 5.2 మిమీ మందంతో వస్తున్న iPhone Air 2!

ఆర్గానిక్ అంత్యక్రియలు.. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఏం చేస్తారంటే..

ఫిలిప్స్ పార్టీ స్పీకర్ లాంచ్..ఇక నుంచి ఇంట్లోనే డీజే మజా!

అలర్జీలు,దుమ్ముకు చెక్ పెట్టే..హానివెల్ ఎయిర్ ప్యూరిఫైయర్

రాళ్లలో ఇయర్‌బడ్ మిస్.. AI చేసిన మ్యాజిక్ చూస్తే అవాక్కే.. ఇది కదా చాట్‌జీపీటీ పవర్ అంటే!

Big Stories

Advertisement
×