E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode October 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ – అయోమయంలో అపర్ణ  

Brahmamudi Serial Today Episode October 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ – అయోమయంలో అపర్ణ  
Advertisement

Brahmamudi serial today Episode: నందు, చలపతి ఇంటికి వెళ్లి రాజుకు నిజం చెప్తుంది. రేఖ బలవంతంగా ఇందుకు పెళ్లి చేస్తుందని ఇంట్లో ఎవ్వరూ రేఖకు ఎదురుచెప్పడం లేదని ఇప్పుడు కూడా నీకు నిజం చెప్పి నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి రాలేదని.. నీ మనసుకు ఏది ఇష్టమైత అదే చేయ్‌ జస్ట్‌ నీకు నిజం చెప్పడానికి వచ్చాను నేను అంటూ నందు వెళ్లిపోతుంది. నందు దగ్గరకు వెళ్లిన చలపతి.. నువ్వు వెంకీకి చాలా మంచి ఫ్రెండ్‌వు.. వెంకీ కోసం నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావొచ్చు.. నిన్ను ఇంట్లోకి రావొద్దన్న నేనే రావొచ్చని చెప్తున్నాను. కానీ రాజు, ఇందుల విషయంలో మాత్రం ఇంకోసారి రావొద్దని చెప్తాడు. ఆ ఇంటి మీద ఆ ఇంటి మనుషుల మీద నాకు మంచి అభిప్రాయం లేదు అంటాడు. నందు బాధగా కానీ అక్కడ అక్క బాధపడుతుంది అంటే.. నీకు మీ అక్క ఎంత ముఖ్యమో నాకు నా కొడుకు అంతే ముఖ్యం.. దయచేసి ఇలాంటి పోస్ట్‌మాన్‌య పనులు చేయకమ్మా అంటూ పంపిచేస్తాడు.

దుగ్గిరాల ఇంటికి రేఖ చెప్పిన పెళ్లి వాళ్లు వస్తారు. పెళ్లి కొడుకును చూసిన రేఖ వీడు కచ్చితంగా తింగరోడిలా ఉన్నాడు. వీడే ఇందుకు కరెక్ట్‌ అనుకుంటుంది. ఇంట్లోకి వెళ్లాక ఆ పెళ్లికొడుకు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటాడు. అపర్ణ, నందు ప్రశ్నిస్తుంటే.. తింగరి సమాధానాలు చెప్తుంటాడు. అప్పుడే రేఖ, అపర్ణను పిలిచి ఇందును తీసుకురమ్మంటుంది. అపర్ణ వెళ్లి ఇందును తీసుకొస్తుంది. ఇందును చూసి పెళ్లి కొడుకు వంకరలు తిరిగిపోతుంటాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటాడు. వాడి మాటలు విని వీడి ఓవరాక్షన్‌ చూస్తుంటే ఈ పెళ్లి జరిగేలా లేదు అని శేషు మనసులో అనుకుంటాడు.

Advertisement

నందు కోపంగా అక్కా ఇలాంటి వాడిని చేసుకోవడం ఏంటక్కా చీ అంటూ తిడుతుంది. ఏమాటకు ఆ మాట అబ్బాయి సూపర్‌ అదిరిపోయాడు అంటూ భ్రమరాంబ చెబితే.. ఇందుకు నచ్చాలి కదా అంటూ శేషు చెబితే.. దాని ఇష్టం ఎవరికి కావాలి అంటుంది. అప్పుడే పంతులు ఆరు నెలల్లో మంచి ముహూర్తం ఉందని చెబితే.. అంత దూరమా..? ఒక్క గంటో.. రెండు గంటల్లో ముహూర్తం పెట్టండి అంటుంది భ్రమరాంబ. పంతులు రేపే మంచి ముహూర్తం ఉందని పంతులు చెబితే.. అపర్ణ ఇంత త్వరగా పెళ్లేంటి..? అంటూ కోప్పడుతుంది. నందు తనకు నచ్చలేదు ఈ పెళ్లి ఆపండి అంటే రేఖ ఇద్దరికీ వార్నింగ్‌ ఇస్తుంది. రేపు ఉదయం పది గంటలకు మంచి ముహూర్తం ఉంది అదే ఫిక్స్‌ చేయండి అని చెప్తుంది రేఖ. పెళ్లి వాళ్లు, పంతులు వెళ్లిపోతారు. రేఖ, ఇందును పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడని అడిగితే.. బాగున్నాడని వెళ్లిపోతుంది.

లక్ష్మీ దగ్గరకు వెళ్లిన వెంకీ మీకోసం నేను నందును వదులుకున్నాను.. ఇప్పుడు అన్నయ్య కూడా మీకోసం త్యాగం చేయాలా..? కనీసం అన్నయ్యను అయినా తను కోరుకున్న బతుకు బతికేలా చేయండి అమ్మా.. నాన్నకు ఆ విషయం అర్థం కావడం లేదు. కానీ అన్నయ్య బాధేంటో నాకు అర్థం అవుతుంది అమ్మా.. అంటూ చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు ఇందు ఆఫీసుకు వెళ్తుంటే.. భ్రమరాంబ, రేఖ వచ్చి ఆపేస్తారు. రేపు పెళ్లి పెట్టుకుని ఆఫీసుకు వెళ్లడం ఏంటి..? అని నిలదీస్తారు. ఆఫీసుకు అని అటు నుంచి అటే రాజు దగ్గరకు వెళ్లిపోతుందేమో రేఖ అంటూ భ్రమరాంబ అంటే.. తాను ఎక్కడికి వెళ్లినా తప్పకుండా ఇంటికి వస్తుంది. ఎందుకంటే వాళ్ల తాత నాన్నమ్మ ఇక్కడే ఉన్నారు కదా అంటూ నువ్వు వెళ్లు ఇందు అంటూ పంపిస్తుంది రేఖ.

Advertisement

ఆఫీసుకు వెళ్లిన ఇందు గురించి స్టాప్‌ ఏదేదో మాట్లాడుకుంటుంటారు. అంతా విన్న ఇందు కోపంగా అందరినీ తిట్టి ఇంకొక్కసారి ఎవరైనా మాట్లాడుకుంటే జాబ్‌లోంచి తీసేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ప్రశాంత్‌ మాత్రం ఇందును ఓదారుస్తూ.. రాజు ఆఫీసుకు వచ్చే ప్లాన్‌ చెప్తాడు. ఇందు ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 31st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తండ్రి మాటలకు బోరున ఏడ్చిన జ్యోత్స్న   

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కక్కుర్తి.. గుణ ఎంట్రీతో సీన్ రివర్స్.. శివంగిలా మారిన లేడీస్..

కాబోయే భర్తను ఆడుకున్న మీనా.. ఎంత బాగుందో కదా..

Podarillu Serial : నారాయణ రియల్ లైఫ్.. క్యూట్ ఫ్యామిలీ..

Saturday TV Movies : మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

సోషల్ మీడియాలో వేధింపులు.. ధనుంజయ్‌పై కేసు పెట్టిన రియాలిటీ షో నటి శ్రీదేవి

గాజులు గలగల పాటకు లక్షల వ్యూస్.. కానీ నాకు వచ్చింది మాత్రం …!

Big Stories

Advertisement
×