E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న వల్లి.. చందు ప్రియురాలు ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్.

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న వల్లి.. చందు ప్రియురాలు ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్.
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 31st : భద్రావతి రామరాజు పరువు తీయాలి ఎలాగైనా సరే అని ప్లాన్ చేస్తుంది. అయితే రామరాజు పరువు ని ఎలాగైనా సరే ఆ గుడిలోనే తీసేయాలి బతుకమ్మ అని సంబరాలు జరుపుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఆ సంబరాలు జరగకుండా ఆడి పరువు పోయేలా నేను చేస్తాను అని అంటుంది. ఆ భాగ్యం ని రెచ్చగొట్టి విడాకులు మేటర్ అక్కడే నేను తేలుస్తాను అని భద్ర అనుకుంటుంది. అయితే మొత్తానికి చందు ని అలాగే రామరాజుని అందరి ముందు అవమానించాలని భద్ర చేసే ప్లాను ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే అది సస్పెన్స్ గానే ఉంటుంది.

వల్లికి ఘోర అవమానం..

బతుకమ్మని గుడిలో పెట్టాలి అని వల్లి ఆఖరికి వెళ్తుంది ఇంకా తన కుటుంబం రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు ఎలాగైనా సరే నా కుటుంబంతో నేను కలవాలి అని అనుకుంటుంది. అయితే తన బతుకమ్మను తెచ్చి ఇంకా మా వాళ్ళు రాలేదు ఒకవేళ ఉంటే నేను ఎప్పుడో వాళ్ళతో పాటే ఉండేదాన్ని. నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. అయితే అప్పుడే రామరాజు కుటుంబం అక్కడికి వస్తుంది అది చూసిన వల్లి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక బతుకమ్మని తీసుకుని వస్తుండగా అప్పుడు వల్లి వల్ల దగ్గర పెట్టబోతుంటే ఎన్ని సార్లు చెప్పినా సిగ్గు అనేది లేదు అంటూ వల్లిని వేదవతి ఘోరంగా అవమానిస్తుంది. ఇది గుడి అత్తయ్య ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అని నర్మదా అనగానే మళ్లీ మీ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేదవతి.

వల్లిని క్షమించని చందు..

Advertisement

బతుకమ్మ పండుగ రోజు వల్లి ఎలాగైనా సరే తన కుటుంబంతో కలిసిపోవాలని అనుకుంటుంది. అయితే వల్లి చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా వృధా ప్రయత్నాలు అవుతాయి. తాను తన కుటుంబంలో కలవకపోయినా తన కుటుంబం బతుకమ్మలతో తన బతుకమ్మ అని పెట్టాలి అని అనుకుంటుంది. అయితే వల్లి బతుకమ్మని పెట్టగానే వేదవది ఆ బతుకమ్మని చూసి కొంతమందికి సిగ్గు అనేది లేదు మళ్లీ ఎందుకు తగులుకుంటున్నారో అర్థం కావడం లేదు అంటూ ఇన్ డైరెక్ట్ గా వల్లికి స్ట్రాంగ్ గా కౌంటర్లు వేస్తూ తిడుతూ ఉంటుంది. వల్లి బాధపడుతూ ఉండగా చూసిన నర్మదా గుడిలో అందరూ మనల్ని చూస్తున్నారు అత్తయ్య ఆపండి ఇది కూడా అన్న సంగతి మీరు మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోను అని అంటుంది. మొత్తానికి వల్లికి గోర అవమానమే జరుగుతుంది.

అంజలి మళ్లీ వచ్చింది..

చందు మాజీ ప్రియురాలైన అంజలి పెళ్లి చేసుకుని వెళ్లిపోయి ఉంటుంది. అయితే మంచి కుటుంబంలోని అమ్మాయి అయ్యుండి తనకు కాబోయే భర్త గురించి ఏమీ తెలుసుకోకుండా తండ్రి చెప్పినట్టు తలవంచుకొని తాళి కట్టించుకుంటుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి తాగొచ్చు తనని ఇబ్బంది పెట్టి శారీరకంగా మానసికంగా బాధపడుతూ ఉండగా అమ్మాయి అతని వదిలేసి వచ్చింది అని ఊర్లోని వాళ్ళందరూ నానా మాటలు అనుకుంటూ ఉంటారు. అయితే ఆమె ఏమి బాధపడకుండా నా జీవితం ఇలా మారిపోయింది అని ఏడుస్తూ తనలో తానే బాధపడిపోతూ ఉంటుంది నా జీవితాన్ని నేనే నా చేతులారా నాశనం చేసుకున్నాను ఇప్పుడు కొత్తగా ఇంకేం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

చందు చూస్తాడా..?

Advertisement

అయితే ధీరజ్ అలాగే తిరుపతి ఇద్దరు కూడా ప్రసాదం తీసుకుని తింటూ ఉంటారు. అప్పుడే అక్కడ అంజలి కనిపించడంతో ఆమె దగ్గరికి వెళ్తాడు. అయితే ధీరజ్ని చూసిన అంజలి అటు వెళ్లిపోతూ ఉంటుంది. కానీ ధీరజ్ మాత్రం మీరు అంజలి కదా అని అడుగుతాడు. అయితే అది చూసిన సాగర్ కూడా ఇప్పుడు అంజలి గురించి మనం చెప్తే వాడు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అని అనుకుంటాడు. ఆమె తను వదిలేసి వెళ్ళిపోయింది అని చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు మళ్లీ ఆమె తన లైఫ్ లోకి వస్తుందేమో అని ఆశపడడు ఇప్పుడు వాడికి చెప్తే చాలా బాధపడతాడు అని ధీరజ్ అంజలి గురించి చెప్పకుండా ఉంటాడు. ఇక బతుకమ్మ దగ్గర రామరాజు కుటుంబం బతుకమ్మ ఆడేందుకు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే భద్రత తన మనుషులతో వచ్చి అక్కడ రచ్చ చేసి పరువు తీస్తుందా? లేదా భాగ్యం తన కూతురు జీవితం నాశనం అవుతుంది అని ఊరందరి ముందు రామరాజు పరువును తీస్తుందా అన్నది సస్పెన్స్కు గా మారింది. ఇక తర్వాత ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో చందు అంజలిని చూస్తాడా లేదా అన్నది చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కక్కుర్తి.. గుణ ఎంట్రీతో సీన్ రివర్స్.. శివంగిలా మారిన లేడీస్..

Related News

Podarillu Today Episode : కన్నాకు కేశవ గిఫ్ట్.. అడ్డంగా దొరికిన మాధవ్.. పాపం నారాయణ..

Karthika Deepam 2 Serial Today Episode October 31st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తండ్రి మాటలకు బోరున ఏడ్చిన జ్యోత్స్న   

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కక్కుర్తి.. గుణ ఎంట్రీతో సీన్ రివర్స్.. శివంగిలా మారిన లేడీస్..

Brahmamudi Serial Today Episode October 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ – అయోమయంలో అపర్ణ  

కాబోయే భర్తను ఆడుకున్న మీనా.. ఎంత బాగుందో కదా..

Podarillu Serial : నారాయణ రియల్ లైఫ్.. క్యూట్ ఫ్యామిలీ..

Saturday TV Movies : మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

Big Stories

Advertisement
×