Karthika Deepam 2 serial today Episode: అలిసిపోయి రూంలో పడుకున్న సుమిత్ర దగ్గరకు వెళ్లిన దశరథ సుమిత్ర కాళ్లు నొక్కుతూ సుమిత్ర నీకు రెండు విషయాలు చెప్పాలి అంటాడు. ఏంటండి అని సుమిత్ర అడిగితే.. ఒకటి మన గురించి.. రెండొది నీ గురించి ముందు ఏది చెప్పమంటావు అని దశరథ అడిగితే.. నా గురించి చెప్పండి అంటుంది సుమిత్ర. అందుకు దశరథ అయితే మనకు పూర్వ వైభవం మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగని నువ్వు ఇలా కష్టపడటం ఈ పేదరికంలో మగ్గడం నాకు నచ్చడం లేదు అని చెబితే.. అయితే ఏం చేయమంటారు అని సుమిత్ర అడిగితే.. వెళ్లిపోవచ్చు కదా అంటాడు దశరథ. ఎక్కడికి వెళ్లిపోవాలని సుమిత్ర అడిగితే.. మీ పుట్టింటికి అని దశరథ చెప్పగానే.. బయటి నుంచి వింటున్న జ్యోత్స్న, దీప షాక్ అవుతారు.
సుమిత్ర ఉలిక్కిపడి లేస్తుంది. కోపంగా చూస్తుంది. దశరథ మాత్రం కూల్‌గా నీ తండ్రే స్వయంగా రమ్మని ఆహ్వానించాడు. నువ్వు జ్యోత్స్న వెళ్లిపోవచ్చు కదా అని దశరథ చెబితే సుమిత్ర మౌనంగా ఉంటుంది. దశరథ చెప్పు సుమిత్ర అంటూ అడిగితే ఎప్పుడు వెళ్లిపోమ్మంటారు అని సుమిత్ర అడుగుతుంది. అందుకు దశరథ షాక్ అవుతాడు. సుమిత్ర అంటాడు. సుమిత్ర కూడా అవునండి మీరు బాగానే ఆలోచించారు. ఎప్పుడు వెళ్లమంటారు అని అడిగితే.. ఈ మాట నిజమైతే ఉదయాన్నే నిన్ను జ్యోత్స్నను తీసుకెళ్లి నీ తండ్రికి అప్పగించి వస్తాను అని దశరథ చెబితే.. జ్యోత్స్న ఒప్పుకుంటుంది అంటారా..? అని సుమిత్ర అడిగితే.. చాటు నుంచి అంతా వింటున్న జ్యోత్స్న ఏడుస్తుంటుంది. దశరథ తాను ఒప్పిస్తానని చెప్తాడు. అందుకు సుమిత్ర సరేనండి కానీ ఒక్కమాట అడుగుతాను అంటుంది.
ఒక్కటేమిటి వంద అడుగు అంటాడు దశరథ. సుమిత్ర ఏడుస్తూ.. ఇలా వెళ్లిపోవాల్సిన అవసరం మీకు వస్తే మీరు వెళ్లిపోతారా..? మాకోసం ఆగిపోతారా..? అని సుమిత్ర అడిగితే.. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్లిపోతాను సుమిత్ర అంటాడు దశరథ. దీంతో సుమిత్ర ఏడుస్తూ.. మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్లిపోతానండి. బంగారు ఊయలలో ఊగే ఒక బంగారు యువరాణి ఒక రాజును పెళ్లాడింది. ఆ రాజు తన తండ్రి కోసం అడవికి వెళ్లాల్సి వచ్చింది. భార్య తనతో వస్తానండి వద్దు అన్నాడు. కానీ వినలేదు. తనతోటే వెళ్లింది. ఆడదానికి నిజమైన సౌభాగ్యం రత్నాల పొదుగుల్లో ఉండదండి భర్త నీడలోనే ఉంటుంది. మీరు ఎక్కడుంటే.. నేను అక్కడే.. మనసిచ్చి వచ్చాను.. మట్టిలో కలిసిపోయే వరకు నేను మీతోనే ఉంటాను.. నా తండ్రి భయానికి లొంగనిదాన్ని.. ఆశకు ఎలా లొంగుతాను అనుకున్నారు.. అంటూ ఏడుస్తుంటే..
నువ్వు ఇలా ఉండటం నేను చూడలేకపోతున్నాను అంటాడు దశరథ.. నాకేం నేను సంతోషంగానే ఉన్నాను.. ఆ రెండో విషయం ఏంటో చెప్పండి అని సుమిత్ర అడిగితే.. జ్యోత్స్న పెళ్లి అంటూ దశరథ చెప్తాడు. ఇప్పుడు పెళ్లి అంటే అంటూ సుమిత్ర డౌటుగా అడిగితే.. అది ఒప్పుకోదు కానీ మనమే ఒప్పించాలి అంటాడు దశరథ. కొద్ది రోజులు వదిలేయాలి అని సుమిత్ర చెబితే.. అది మనకోసం కష్టపడుతుంది. మనకోసం మాటలు పడుతుంది. పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే.. ఇన్ని బాధలు ఉండవు కదా అంటాడు. నా మనసుకు ఇదే అనిపిస్తుంది. చాలా గారాబంగా పెరిగిన ఒకేఒక్క ఆడపిల్ల. నచ్చని మనుషుల దగ్గర పని చేస్తుంటే.. చూసి తట్టుకోలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ అవుతుంది. అంతా వింటున్న జ్యోత్స్న ఏడుస్తుంది. దీప ఏడుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.