Bigg Boss 9 Telugu: ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇటీవలే ప్రారంభమైంది. 15 మంది సెలబ్రిటీలు సామాన్లతో షో నీ గ్రాండ్ గా ప్రారంభించారు. సామాన్యులకు ఎక్కువ పవర్స్ ఇచ్చారు. వాళ్లకు అసిస్టెంట్స్ గా సెలబ్రిటీల టీమ్ ఉండాలని చెప్పారు. అదే విధంగా రెండో రోజు గొడవలతో రచ్చ మొదలు పెట్టేశాడు బిగ్ బాస్.. బిగ్ బాస్ ఆటలో తొలివారం నామినేషన్స్ ప్రక్రియ షురూ అయ్యింది. సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీల మధ్య రణరంగం తొలివారం నామినేషన్స్ ప్రక్రియకంటే ముందే మొదలైపోయింది. నామినేషన్స్ ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్. అయితే మొదటి వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అన్నది ఆసక్తిగా మారింది.
మొదటి నుంచి అసలు ఆట మజా మొదలయ్యేది ఎప్పుడంటే నామినేషన్స్ ప్రక్రియలో.. నామినేషన్స్ లో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం మొదలుపెట్టి నామినేట్ చేసుకుంటారు. పెద్దగా తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు లాంటివి ఉండవు. కానీ ఈ సీజన్‌లో సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ మధ్య తొలిరోజు రణరంగం మొదలైపోయింది. మాస్క్ మెన్ హరీష్ వర్సెస్ ఇమ్మానుయేల్‌ల మధ్య గట్టిగానే గొడవ అయ్యింది.. రీతు తనకిచ్చిన పనిని తాను నెరవేర్చే పనిలో ఉంది. అప్పుడే లవ్ ట్రాక్ మొదలైనట్టు తెలుస్తుంది. అందరికి నామినేషన్స్ లేవు అని బిగ్ బాస్ వెల్లడిందించింది..సామాన్యులకు మరో బంపరాఫర్ ఇచ్చారు బిగ్ బాస్. ఈవారం సెలబ్రిటీలను నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. సామాన్యులంతా కలిసి ఎవర్ని నామినేట్ చేయాలనుకుంటున్నారో అన్నది ఆసక్తిగా మారింది.
Also Read: బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి స్పెషల్..
గత సీజన్పోలిస్తే ఈ సీజన్ టాస్కులు ఆటలు అంటూ ఏమీ హడావిడి కనిపించడం లేదు. దాంతో ఎలిమినేషన్ పై అంతా బజ్ రాలేదు. సామాన్యులకు సెలబ్రిటీలను ఎలిమినేట్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్తాడు. అందరూ కలిసి ఏకాభిప్రాయంతో సంజనా గల్రానీ పేరుని చెప్పారు. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల.. మాలో మాకు గొడవలు వస్తున్నాయి. మిస్ అండర్ స్టాండింగ్ అవుతుంది అని తన వాదన వినిపించాడు మనీష్. మీరు అబద్దాలు ఆడుతున్నారు.. బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అని అన్నాడు. అతని వాదనని డిఫెండ్ చేసుకున్న సంజనా.. ప్రియా, సంజనా మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది. ఇకపోతేసంజనా వర్సెస్ ఆశాషైనీల మధ్య మాటల యుద్ధం పెరిగి పర్సనల్ ఎటాక్ వరకూ వెళ్లింది. నా పర్సనల్ రిలేషన్ షిప్ గురించి ఒక్కసారి కాదు.. మూడుసార్లు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటూ సంజనాని నిలదీసింది. ఈ గొడవ కాస్త గొడవగా మారింది. మొత్తానికి చూసుకుంటే ఈ వారం సంజనని సర్దుకుని పోయేలా కనిపిస్తుంది. మరి ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్లిపోతారో.. ఏది ఏమైన ఈ షో పై అప్పుడే జనాల్లో విసుగు వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆటలో మజా లేదని తెలుస్తుంది. మరి ఎలిమినేషన్ తర్వాత మారుతుందేమో చూడాలి..