Delhi Encounter: ఢిల్లీలోని రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రోహిణి ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లను కాల్చి చంపారు పోలీసులు. ఈ ముఠా కదలికల గురించాయి నిఘా వర్గాలు. వారి నుంచి సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్-బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.
ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్
బుధవారం రాత్రి బహదూర్‌షా మార్గ్ సమీపంలోని డాక్టర్ అంబేద్కర్ చౌక్-పన్సాలి చౌక్ మధ్య తెల్లవారుజామున 2.20 గంటలకు కాల్పులు చోటు చేసుకున్నాయి. హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్లు రంజన్ పాఠక్, బిమ్లేష్ సాహ్ని, మనీష్ పాఠక్ , అమన్ ఠాకూర్‌గా గుర్తించారు.
రంజన్ పాఠక్ ఆధ్వర్యంలో ఈ గ్యాంగ్.. బీహార్ అంతటా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలోని అమన్ ఠాకూర్ తప్ప మిగిలినవారు బీహార్ లోని సీతామర్హి జిల్లా నివాసితులు. రాబోయే బీహార్ ఎన్నికలకు ముందు ఈ గ్యాంగ్ భారీ కుట్రకు ప్రణాళిక వేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
ఆ గ్యాంగ్‌స్టర్లు ఎవరు?
ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ముఠా సభ్యులను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. తప్పించుకునే ప్రయత్నంలో క్రిమినల్స్.. పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. నలుగురు నిందితులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. బీహార్‌లో ‘సిగ్మా గ్యాంగ్’ పేరు చెబితేచాలు పోలీసులు, రాజకీయ నేతలు వణికిపోతుంటారు. ఆ ముఠాకు రంజన్ పాఠక్ అధినేత. ఆ గ్యాంగ్ బీహార్ అంతటా దోపిడీలు, కాంట్రాక్ట్ హత్యలు చేయడంలో కీలకపాత్ర పోషించేది. దాని ద్వారా బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకుంది.
ALSO READ: రూటు మార్చిన గంజాయి స్మగ్లర్లు.. పోలీసులపై దాడి
బీహార్‌లోని సీతామర్హి, పరిసర జిల్లాల్లో జరిగిన ఐదు హై-ప్రొఫైల్ హత్యలు సహా ఎనిమిది క్రిమినల్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. పాఠక్‌పై రూ.25,000 రివార్డు ఉంది. సిగ్మా గ్యాంగ్ దాదాపు ఏడు సంవత్సరాలుగా యాక్టివ్‌గా పని చేస్తోంది. బీహార్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వివిధ రాష్ట్రాల్లో సమావేశమైనట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా ఆ గ్యాంగ్ కు చెందిన నలుగురు సభ్యులు సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌కు ముందు చాలా రోజులుగా వారి కదలికలను నిఘా వర్గాలు ట్రాక్ చేయడం మొదలుపెట్టాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను మట్టుపెట్టడం ద్వారా బీహార్ ఎన్నికల కుట్రను భగ్నం చేశారు పోలీసులు.
VIDEO | Delhi: At least four gangsters, including wanted Ranjan Pathak, have reportedly been shot dead in an encounter conducted by a joint team of Delhi Police Crime Branch and Bihar Police. Visuals from the encounter site in Rohini area. #DelhiNews #DelhiPolice
(Full video… pic.twitter.com/hRtSqJXqh1
— Press Trust of India (@PTI_News) October 23, 2025