Bill Gates Acting : పలు టీవీ సీరియల్స్ ద్వారా ఎంతోమందికి దగ్గరైనా స్మృతి ఇరానీ అంటే తెలియని వారు ఉండరు.ఈమె కేవలం హిందీ సీరియల్స్ లోనే కాదు తెలుగులో తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ సినిమాలో జయమ్మ అనే ఓ కీలక పాత్రలో కూడా నటించింది.. అంతేకాదు బీజేపీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అలా సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్ గా రాణించింది. అయితే అలాంటి స్మృతి ఇరానీ దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ తన హిట్ సీరియల్ అయినటువంటి ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ అనే సీరియల్ కి సీక్వెల్ గా వస్తున్న ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ -2’ లో నటిస్తోంది. అలా 25 ఏళ్ల తర్వాత మళ్లీ టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అలాంటి స్మృతి ఇరానీ లీడ్ రోల్ చేస్తున్న ఈ సీరియల్ లోకి తాజాగా బిల్ గేట్స్ అతిథి పాత్రలో మెరవబోతున్నట్టు ఓ ఆంగ్ల మీడియా తెలియజేసింది.
విషయంలోకి వెళ్తే.. కేంద్ర మాజీ మంత్రి, నటి అయినటువంటి స్మృతి ఇరానీ లీడ్ రోల్ పోషిస్తున్న హిందీ సీరియల్ లో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు అయినటువంటి బిల్ గేట్స్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్టు గత రెండు మూడు రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు నిజమే అన్నట్లుగా ఓ ఆంగ్ల మీడియా బిల్ గేట్స్ స్మృతి ఇరానీ సీరియల్లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని చెప్పుకొచ్చారు.. ఇక స్మృతి ఇరానీ తో బిల్ గేట్స్ డైరెక్ట్ గా సెట్లో యాక్టింగ్ చేయకుండా.. బిల్ గేట్స్ వీడియో కాల్ ద్వారా స్మృతి ఇరానీతో మాట్లాడతారట.
ALSO READ:Thamma Collections: గోల్డెన్ లెగ్ గా రష్మిక.. థామా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
అలా క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ -2 లో బిల్ గేట్స్ వీడియో కాల్ రూపంలో ఈ సీరియల్ లో గెస్ట్ రోల్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో తులసి పాత్రలో నటించిన స్మృతి ఇరానీ బిల్ గేట్స్ తో నవజాత శిశువుల ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం గురించి, పలు అపోహల గురించి ఆ వీడియో కాల్ లో బిల్ గేట్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. అలా బిల్ గేట్స్ స్మృతి ఇరానీ మధ్య సంభాషణ దాదాపు మూడు ఎపిసోడ్లలో ఉంటుంది అని ఆంగ్ల మీడియా తెలియజేసింది. బిల్ గేట్స్ తో సంభాషించే ఆ ఎపిసోడ్లో ప్రజలకు ఎన్నో సందేహాలపై అవగాహన కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి విషయాల్లో సామాజిక అవగాహన ప్రోత్సహించాలంటే దానికి స్మృతి ఇరానీనే కరెక్టు అన్నట్లుగా ఆ ఆంగ్ల పత్రిక రాస్కొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ప్రపంచ సంపన్నుడిని మనం సీరియల్ లో చూడబోతున్నాం అంటూ మాట్లాడుకుంటున్నారు.
ఇక స్మృతి ఇరానీ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సీరియల్ లో ఇప్పటికే కిరణ్ కర్మాకర్, సాక్షి తన్వర్, ఏక్తా కపూర్ లు అతిథి పాత్రలో మెరిశారు. తాజాగా ఓ ఎపిసోడ్ లో బిల్ గేట్స్ కూడా కనిపించబోతున్నారు అనే సమాచారం వినిపిస్తోంది. ఇప్పటికే బిల్ గేట్స్, స్మృతి ఇరానీలకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని,బిల్ గేట్స్ ఈ సీరియల్ కి సంబంధించిన మూడు ఎపిసోడ్లలో కనిపించబోతున్నారు అని తెలుస్తోంది. ఇక ఈ సీరియల్ లో నటించిన స్మృతి ఇరానీ ఈ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా పలు అవార్డులను కూడా అందుకుంది.అలా 2000 సంవత్సరం నుండి 2008 వరకు సక్సెస్ఫుల్గా ఈ సీరియల్ ప్రసారమైంది. ఈ సీరియల్లో ఒక మామూలు గృహిణి తులసి అనే పాత్రలో స్మృతి ఇరానీ ఎమోషన్స్ తో అందరిని కట్టిపడేసింది. అలా ఈ సీరియల్ కి ఇప్పుడు సీక్వెల్ రావడం పట్ల చాలామంది అభిమానులు హ్యాపీగా ఉన్నారు.