Hyper Aadi: హైపర్ ఆది (Hyper Aadi)బుల్లితెర కమెడియన్ (Comedian)గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేసిన ఈయన తన అద్భుతమైన కామెడీ పంచ్ డైలాగులతో అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఆది ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి ఈయన దూరంగా ఉన్నప్పటికీ ఇతర బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూనే మరోవైపు సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక హైపర్ ఆది ఏదైనా షోలో ఉన్నారు అంటే ఆయన వేసే పంచులకు మతి పోతుందని చెప్పాలి.
హీరోయిన్లపై ఆది సెటైర్స్..
ఇలా కొన్నిసార్లు హైపర్ ఆది కామెడీగా వేసే డైలాగులు కూడా వివాదాస్పదంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఎన్నోసార్లు హైపర్ ఆది నోటి దూల కారణంగా వివాదాలలో చిక్కుకున్నారు. ఇదిలా ఉండగా హైపర్ ఆది తాజాగా సీనియర్ హీరోయిన్స్ అయిన పూర్ణ(Poorna), ప్రియమణి(Priyamani) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పూర్ణ, ప్రియమణి వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే వీరిద్దరూ కూడా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో(Dhee Dance Show) కార్యక్రమానికి గతంలో జడ్జెస్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
పద్ధతి మారాలి…
ఇక తాజాగా ఢీ20(Dhee 20) సరికొత్త కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి జడ్జిగా హీరోయిన్ రెజీనా(Regina) రావడం విశేషం. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఆది ఎప్పటిలాగే తనదైన శైలిలోనే పంచులు వేస్తూ అందరిని నవ్వించారు. అదేవిధంగా గతంలో ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన ప్రియమణి పూర్ణ గురించి మాట్లాడుతూ… కంటెస్టెంట్లు స్టేజ్ మీద మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే దగ్గరకు పిలిచి మరీ బుగ్గలు కొరికే పూర్ణ గారి నుంచి మనం ఏం నేర్చుకున్నాం? హగ్గులు ఇచ్చే ప్రియమణి నుంచి ఏం నేర్చుకున్నాం సార్.. నేర్చుకున్నాం.. బుగ్గలు కొరకడం, హగ్గులు ఇవ్వడం నేర్చుకున్నాం, మారాలి ఈ పద్ధతి మారాలి అంటూ ఈయన హీరోయిన్లపై సెటైర్లు వేశారు.
ఇలా హైపర్ ఆది వేదికపై ప్రియమణి పూర్ణ గురించి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. హైపర్ ఆది ఇలాంటి మాటలు వల్లే వివాదాలలో నిలుస్తున్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం ఈయన కామెడీ డైలాగ్స్ అదిరిపోయాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇటీవల ప్రారంభమైన ఢీ 20 కార్యక్రమానికి రెజీనా మొదటిసారి జడ్జిగా రావడం విశేషం. రెజినాతో పాటు విజయ్ బిన్నీ(Vijay Binny) మాస్టర్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం ప్రదీప్ బుధ గురువారాలు రాత్రి 9 :30 లకు ఈటీవీలో ప్రసారం కానుంది.ఇక ఈ కార్యక్రమానికి నటుడు నందు(Nandu) యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Pawan Kalyan: ఇండస్ట్రీలో పవర్ స్టార్‌కు పవర్ తగ్గిందా ? కట్టప్ప కామెంట్స్‌కి కౌంటర్ వేసే వాడే లేడా