BigTV English

Pawan Kalyan: ఇండస్ట్రీలో పవర్ స్టార్‌కు పవర్ తగ్గిందా ? కట్టప్ప కామెంట్స్‌కి కౌంటర్ వేసే వాడే లేడా

Pawan Kalyan: ఇండస్ట్రీలో పవర్ స్టార్‌కు పవర్ తగ్గిందా ? కట్టప్ప కామెంట్స్‌కి కౌంటర్ వేసే వాడే లేడా

Pawan Kalyan: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడుగా ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కానీ తన నటనతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల(Politics)పై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇటీవల పవన్ కళ్యాణ్ తమిళనాడులో జరిగిన “మురుగన్ భక్తుల మానాడు”(Muruga Bakthargal Manadu) కార్యక్రమానికి హాజరయ్యారు.


పవన్ కళ్యాణ్ కు కట్టప్ప వార్నింగ్..

ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై తమిళనాడు నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది ఈ క్రమంలోనే పవన్ చేసిన వ్యాఖ్యలపై నటుడు సత్యరాజ్(Sathya Raj) స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు.”దేవుడు పేరు చెప్పి తమిళనాడులో రాజకీయాలు చేస్తామంటే కుదరదని, పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన మమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. అలా మోసం చేసాము అనుకుంటే అది వారి తెలివి తక్కువ తనం. తమిళ ప్రజలు ఎంతో తెలివైన వారు అంటూ సత్యరాజు పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపించారు.


మౌనంగా ఉన్న టాలీవుడ్ పెద్దలు..

ఇలా పవన్ కళ్యాణ్ గురించి నటుడు సత్యరాజు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎక్కడ స్పందించలేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు గొప్ప నటుడు అనే విషయం తెలిసిందే. ఇలా ఒక నటుడు గురించి మరొక నటుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్ధం. ఇలా పవన్ కళ్యాణ్ పేరును ఉద్దేశించి సత్యరాజ్ కౌంటర్ వేసినప్పటికీ ఇండస్ట్రీలో పెద్దలుగా వ్యవహరిస్తున్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలు గాని దర్శక, నిర్మాతలు ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు షాక్ అవుతున్నారు.

ఇండస్ట్రీలో పవన్ ఏకాకి..?

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సత్యరాజ్ ఇలా మాట్లాడటం సరికాదని ఏ ఒక్క తెలుగు హీరో కూడా కౌంటర్ ఇవ్వలేకపోయారు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ తగ్గిందా? ఇండస్ట్రీ మొత్తం పవన్ ను ఏకాకిని చేశారా? అందుకే టాలీవుడ్ మౌనంగా ఉందా? అనే సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఎంతో మేలు చేశారు. సినిమా టికెట్ల రేట్లు పెంచడం నుంచి మొదలుకొని సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఎంతో దోహదం చేసిన పవన్ కళ్యాణ్ విషయంలో ఇండస్ట్రీ మౌనంగా ఉన్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఇప్పటికైనా ఈ విషయంపై ఎవరైనా స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Karina Kapoor: వాష్ రూమ్ లో ఆ హీరో ఫోటో… ఛీ ఛీ ఇదేం పాడు బుద్ధి కరీనా?

Related News

Coolie Vs Leo: కూలీ టార్గెట్‌ ‘లియో’.. ఫస్ట్‌ డే ఎంత కొట్టాలంటే..

Sandeep Reddy Vanga: స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ అక్కడే.. ప్లేస్ తోనే అంచనాలు పెంచేశారుగా!

Coolie : వార్ 2 ను డామినేట్ చేసిన కూలీ, హిట్ టాక్ వస్తే కానీ గట్టెక్కదు

Ram Gopal Varma: రామ్‌ గోపాల్ వర్మ విచారణ.. సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసిన పోలీసులు

Janhvi Kapoor : మెగాస్టార్ నే పక్కన పెట్టేసారు, బాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేయడంలో తప్పులేదు

Kantara Movie: కాంతార: చాప్టర్‌ 1కి ఆ శాపం.. అవరోధాలున్నాయని దేవుడు చెప్పాడు.. ప్రొడ్యూసర్‌ షాకింగ్‌ కామెంట్స్

Big Stories

×