Rishabh Pant : సాధారణంగా క్రికెట్ లో రకరకాల వార్తలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కొంత మంది ఎన్ని వికెట్లు తీసినా ఆ మ్యాచ్ లో ఆ జట్టు విజయం సాధించదు. మరికొంత మంది ఎన్ని పరుగులు చేసినా ఆ జట్టు మాత్రం గెలువదని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో సచిన్ టెండూల్కర్ సెంచరీ చేస్తే.. మ్యాచ్ గెలవదు అనే నానుడి వినిపించేది. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టే గెలవడం విశేషం. ఇక అదే వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించిన సమయంలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ వార్త ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రిషబ్ పంత్ పై ట్రోలింగ్స్ చేయడం విశేషం.
Also Read : Maohammed Shami : వివాదంలో మొహమ్మద్ షమీ.. పక్షిప్రాణాలతో చెలగాటం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
పంత్ పై ట్రోలింగ్స్..
భారత్ టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ సెంచరీ చేసి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. కానీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ట్రోలింగ్స్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ సెంచరీ చేయడం వల్లనే ఓటమి పాలైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 2018 ఇంగ్లాండ్ పై సెంచరీ చేస్తే ఓడిపోయింది. 2019లో ఆస్ట్రేలియా పై సెంచరీ చేస్తే మ్యాచ్ డ్రా అయింది. సౌతాఫ్రికా పై 2022లో సెంచరీ చేస్తే ఓడిపోయింది. ఇంగ్లాండ్ పై 2022లో సెంచరీ చేయగా.. అప్పుడు కూడా ఓటమి పాలైంది టీమిండియా. తాజాగా 2025లో రెండు సెంచరీలు చేస్తే.. ఇప్పుడు కూడా టీమిండియా ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. అందుకే రిషబ్ పంత్ సెంచరీ చేస్తే ఓటమి పాలవుతుందనే వార్త వినిపిస్తోంది.
Also Read : Yashasvi Jaiswal : 4 క్యాచ్ లు మిస్ చేసిన జైస్వాల్ కు శిక్ష… చెరుకు మిషన్ లో చేతులు పెట్టి మరి !
రిషబ్ పంత్ సరికొత్త రికార్డు..
పంత్ సెంచరీ చేస్తే.. ఓడిపోవడం పక్కా అన్నట్టు లక్నో ఓనర్ సంజీవ్ ట్రోలింగ్స్ చేశాడని వార్తలు వినిపించాయి. కానీ వాస్తవానికి అతను అనలేదట. రిషబ్ పంత్ సెంచరీ చేసినందుకు సంజీవ్ గోయెంకా పంత్ ని అభినందించారని సమాచారం. మరోవైపు టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 800 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ వికెట్ కీపర్ బ్యాటర్ 800 రేటింగ్ పాయింట్లు సాధించలేదు. టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి కూడా అది సాధ్యపడలేదు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ -10లో భారత బ్యాటర్లు ఇద్దరూ ఉన్నారు. యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగగా.. పంత్ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. కేఎల్ రాహుల్ 38వ స్థానం, గిల్ 20 వ స్థానానికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పంత్ సెంచరీ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరగడం విశేషం.