BigTV English

Vande Bharat Trains: 3 వందేభారత్ రైళ్లు డైవర్ట్.. ఏపీ ప్రయాణీకులకు అలర్ట్!

Vande Bharat Trains: 3 వందేభారత్ రైళ్లు డైవర్ట్.. ఏపీ ప్రయాణీకులకు అలర్ట్!

Indian Railways: ఆయా రైల్వే పనుల సందర్భంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తుంటారు. తాజాగా లూప్ లైన్ అప్ గ్రేడ్ పనుల కారణంగా మూడు వందేభారత్ రైళ్లను డైవర్ట్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వచ్చే నెలలో ఈ దారి మళ్లింపు ఉంటుందని వెల్లడించారు. ఇంతకీ ఏ రూట్ లో రైల్వే పనులు చేయనున్నారు? ఏ వందేభారత్ రైళ్లు ఎప్పుడు దారి మళ్లించనున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


27 రోజుల పాటు 3 వందేభారత్ రైళ్ల మళ్లింపు

కర్నాటక నాగసముద్రం యార్డ్‌ లోని లూప్‌ లైన్‌ ను అప్‌ గ్రేడ్ పనులు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఓవర్‌హెడ్ ఎక్విప్‌ మెంట్ పోర్టల్‌ లను మార్చడం కోసం జూలై 2 నుంచి జూలై 28 వరకు పనులు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 27 రోజుల పాటు  3 వందే భారత్ రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) ప్రకటించింది.


⦿ కాచిగూడ- యశ్వంత్ పూర్(20703)

కాచిగూడ- యశ్వంత్‌ పూర్‌ మధ్య రాకపోకలు కొనసాగించే వందేభారత్ ఎక్స్ ప్రెస్ (20703) బుధవారం తప్ప మిగతా అన్ని రోజుల పాటు మళ్లింపు కొనసాగుతుందన్నారు. ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, యశ్వంత్‌పూర్ మీదుగా నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

⦿ కలబురగి- SMVT బెంగళూరు(22231)

కలబురగి-SMVT బెంగళూరు మధ్య రాకపోకలు కొనసాగించే వందే భారత్ ఎక్స్ ప్రెస్(22231) శుక్రవారం మినహా మిగతా అన్ని రోజుల పాటు దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు అనంతపురం, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, యలహంక మీదుగా మళ్లించబడుతుందని వెల్లడించారు.

⦿ SMVT- కలబురిగి(22232)

SMVT బెంగళూరు నుంచి కలబురగి వరకు నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్(22232) గురువారం మినహా మిగతా అన్ని రోజుల పాటు దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు యలహంక, పెనుకొండ, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం ధర్మవరం, అనంతపురం మార్గంలో నడుస్తుంది.

Read Also: రూ.11కే విమాన ప్రయాణం.. విదేశాలకూ ఎగిరిపోవచ్చు!

ప్రయాణీకులకు రైల్వే అధికారుల సూచన

సుమారు 27 రోజుల పాటు 3 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు డైవర్ట్ చేస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులు పూర్తి వివరాలను తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. అందుకు అనుగుణంగా రాకపోకలకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ముందస్తుగా నిర్ణయం తీసుకోవడం మంచిదని అధికారులు సలహా ఇచ్చారు.

Read Also: రైలు టికెట్ ధరలు పెరుగుతాయ్.. కానీ, వీటికి మాత్రం కాదు!

Related News

Hydrogen Train: హైడ్రోజన్ రైలు వస్తోంది.. ఫస్ట్ సర్వీస్ అక్కడే.. వీడియో రిలీజ్ చేసిన రైల్వే మంత్రి!

Tax Relief: మీ పెంపుడు జంతువులను సింహాలకు ఆహారంగా ఇస్తే.. ట్యాక్స్ నుంచి ఉపశమనం!

Escalators at Mountains: ఏకంగా పర్వతాలకే ఎస్కలేటర్లు.. చైనా వాళ్లు మామూలోళ్లు కాదండోయ్!

Tirumala rules: తిరుమలకు వచ్చే వాహనాలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 15 నుండి కొత్త రూల్స్!

Free Wi-Fi: రైల్వే స్టేషన్ లో హ్యాపీగా వైఫై ఎంజాయ్ చెయ్యొచ్చు, సింపుల్ గా ఇలా చేస్తే చాలు!

Air India Flights: అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు బంద్, ప్రయాణీలకు అలర్ట్!

Big Stories

×