Illu Illalu Pillalu Today Episode April 6 th : నిన్నటి ఎపిసోడ్ లో.. పెళ్లి ఆగిపోవద్దని చందు 10 లక్షల కోసం తన ఫ్రెండ్స్ అందరిని అడుగుతుంటాడు. ఇంట్లో వాళ్ళ సంతోషాన్ని దూరం చేయొద్దని ఈ పెళ్లి ఎలాగైనా జరగాలని తనలో తానే మధన పడుతూ ఉంటాడు. డబ్బుల కోసం ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్కరుగా అడుగుతుంటాడు. కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవని సమాధానం రావడంతో ఫీల్ అవుతాడు. ఇక వెనకనుంచి రామరాజు చందు భుజంపై చేయి వేస్తారు. అది చూస్తున్న చందు షాక్ అవుతాడు. రామరాజు కు నిజం చెప్పడు.. నర్మదా కోరికను వేదవతి తీరుస్తుంది. కోడలి ఆనందాన్ని చూసి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. తల్లి కోసం నర్మదా మీ అమ్మ నీకోసం వస్తుందేమో అని వేదవతి వేదాలు వల్లిస్తుంది. మీ అమ్మ వచ్చింది ఒకసారి అటు చూడు అని వేదవతి అనగానే నర్మదా వాళ్ళ అమ్మని చూసి షాక్ అవుతుంది. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు అని అనగానే మీ అత్తయ్య నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఇంట్లో పెళ్లి పెట్టుకున్నామని నీ గురించి గొప్పగా చెప్పింది అని నర్మదతో అంటుంది. నర్మద ఒక్కసారిగా తన తల్లిని చూసి కన్నీళ్లు ఆపుకోలేక కౌగిలించుకొని బాధపడుతుంది. ఇన్ని రోజులు నువ్వు నన్ను లేచిపోయిన పెళ్లి చేసుకున్న అమ్మాయి అని అంటుంటే నాకు ఆ బాధ ఎక్కడ గుచ్చుకునేది కానీ ఈరోజు మాత్రం ఆ బాధ లేకుండా చేశారు అని నర్మదా సంతోషపడుతుంది.
అటు భాగ్యం శ్రీవల్లి, ఆనందం ముగ్గురు పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. పెళ్లి జరుగుతుందా? లేదా? అని ఆలోచిస్తుంటారు. మన ఈ బంగారు జింకకి కూడా.. తండ్రి అంటే బోలెడంత గౌరవం ఉంది. భార్య అంటే ప్రేమ కూడా ఉంటాది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రా? భార్యా అంటే ఖచ్చితంగా భార్య వైపే మొగ్గు చూపుతారు.. కాబట్టి అల్లుడు గారు తెచ్చే డబ్బుల కోసం ఎదురుచూడాలి తప్పితే.. అస్సలు టెన్షన్ పడాల్సిన పనిలేదు అని అంటుంది భాగ్యం.. చెందు కూడా రామరాజు దగ్గర నిజం చెప్పకుండా దాచేస్తాడు. భాగ్యం ప్లాను వర్కౌట్ అయినట్లే కనిపిస్తుంది. కానీ డబ్బులు మాత్రం ఇంకా రాలేదని టెన్షన్ పడుతుంటారు.
తల్లిని చూసి.. నర్మద పరుగు పరుగున వెళ్తుంది. గుండెలకు హత్తుకుని భోరున ఏడుస్తుంది. అమ్మ నువ్వు నా కోసం వచ్చావా? నాకు ఇదంతా కలగా ఉంది.. నీ అంతట నువ్వే నా కోసం వచ్చావా? అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటుంది నర్మద. ఆ మాటతో నర్మద తల్లి మీ అత్తయ్య రమ్మని చెప్పింది అని అంటుంది. పెళ్లికి మీ నాన్న తో కలిసి వస్తానని అంటుంది. ఆ సీన్ చూసి ప్రేమ వాళ్ళమ్మ కూడా ఆలోచిస్తుంది. నేను కూడా నా కూతురు దగ్గరికి ఇలానే వెళ్తే ఎంత బాగుంటుందో అని సంతోషపడుతుంది..
పాతకేళ్లు పెంచిన నా కూతురి మనసుని అర్థం చేసుకోలేకపోయాను. ఇన్నాళ్లూ నేను ఏం కోల్పోయానో నాకు అర్థం అయ్యేట్టు చెప్పారు. నా కూతుర్ని నాకు కొత్తగా పరిచయం చేశారు. ఈ తల్లి మనసు కన్న కూతురు కోసం పరుగుపెట్టుకుని వచ్చేలా చేశారు అని అంటుంది. తన తల్లి మళ్ళీ తన దగ్గరకు రావడానికి అత్తయ్య కారణమని నర్మదా వేదవతి చూసి పొంగిపోతుంది సంతోషం తట్టుకోలేక కౌగిలించుకొని తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది..
నర్మద వాళ్ళమ్మ వెళ్లిపోయిన తర్వాత వేదవతిని చూసి నర్మదా మళ్లీ కౌగిలించుకోవడానికి వస్తుంది. అయితే బుజ్జమ్మ మాత్రం ద ఎన్నిసార్లు కౌగిలించుకుంటావ్ నేను ఏమైనా నీ లవర్ ని మరి పోయి పిండి వంటలు చేయాలి పదాలు లోపలికి అనేసి అంటుంది. మా తన ఇంటి చుట్టూ చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక పిండి వంటల్ని ప్రేమ సర్దుతుంది. అప్పుడు తన దగ్గరికి ఒక లవ్ లెటర్ రాకెట్ వచ్చి పడుతుంది. అందులో ఐ లవ్ యు అని రాసి ఉంటుంది. వెనకాల ఉన్న ధీరజ్ దగ్గరికి దాన్ని తీసుకెళ్లి ఇది నీ పనే కదా ఎందుకురా నువ్వు ఇలా చేసావ్ నీ మనసులో ఎప్పటినుంచో ఇలా దురుద్దేశం ఉంది కదా అనేసి అంటుంది. నీ మొహాన్ని అద్దంలో చూసుకో ఏ రోజైనా నువ్వు ఎలా ఉన్నావో తెలుస్తుంది అనేసి ఇద్దరు ఒకరి మీద ఒకరు అరుచుకుంటారు అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..