BigTV English

BIG TV Kissik Talk Show :సుమ – రాజీవ్ విడాకులు… కొడుకు రోషన్ రియాక్షన్ ఏంటంటే?

BIG TV Kissik Talk Show :సుమ – రాజీవ్ విడాకులు… కొడుకు రోషన్ రియాక్షన్ ఏంటంటే?

BIG TV Kissik Talk Show :రాజీవ్ కనకాల,ఝాన్సీ ప్రధాన పాత్రలు పోషించిన ఫ్యామిలీ కామెడీ వెబ్ సిరీస్ హోమ్ టౌన్ ఆహా లో ప్రసారం అవుతుంది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కి మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే మిడిల్ క్లాస్ కామెడీ ఈ వెబ్ సిరీస్ కి హైలైట్. దాంతో అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 90స్ ఏ మెలోడీ క్లాసిక్ బయోపిక్ సిరీస్ ఓటిటిలో రిలీజ్ అయ్యి అందరి మనసులు దోచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హోమ్ టౌన్ కూడా ఈకోవకు చెందినదే. శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ నవీన్, శేఖర్ మేడారం నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా రాజీవ్ బిగ్ టీవీ కిస్సిక్ షో లో జబర్దస్త్ వర్ష తో ముచ్చటించారు. తన వెబ్ సిరీస్ గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. రాజీవ్ సుమ విడాకుల రూమర్స్ గురించి ఆ టైంలో తన కొడుకు రోషన్ రియాక్షన్స్ గురించి ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇంటికి దూరంగా నాన్నకి దగ్గరగా..

మీకు సుమ గారికి విడాకులు రూమర్స్ వచ్చినప్పుడు అందరూ నిజం అనుకొని చాలా బాధపడ్డారు. అది ఎంతవరకు నిజం అని వర్షా అడిగిన ప్రశ్నకు రాజీవ్ సమాధానం ఇస్తూ ” అసలు అలాంటి రూమర్స్ రావడానికి కారణం ఏంటంటే, మేము హైదరాబాద్ మణికొండలో పెద్ద ఇంట్లో ఉండేవాళ్లం. మా పాప ఆడుకోవడానికి అక్కడ ప్లేస్ లేదు. బయటికి వచ్చి ఆడుకుంటుంటే అందరూ ఏదోలా చూస్తున్నారు. తను కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు. తను ఒక్కతే ఏం ఆడుకుంటుంది. అక్కడ పిల్లలు ఆడుకోడానికి ఎవరూ లేరు. అందుకని నేను వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాము. మా ఫాదర్, మదర్ కూడా ఉండేవాళ్ళప్పుడు. మేము LNT నగర్ లో ఇల్లు తీసుకున్నాము. కొంతకాలానికి మా అమ్మ చనిపోయారు. దాంతో మా నాన్న ఒంటరిగా ఉన్నారు. ఆయనను మా ఇంటికి రమ్మంటే రాలేదు. నేను మా నాన్న గారి కోసం LNT ఇంటికి వెళ్లే వాడిని. తక్కువ గా మణికొండ లో ఉండేవాణ్ణి. అది చూసి అందరూ మేమిద్దరం విడాకులు తీసుకున్నట్లు రూమర్స్ సృష్టించారు. నేను ఎక్కువ ఇంట్లో కనిపించకపోయేసరికి అలా అనుకుని ఉంటారు. ఇన్సైడ్ జరగనివి అందరూ ఊహించుకొని, రూమర్స్ సృష్టించారు. ఆ టైంలో నేను బయటికి వచ్చి వాటిని ఖండిస్తే దాని గురించి మళ్లీ చర్చలు మొదలయ్యేవి. ఆ విషయాన్ని పొడిగించడం ఇష్టం లేక నేను బయట ఎక్కడా ఖండించలేదు. నేను సంజాయిషీ ఇస్తే అది పాజిటివ్ గా తీసుకునే వాళ్ళ కన్నా నెగిటివ్గా తీసుకునే వాళ్లే ఈరోజుల్లో ఎక్కువయ్యారు. అందుకే బయటకు వచ్చి విడాకులు టాపిక్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు.


రోషన్ రియాక్షన్..

ఇలా రూమర్స్ వచ్చినప్పుడు నాతోపాటు నా ఇంట్లో వాళ్ళు కూడా బాధ పడేవారు. ముఖ్యంగా మా పిల్లలు వాళ్ల దగ్గరికి వచ్చి మీ అమ్మ నాన్న విడిపోతున్నారు అంట కదా అని అడిగితే వాళ్ళు చాలా బాధపడేవాళ్లు. వాళ్ళు కలిసే ఉంటున్నారని చెప్పగలుగుతారు. నా కొడుకు ఇలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేశాడు. రోషన్ వచ్చి నన్ను అడిగాడు. ఏంటి డాడీ వాళ్లందరూ అలా మాట్లాడుతుంటే ఎలా అని అన్నాడు కానీ, నేను చాలా కూల్ గా మేము సెలబ్రిటీలం కదా నాన్న అలానే మాట్లాడుతారు. నువ్వు రియాక్ట్ అవ్వద్దు ఎక్కడ బయట పబ్లిక్ గా మాట్లాడొద్దు. నువ్వు ఆవేశపడి కొట్టడం కానీ ఏమీ చేయొద్దు. అసలు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. మన పని మనం చూసుకోవడమే అని నేను చెప్పిన తర్వాత రోషన్ కొంచెం కూల్ అయ్యాడు. ఇదంతా ఒట్టి రూమర్స్, సుమ నేను 25, 26 వ పెళ్ళిరోజు వేడుకలు కూడా మీ ముందే జరుపుకున్నాం. మేమిద్దరం ఇప్పటికీ చాలా సంతోషంగా కలిసి ఉంటున్నాం. మేం విడాకులు తీసుకుంటాం అనేది ఫేక్ అని రాజీవ్ సమాధానం చెప్పారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×