Illu Illalu Pillalu Today Episode july 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ ఉదయం లేవగానే ధీరజ్ నీకు గుడికి తీసుకుని వెళుతుంది. ఇంత ఉదయాన్నే నీకు ఇంత మంచి అలవాట్లు ఏంటి అని ప్రేమపై సెటైర్లు వేస్తాడు ధీరజ్. మనసేం బాగోలేదు పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అందుకే గుడికి తీసుకుని వచ్చాను అని అంటుంది. నాకు డెలివరీ కి టైం అవుతుంది వెళ్దామా అని ధీరజ్ అంటాడు.. కాసేపు కూర్చుని వెళ్దామని అక్కడ కథ చెప్పే వ్యక్తిని చూసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ కథను విని ధీరజ్ కోసం ఏదైనా చేయాలి నాకోసం చాలా కష్టపడుతున్నాడని ఒక నిర్ణయం తీసుకుంటుంది. కచ్చితంగా ధీరజ్ కి మనీ సపోర్ట్ నేను ఇవ్వాలి అని అనుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా కూడా నేను వాడికి సపోర్ట్ గా ఉండాలి అని ఫిక్స్ అవుతుంది. ఎప్పటిలాగే రెండు వేళ్ళు చూపించి పట్టుకోమని అడుగుతుంది.. ధీరజ్ మాత్రం టెన్షన్ పడుతూ పెద్ద గొడవ సృష్టించవద్దు అని అంటాడు. అదేం లేదులేరా పద వెళ్లిపోదామని ప్రేమ అంటుంది. ధీరజ్ కష్టాన్ని చూసిన ప్రేమ కచ్చితంగా ఎవరేమనుకున్నా కూడా నేను జాబ్ చేసి ధీరజ్ కి తోడుగా ఉండాలని అనుకుంటుంది.. డాన్స్ క్లాస్ కి వెళ్ళాలని అనుకుంటుంది. డాన్స్ కి వెళుతుంది. నర్మదా ప్రేమకు ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో అక్కడికి వెళుతుంది. అప్పుడే చందు అన్న 10 లక్షలు మ్యాటర్ గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ, నర్మద కలిసి ఆ వల్లి మ్యాటర్ గురించి మాట్లాడుకుంటారు.. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్ముతాడు ఆ సెంటర్ కి మనం వెళ్దాం పద అని నర్మదా ప్రేమను తీసుకొని వెళుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఒకచోట ఆనందరావు ఇడ్లీలు అమ్మడం చూసి అక్కడికి వెళ్తారు. బాబాయ్ నాకు ఒక రెండు ఇడ్లీలు అని నర్మదా అడుగుతుంది. ఆనందరావు షాక్ అవుతాడు. ఇలా అమ్మాలి అని రావు ఏదో ఒక కుర్రాన్ని పట్టుకొని మేనేజ్ చేస్తాడు. ఇలా అమ్మితే కస్టమర్లు బాగా వస్తారని ఆయన అంటాడు.
నర్మద ప్రేమలను చూసిన ఆనంద్ రావు మైండ్ బ్లాక్ అవుతుంది. ఏం చేయాలో తెలియక అక్కడున్న ఒక కుర్రాడికి పనప్పగిచ్చేసి అక్కడి నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేస్తాడు. ఆఫీస్ కి వెళ్తుంటే అయినా మీరు ఏంటమ్మా ఇక్కడికి వచ్చారు. ఆఫీస్ కి వెళ్తుంటే ఇలా టిఫిన్ చేద్దామని వచ్చాను బాబాయ్ అని నర్మదా అంటుంది. వీళ్లు మనవాళ్లే ఏం కావాలో అమ్మాయిలకు చూసుకోండి అని అంటాడు.. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ బాబాయ్ అని ప్రేమ అడుగుతుంది.
సూట్ వేసుకున్న ఆనందరావు ఏం మాట్లాడాలమ్మ చెప్పండి అని అడుగుతాడు. ఎవరైనా సూట్ వేసుకుంటే షూ వేసుకుంటారు మీరేంటి బాబాయ్ చెప్పులు వేసుకున్నారు అని అడుగుతారు. ఇక్కడ అందరూ చెప్పులేసుకుంటారు కదా అమ్మ అందుకే నేను కూడా చెప్పులు వేసుకుని వచ్చాను అని అంటాడు. మొత్తానికి నర్మదా ప్రేమలకు ఆనంద్ రావు పై అనుమానం మొదలవుతుంది. ఎంత ఆనందరావు మేనేజ్ చేయాలని చూసినా కూడా నర్మద ప్రేమలు మాత్రం ఏదో ఒకటి మెలిక పెట్టి ఇరికిస్తుంటారు.
ఏదో ఒకటి మేనేజ్ చేసి అక్కడ నుంచి మెల్లగా జారుకుని వెళ్లిపోతాడు ఆనందరావు. అయితే ఆనందరావు కోటు వెనకాల ఏదో రాసి ఉంటుంది.. దాని ఫోటో తీసుకొని ఇది కోట్లు రెంటుకు ఇచ్చే షాప్ లాగా ఉంది. మనం దీన్ని ఎక్కడో కనుక్కొని ఈ శ్రీవల్లి అసలు బండారం బయట పెట్టాలని అనుకుంటారు. శ్రీవల్లి నర్మద మాత్రం ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అని కన్ఫామ్ చేసుకుంటారు.
అటు శ్రీవల్లి తన పుట్టింటికి వెళ్లి భాగ్యంతో గొడవకు దిగుతుంది. ఏమైంది అమ్మడు నువ్వు లేకపోతే ఇల్లంతా కలలేకుండా పోయింది నువ్వు వచ్చిన తర్వాత ఆ కళ మళ్లీ వచ్చింది అని అంటుంది. ఐదు రోజులు ఆగు ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయి పిండి రుబ్బుకుంటూ ఉండి పోదామని శ్రీవల్లి భాగ్యంపై సీరియస్ అవుతుంది. అప్పుడే ఆనందరావు వెనకాల ఏదో కుక్క తరిమినట్టు వచ్చి భాగ్యం మీద పడతాడు. ఏమైంది ఇలా పడ్డావు అని భాగ్యం అరుస్తుంది..
జస్ట్ మిస్ అయ్యాను తప్పించుకుని వచ్చేసాను అని ఆనందరావు అంటాడు. ఏమైంది ఏం జరిగింది అసలు అని అడుగుతుంది భాగ్యం. నర్మద ప్రేమలు నామీద అనుమానంతో ఇక్కడికి వచ్చారు ఇడ్లీలు బిజినెస్ దగ్గరకు వచ్చి మాట్లాడారు అని ఆనందరావు అంటాడు. అయిపోయింది మొత్తం అయిపోయింది నాకు కాపురం కొల్లేరు అయిపోయిందని శ్రీవల్లి అంటుంది. నర్మదా, ప్రేమ లు 10 లక్షలు గురించి తెలుసుకుంటానని అన్నారు బయటపడిపోతుందని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది..
నర్మదా శ్రీవల్లిలో ఆ షాప్ వారికి వెళ్లి అక్కడ ఆనందరావు ఫోటోను చూపించి ఆ కోర్టు మీ షాప్ లో గాని కన్ఫామ్ చేసుకుంటారు.. పక్క ఇది ఫ్రాడ్ ఫ్యామిలీ అని కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని నర్మదా ప్రేమలు అనుకుంటారు.. రాత్రి అందరూ భోజనం చేస్తూ ఉంటే శ్రీవల్లి మాత్రం నర్మదా ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.. కానీ అప్పుడే ఎంట్రీ ఇచ్చిన నర్మద ప్రేమలను వేదవతి ఎక్కడికి వెళ్లారు అంటే ఒక బండారం బయట పెట్టాలని వెళ్ళామని అంటారు.
Also Read:అక్షయ్, అవనిని చూసి పార్వతి షాక్.. రాజేంద్ర ప్రసాద్ వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి..
ఏంటి ఏ బండారం ఏ పని పట్టడానికి వెళ్లారు మీరు అని వేదవతి అడుగుతుంది. ఆ మాట వినగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.. ప్రేమ వల్లి అక్కను చూస్తుంటే ఏదో టెన్షన్ పడుతున్నట్లు అనిపిస్తుంది అని అంటుంది.. దానికి వల్లి నేను టెన్షన్ పడుతున్నానా ఎందుకు టెన్షన్.. ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఉత్సాహంగా ఉన్నాను చూడండి అని అంటుంది. నువ్వు సంతోషించే విషయం ఒకటి చెప్పనా మీ నాన్నగారిని మేము మున్సిపల్ ఆఫీసు దగ్గర సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతుంటే కలిసాము అని అంటారు. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..